Begin typing your search above and press return to search.

'టాక్సిక్' ద‌ర్శ‌కురాలి ప‌నిత‌నాన్ని ఆకాశానికెత్తేసాడు!

య‌ష్ ప్రధాన పాత్ర‌లో గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వ‌హిస్తున్న‌ `టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్` కన్నడ- ఇంగ్లీష్ భాషలలో ఏకకాలంలో తెర‌కెక్కుతోంది.

By:  Sivaji Kontham   |   27 Aug 2025 5:00 AM IST
టాక్సిక్ ద‌ర్శ‌కురాలి ప‌నిత‌నాన్ని ఆకాశానికెత్తేసాడు!
X

య‌ష్ ప్రధాన పాత్ర‌లో గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వ‌హిస్తున్న‌ `టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్` కన్నడ- ఇంగ్లీష్ భాషలలో ఏకకాలంలో తెర‌కెక్కుతోంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో డబ్బింగ్ వెర్షన్‌లను విడుద‌ల చేస్తారు. ఈ చిత్రంలో యష్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్ త‌దిత‌రులు నటించారు. 19 మార్చి 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే టాక్సిక్ సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్ర‌తిదీ ప్ర‌త్యేకంగా నిలుస్తాయ‌ని హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ జేజే ఫెర్రీ అన్నారు. భార‌తీయ సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను మేళ‌విస్తూ అధునాత‌న సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి ఈ సినిమాని రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. భార‌త దేశ సంస్కృతి పురాత‌నమైన‌ది. గొప్ప‌ది.. పొర‌లు పొర‌లుగా ఉంటుంది.. ప్ర‌పంచ సినిమా వ్యాక‌ర‌ణాన్ని భార‌తీయ సినిమాతో మేళవించి చూపించే అనుభ‌వం ఎంతో గొప్ప‌ది! అని ఫెర్రీ అన్నారు. భార‌తీయ సంస్కృతి నాలో ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతుంద‌ని కూడా ఫెర్రీ అన్నారు. సుదీర్ఘ కెరీర్ లో స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ గా ప‌లు బ్లాక్ బస్ట‌ర్ హాలీవుడ్ చిత్రాల‌కు ఫెర్రీ ప‌ని చేసారు. 35 ఏళ్ల‌లో 39 దేశాల‌లో ప‌ని చేసాన‌ని, భార‌తీయ సినిమాకి అభిమానిని అని.. అన్నారు. భార‌తీయ సినిమా సృజ‌నాత్మ‌క‌త, క‌ళాత్మ‌క‌త‌పైనా ప్ర‌శంస‌లు కురిపించారు. అంతేకాదు .. గీతూ మోహ‌న్ దాస్ కి గొప్ప విజ‌న్ ఉంద‌ని కూడా జేజే ఫెర్రీ ప్ర‌శంసించారు. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ప్రొడక్షన్ డిజైనర్ - ఆర్ట్ టీమ్‌పైనా ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు.

జె.జె. పెర్రీ 1975లో తన మార్షల్ ఆర్ట్స్ శిక్షణను ప్రారంభించిన గురువు. 1980ల చివరలో సైన్యం నుండి బయటకు వచ్చినప్పుడు స్టంట్ వర్క్‌తో సినీకెరీర్ ని ప్రారంభించాడు. అతడు 24 సంవత్సరాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో ఆరి తేరారు. తైక్వాన్ డోలో 5వ-డిగ్రీ బ్లాక్ బెల్ట్, హాప్కిడోలో 2వ-డిగ్రీ సాధించిన అత‌డు అన్ని రకాల ఆయుధాలతో పోరాటం చేయ‌గ‌ల అనుభ‌వ‌జ్ఞుడు. 12 సంవత్సరాల వయస్సులో తైక్వాన్ డోలో బ్లాక్ బెల్ట్ పొందాడు. 7 నుండి 24 సంవత్సరాల వయస్సు వరకు పోటీ పడ్డాడు. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు బైక్ రైడ్‌లు, రోడియో, వెయిట్ లిఫ్టింగ్‌లో కూడా నైపుణ్యం కలిగి ఉన్నాడు.