Begin typing your search above and press return to search.

క్వాలిటీ కోసం ఎంత కాల‌మైనా వెయిట్ చేస్తాం!

`విడుదల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుంద‌ని సినిమాను చుట్టేయాలనుకోవడం లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద నెంబ‌ర్లు ముఖ్యం కాదు.

By:  Srikanth Kontham   |   17 May 2026 11:00 PM IST
క్వాలిటీ కోసం ఎంత కాల‌మైనా వెయిట్ చేస్తాం!
X

`కేజీఎఫ్` సిరీస్ చిత్రాలతో పాన్-ఇండియా లో సంచలన స్టార్‌డమ్ సొంతం చేసుకున్న కన్నడ సూపర్ స్టార్ రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం తదుపరి భారీ ప్రాజెక్ట్ `టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్` షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా ప్రకటించిన విడుదల తేదీ కంటే సినిమా ఆలస్యం కావ‌డంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా నిర్ణయాన్ని సమర్థిస్తూ హీరో యష్ లండన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

`విడుదల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుంద‌ని సినిమాను చుట్టేయాలనుకోవడం లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద నెంబ‌ర్లు ముఖ్యం కాదు. వెండితెరపై మేము ప్రేక్షకులకు ఎలాంటి క్వాలిటీ కంటెంట్ అందిస్తున్నామనేదే అత్యంత ముఖ్యం. సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో పక్కా ప్రణాళికతో తెరకెక్కించడానికే సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పాన్-ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి ఉండే అంచనాలు భారీగా పెరుగుతాయని, వాటిని అందుకోవడంలో ఎలాంటి రాజీ పడకూడదనేదే తన పంథా అని యష్ వివరించారు.

లండన్ షెడ్యూల్‌లో హాలీవుడ్ స్థాయి యాక్షన్ విజువల్స్ , సాంకేతికతను వాడుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. గీతూ మోహన్‌దాస్ విజన్‌కు అనుగుణంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉండటం కోసం ఎంత సమయమైనా కేటాయిం చడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఆలస్యం సినిమా అవుట్‌పుట్‌ను మరింత మెరుగుపరుస్తుందని యష్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో క్యాస్టింగ్ పరంగా కూడా పలు ఆసక్తికర మార్పులు , అప్‌డేట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీస్ కియారా అద్వానీ, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా నటీనటుల వివరాలను వెల్లడిస్తుందని అప్పటి వరకు రూమర్స్ నమ్మవ ద్దని కోరారు. పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌కు తగ్గట్టుగా ఇంటర్నేషనల్ వైబ్స్ ఉన్న నటీనటులను సినిమా తీసుకున్న‌ట్లు హింట్ ఇచ్చారు. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాన్ని కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సరికొత్త పంథాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ప్రెజెంట్ చేయాలనే కసి చిత్ర యూనిట్‌లో కనిపిస్తోంది. యష్ ఇచ్చిన తాజా క్లారిటీతో విడుదల వాయిదాపై అభిమానుల్లో ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. బాక్సాఫీస్ రేసులో ముందుండటం కంటే? లాంగ్ రన్‌లో నిలిచే అద్భుతమైన సినిమాను అందించడమే ధ్యేయంగా రాకింగ్ స్టార్ యష్ అడుగులు వేస్తున్నారు. `టాక్సిక్` విడుదల తేదీ మారినా? అది కంటెంట్ పరంగా విజువల్ ట్రీట్‌లా ఉంటుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.