'టాక్సిక్' ఎఫెక్ట్... ఇక మీదట అలా జరగదు!
సినిమాలకు ఒకప్పుడు ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారా వచ్చేది. ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ ద్వారా బడ్జెట్‌లో కొంత భాగం వచ్చేది.
By: Ramesh Palla | 8 Sept 2026 9:00 PM ISTసినిమాలకు ఒకప్పుడు ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారా వచ్చేది. ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ ద్వారా బడ్జెట్‌లో కొంత భాగం వచ్చేది. పెద్ద హీరోల సినిమాలకు ఒకానొక సమయంలో సినిమా బడ్జెట్‌లో దాదాపుగా 50% శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చేది. ఇప్పుడు ఓటీటీ యుగం నడుస్తోంది. సినిమా బడ్జెట్‌లో మెజార్టీ భాగం ఓటీటీ రైట్స్ విక్రయించడం ద్వారా నిర్మాతలకు దక్కుతుంది. కొన్ని మీడియం రేంజ్, చిన్న బడ్జెట్ సినిమాలకు పెట్టిన బడ్జెట్‌కు మించి ఓటీటీ రైట్స్ రావడం మనం చూశాం. సినిమాకు దక్కిన క్రేజ్, ఆ సినిమాను జనాల్లోకి ఫిల్మ్ మేకర్స్ తీసుకు వెళ్లిన తీరును బట్టి ఓటీటీలు రేటు నిర్ణయిస్తున్నాయి. చిన్న సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అయితే భారీ అమౌంట్ ఇచ్చేందుకు ఓటీటీలు సిద్ధంగా ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలకు సైతం ఓటీటీలు పదుల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు రెడీగా ఉంటాయి. ఓటీటీ బబుల్ బ్లాస్ట్ అయింది. రెండు మూడు ఏళ్ల పాటు ఓటీటీ సంస్థలు ఇచ్చే అమౌంట్స్‌తో నిర్మాతలు ఫుల్ ఖుషి అయ్యే వారు, మెల్ల మెల్లగా పరిస్థితి మారుతూ వచ్చింది.
భారీ బడ్జెట్ సినిమాలకు ఓటీటీ రైట్స్...
ఓటీటీలు ఇష్టానుసారంగా కంటెంట్‌పై ముఖ్యంగా సినిమాలపై ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేరు. ఓటీటీ లు పెరగడంతో పాటు, ఇతర కారణాల వల్ల సినిమాలపై ఓటీటీ సంస్థలు పెద్ద మొత్తంలో పెట్టేందుకు వెనకాడుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు నిర్మాతలు ఓటీటీలతో పెద్ద మొత్తం కు బేరం ఆడటం, విడుదలకు ముందు బేరం కుదరక పోవడం తో.. రిలీజ్ తర్వాత ఓటీటీ డీల్ చేసుకోవాలి అనుకోవడం చేస్తున్నారు. లక్కీగా సినిమా సూపర్ హిట్ అయితే అనుకున్నంత రేటును ఓటీటీ వారు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ సినిమా ఫ్లాప్ అయితే ముందుగా ఓటీటీ వారు కోట్ చేసిన మొత్తంలో కనీసం సగం అమౌంట్ కూడా ఇచ్చేందుకు ముందుకు రారు. అసలు కొన్ని సినిమాలను కనీసం కొనుగోలు చేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. అలా చాలా సినిమాలు ఓటీటీ డీల్ కు నోచుకోకుండా ఉన్నాయి.
యశ్ టాక్సిక్ సినిమా ఓటీటీ డీల్...
తాజాగా టాక్సిక్ సినిమా ఓటీటీ డీల్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీని ప్రముఖ ఓటీటీ విడుదలకు ముందు అన్ని భాషలకు కలిపి రూ.150 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే నిర్మాత భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడట. యశ్ సైతం టాక్సిక్ సినిమాకు రూ.150 కోట్ల ఓటీటీ డీల్ కరెక్ట్ కాదు, అంతకు మించి కావాల్సిందే అని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దాంతో విడుదల వరకు ఓటీటీ డీల్ క్లోజ్ కాలేదు. సినిమా విడుదల తర్వాత ఫలితం ఏంటో తెలిసిందే. ఇప్పుడు అదే ఓటీటీ సంస్థ రూ.150 కోట్లు కాదు కదా కనీసం రూ.100 కోట్లకు కూడా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. విశ్వనీసంగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం రూ.30 కోట్లకు టాక్సిక్ డిజిటల్ రైట్స్ ను అడుగుతున్నారట. ఆ మొత్తానికి సరే అంటే తీసుకునేందుకు రెడీ, అంతకు మించి డిమాండ్ చేస్తే మరో ఓటీటీని చూసుకోమని అన్నారట.
పెద్ద చిత్రాల నిర్మాతలు...
టాక్సిక్ నిర్మాతకు ఓటీటీ రైట్స్ పడిపోవడంతో పెద్ద షాక్ తగిలినట్లు అయింది. కేవలం టాక్సిక్ నిర్మాతకు మాత్రమే కాకుండా చాలా మంది నిర్మాతలు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే టాక్సిక్ నిర్మాతకు రూ.100 కోట్లకు పైగా నష్టం రాబోతున్నట్లు చెబుతున్నారు. విడుదలకు ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకోలేక పోతే, విడుదల విషయంలోనూ గందరగోళం ఉంటుంది. ఓటీటీతో ఎంతో కొంతకు డీల్ సెట్ చేసుకుంటే రిలీజ్ డేట్ వారు చెప్పినట్లు వెళ్లి పోవచ్చు. లేదంటే వాయిదా మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కనుక ఇకపై అయినా ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాపై ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా రిలీజ్‌కి ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంటే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
సినిమా విడుదల తర్వాత ఫెయిల్ అయితే అప్పుడు ఇబ్బంది పడటం, నష్టపోవడం ఎందుకు అనేది విశ్లేషకుల మాట. కంటెంట్ పై నమ్మకంతో సినిమాను రిలీజ్ వరకు ఓటీటీ కి అమ్మకుండా చిన్న సినిమాలకు, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకు వర్కౌట్ కావచ్చు. కానీ భారీ బడ్జెట్ సినిమాల ఓటీటీ డీల్స్ రిలీజ్‌కి ముందే క్లోజ్ చేస్తే అన్ని విధాలుగా ఉత్తమం. టాక్సిక్ ఎఫెక్ట్‌తో ఇకపై రిలీజ్‌కి ముందే డీల్ క్లోజ్ చేసుకోవచ్చు.
