కనకవతి కూడా హద్దులు చెరిపేసిందా?
కన్నడ చిత్రం టాక్సిక్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అయినా? అందులో బోల్డ్ కంటెంట్ కూడా అంతే హైలైట్ అవుతుందని చిన్న టీజర్ తోనూ ప్రూవ్ అయింది.
By: Srikanth Kontham | 4 March 2026 1:00 PM ISTకన్నడ చిత్రం టాక్సిక్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అయినా? అందులో బోల్డ్ కంటెంట్ కూడా అంతే హైలైట్ అవుతుందని చిన్న టీజర్ తోనూ ప్రూవ్ అయింది. ఆగి ఉన్న కారులో అశ్లీల సన్నివేశంతో ఓ యాక్షన్ సన్నివేశాన్ని లేడీ డైరెక్టర్ గీతూమోహన్ దాస్ ఎంతో క్రియేటివ్ గా డిజైన్ చేసింది. ఓ లేడీ అయి ఉండి అంతటి సాహసం చేయడం చిన్న విషయం కాదు. ఆ పరంగా చూస్తే? గీతూ మోహన్ దాస్ పై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అయినా వాటిని గీతూ లైట్ తీసుకుంది. సినిమాలో తాను చెప్పాలనుకున్న పాయింట్ ని నిర్మొహ మాటంగా, నిరభ్యంతరంగా చెప్పేస్తుందని క్లారిటీ వచ్చేసింది.
ఎన్ని విమర్శలొచ్చినా? ఎవ్వరేమనుకున్నా పట్టించుకునే టైప్ కాదు. నా దారి నాదే అంటూ ముందుకెళ్లిపోతుంది. ఇక సినిమాలో అందమైన భామలకు కొదవలేదు. కియారా అద్వాణీ , నయనతార, హమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ ఇలా అందమైన భామలంతా నటిస్తున్నారు. తెరంతా రంగుల మయం కావడం ఖాయం. టాక్సిక్ లో ఎవరు ఎలాంటి పాత్రర పోషిస్తున్నారు? అన్నది నేరుగా సినిమా చూసి తెలుసుకోవడం తప్ప గీతూ ఎక్కడా హింట్ ఇవ్వలేదు. హీరోయిన్ రోల్ మాత్రం కియారా పోస్తుందని క్లారిటీ ఉంది. మిగతా పాత్రలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
అయితే లీకైన సమాచారం ఏంటంటే? సినిమాలో రుక్మీణి వసంత్ బోల్డ్ పాత్రలో కనిపించబోతుందట. ఓ డాన్ కి ప్రియురాలి పాత్రలో కనిపించనుందట. దీనిలో భాగంగా అమ్మడు బెడ్ రూమ్ సీన్స్ లో కూడా కనిపించనుందని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకూ మీరు చూసిన కనకవతి వేరు ఇకపై చూడ బోయే కనకవతి వేరు? అంటూ మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. అయితే ఇంత వరకూ రుక్మిణీ వసంత్ పై డీసెంట్ ఇమేజ్ మాత్రమే ఉంది. పోషించిన పాత్రలు కూడా అంతే డీసెంట్ గా ఉంటాయి.
ఎక్కడా అసభ్యతకు, అశ్లీలతకు తావు లేకుండానే నటించింది. క్లాసిక్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపించింది. కానీ టాక్సిక్ అలాంటి కంటెంట్ కాదు. బోల్డ్ గా ఉంటుంది. డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే ఇంటర్నేషన్ కాన్సెప్ట్ ను తీసుకున్నారు. ఇలాంటి కథా నేపథ్యమంటే? గాళ్స్ పాత్రలు కూడా అంతే బోల్డ్ గా ఉంటాయి. గన్స్, మత్తు పదార్దాలు, క్రైమ్ చుట్టూ కథ నడుస్తుంది. ఇలాంటి కథల్లో ఉమెన్ పాత్రలు అంతే హాట్గా హైలైట్ అవుతుంటాయి.అయితే రుక్మిణీ వసంత్ సినిమాల్లో పద్ధతిగా కనిపించినా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మాత్రం అప్పుడప్పుడు మోడ్రన్ ఫోటోషూట్స్ తో ఆమెలోని గ్లామరస్ యాంగిల్‌ను హైలైట్ చేసింది. వెస్ట్రన్ వేర్ -స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌లో ఎంతో ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.
