Begin typing your search above and press return to search.

'టాక్సిక్' ట్రైల‌ర్ లాంచ్: గీతూ మోహన్‌దాస్ ఎమోషనల్ స్పీచ్

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో అత్యంత ఘనంగా జరిగింది.

By:  Sivaji Kontham   |   8 Aug 2026 11:41 PM IST
టాక్సిక్ ట్రైల‌ర్ లాంచ్: గీతూ మోహన్‌దాస్ ఎమోషనల్ స్పీచ్
X

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఎమోషనల్ స్పీచ్ అభిమానులను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. తాను ఒక దర్శకురాలిగా స్వేచ్ఛగా పనిచేయడానికి ... తన కలలను నెరవేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలుగా తన బిడ్డను కంటికి రెప్పలా చూసుకున్న తన తల్లికి వేదికపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సినిమా నిర్మించడంలో నిర్మాత వెంకట్ అందించిన మద్దతును గీతూ ప్రత్యేకంగా కొనియాడారు. నటీనటులందరి కంటే కూడా ఈ సినిమాలోని డైలాగ్‌లన్నీ నోటికొచ్చిన ఏకైక వ్యక్తి నిర్మాత వెంకట్ మాత్రమేనని సరదాగా వ్యాఖ్యానించారు. ఎటువంటి ఆంక్షలు విధించకుండా.. సినిమా విజన్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడకుండా... వచ్చిన కష్టాలన్నింటినీ తనపై వేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను సాధ్యం చేసిన వ్యక్తి ఆయనేనని కొనియాడారు.

కంటికి కనిపించకుండా రాత్రింబవళ్లు శ్రమించిన ప్రొడక్షన్ - టెక్నికల్ టీమ్‌కి గీతూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినిమాలో నటించిన నయనతార, కియారా అద్వాణీ, హుమా ఖురేషీ, తారా సుతారియాతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నటీనటులందరితో ఏర్పడిన ఈ అనుబంధం కేవలం సినిమాకే పరిమితం కాదని.. జీవితాంతం తాను వారికి ఒక `2 AM ఫ్రెండ్‌`గా తోడుంటానని హామీ ఇచ్చారు.

కథానాయకుడు యష్ గురించి మాట్లాడే సమయంలో గీతూ మోహన్‌దాస్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. యష్‌తో పనిచేయడం ఎలాంటి అనుభూతి అని ప్రతీ ఒక్కరూ నన్ను అడుగుతుంటారని... కానీ ఆ అనుభవాన్ని వర్ణించడానికి తనకు మాటలు సరిపోవడం లేదని చెప్పారు. యష్ తనకు కేవలం ఒక కో-ప్రొడ్యూసర్... అద్భుతమైన నటుడు లేదా కో-రైటర్ మాత్రమే కాదని... ఆయన తనకు ఒక పవర్‌ఫుల్ `ఎమోషన్` అని ఎంతో భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

'టాక్సిక్' సినిమా పూర్తయిన తర్వాత తన భవిష్యత్తు ప్రయాణం ఎటు సాగుతుందో తనకు తెలియదు కానీ... తాను జీవితంలో నిర్మించే ప్రతీ సినిమాలో యష్ ఇచ్చిన స్ఫూర్తి... ఆయన ప్రభావం కచ్చితంగా ఉండి తీరుతుందని అన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులందరి కృషితో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షక లోకాన్ని అలరిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఇక ఇదే వేదిక‌పై టాక్సిక్ చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మ‌వ్వ‌డంపై వ‌చ్చిన రూమ‌ర్స్ ని య‌ష్ ఖండించారు. గీతూ మోహ‌న్ దాస్ ప‌నిత‌నానికి, ప్ర‌తిభ‌కు పెద్ద పీట వేసి ఈ అవ‌కాశం క‌ల్పించాన‌ని కూడా క్లారిటీని ఇచ్చారు. తాజాగా విడుద‌లైన‌ టాక్సిక్ ట్రైల‌ర్ జెట్ స్పీడ్ తో వైర‌ల్ అవుతోంది.