హీరోయిన్లే గేమ్ ఛేంజర్లా?
రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది.
By: M Prashanth | 24 May 2026 10:00 PM ISTరాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ యాక్షన్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆ మూవీపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా యష్ చేసిన కామెంట్స్ సినిమాపై ఉన్న హైప్ ను మరింత పెంచేశాయి.
సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు పాటలు, గ్లామర్ లేదా హీరో చుట్టూ తిరిగే సన్నివేశాలకు పరిమితం అవుతుంటాయి. కానీ టాక్సిక్ లో మాత్రం ఆ ఫార్ములాను పూర్తిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు యష్ వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోయిన్లు నయనతార, కియారా అద్వానీ రోల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని తెలిపారు.
సినిమాలో వారు కేవలం గ్లామర్ డాల్స్ గా కనిపించరని, స్ట్రాంగ్ పర్సనాలిటీ కలిగిన బ్యాడ్ యాస్ ఉమెన్ పాత్రల్లో కనిపించనున్నారని యష్ హింట్ ఇచ్చారు. అంతేకాదు, వారి పాత్రల్లో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని చెప్పడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని విధంగా నయనతార, కియారా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఉమెన్ రోల్స్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడిన యష్, "మా కథలో ప్రతి ఫిమేల్ రోల్ తన జీవితానికి తానే బాధ్యత వహించే వ్యక్తిగా కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే స్ట్రాంగ్ పాత్రలు ఇందులో ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలో రాజకీయాలు, హింస, ఎమోషన్స్ ఉంటాయి. వాటిని మహిళా యాంగిల్ నుంచి చూపించినప్పుడు కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది" అని తెలిపారు.
యష్ చేసిన వ్యాఖ్యలతో టాక్సిక్ కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదని, భావోద్వేగాలు, పవర్‌ఫుల్ క్యారెక్టర్లు కలిసిన ఇంటెన్స్ డ్రామాగా ఉండబోతుందని అర్థమవుతోంది. ముఖ్యంగా ఫిమేల్ లీడ్ రోల్స్ చుట్టూ కథలో కీలక మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని అర్థమవుతోంది.
ఇక టాక్సిక్ సినిమాను భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్షన్స్ తెరకెక్కిసస్తుండగా.. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ ప్రెజెంటేషన్ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదని సమాచారం. యష్ కూడా ఆ సినిమా కోసం ప్రత్యేక లుక్ తో పాటు తన రోల్ పై భారీగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేశాయి.
మరోవైపు, సినిమాను ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. విడుదలకు ముందు భారీ ప్రమోషన్లు కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యష్ ఇచ్చిన తాజా హింట్ తో ఇప్పుడు అభిమానుల్లో ఒకే చర్చ నడుస్తోంది.. టాక్సిక్ లో హీరో మాత్రమే కాదు.. హీరోయిన్లే అసలు గేమ్ ఛేంజర్స్ అవుతారా అని! మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.
