Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ లేకుండా యష్.. ఇదే అసలు పాన్ ఇండియా టెస్ట్!

సౌత్ నుంచి పాన్ ఇండియా మార్కెట్‌ను పవర్ఫుల్ గా పట్టుకున్న హీరోల్లో ప్రభాస్ ముందుంటాడు.

By:  M Prashanth   |   24 Aug 2026 9:50 AM IST
కేజీఎఫ్ లేకుండా యష్.. ఇదే అసలు పాన్ ఇండియా టెస్ట్!
X

సౌత్ నుంచి పాన్ ఇండియా మార్కెట్‌ను పవర్ఫుల్ గా పట్టుకున్న హీరోల్లో ప్రభాస్ ముందుంటాడు. ‘బాహుబలి’ తర్వాత కూడా ‘సాహో’, ‘సలార్’, ‘కల్కి’లతో పెద్ద ఓపెనింగ్స్ తెచ్చుకున్నాడు. అంటే ఒకే ఫ్రాంచైజీ మీద ఆయన మార్కెట్ ఆగిపోలేదు. ఇప్పుడు యష్ కూడా అలాంటి దశలోకి వెళ్తాడా లేదా అన్నది ‘టాక్సిక్’తో తెలుస్తుంది.

యష్‌కు ఇప్పటివరకు పెద్ద పాన్ ఇండియా గుర్తింపు ‘కేజీఎఫ్’ వల్లే వచ్చింది. ముఖ్యంగా ‘కేజీఎఫ్ 2’కు మొదటి భాగం ఇచ్చిన హైప్ చాలా ఉపయోగపడింది. రాకీ భాయ్ క్యారెక్టర్‌కే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. కానీ ‘టాక్సిక్’కు ఆ సీక్వెల్ సపోర్ట్ లేదు. పూర్తిగా కొత్త కథ, కొత్త దర్శకురాలు, కొత్త సెటప్. ఇక్కడే యష్ పేరు మీద అసలు మార్కెట్ ఎంతుందో తేలుతుంది.

ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం బలంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇండియాలోనే ఆరు లక్షల వరకు టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. అడ్వాన్స్ గ్రాస్ కూడా రూ.30 కోట్ల మార్క్ దాటినట్లు సమాచారం. రిలీజ్ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల ఓపెనింగ్ వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

ఆ నంబర్ వస్తే యష్‌కు అది పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ‘కేజీఎఫ్’లా తెలిసిన ఫ్రాంచైజీతో కాదు, పూర్తిగా కొత్త సినిమాతో ఆ స్థాయి ఓపెనింగ్ తెచ్చుకున్నట్టవుతుంది. అదే సమయంలో సినిమాకు ‘A’ సర్టిఫికెట్ కూడా ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒక భాగం తగ్గే అవకాశం ఉన్నా, యూత్ మాస్ ప్రేక్షకుల నుంచి డిమాండ్ మాత్రం బలంగానే కనిపిస్తోంది.

ఇక్కడ ప్రభాస్‌తో ఎవరు పెద్ద స్టార్ అనే పోలిక అవసరం లేదు. ప్రభాస్ తన మార్కెట్‌ను ఇప్పటికే పలు సినిమాలతో చూపించాడు. యష్‌కు మాత్రం ‘టాక్సిక్’ మొదటి పెద్ద సోలో పరీక్ష. ‘కేజీఎఫ్’ పేరు లేకుండా కూడా ఆయన సినిమాకు నార్త్, సౌత్, ఓవర్సీస్‌లో అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందా అన్నదే చూడాలి.

‘టాక్సిక్’ భారీ ఓపెనింగ్‌తో పాటు మంచి రన్ కూడా తీసుకుంటే యష్‌కు తర్వాతి సినిమాల దగ్గర లెక్క పూర్తిగా మారుతుంది. ఇక ఆయనను కేజీఎఫ్ లక్కీ స్టార్ అనే చాన్స్ ఉండదు. కొత్త కథతో కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగల హీరోగా నిలబడతాడు. మరి టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్టామినా కనిపిస్తుందో చూడాలి.