Begin typing your search above and press return to search.

ధురంధర్ Vs టాక్సిక్.. రెండింటికీ నష్టమేనా?

ధురంధర్ Vs టాక్సిక్.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడిచింది.

By:  M Prashanth   |   21 March 2026 8:11 PM IST
ధురంధర్ Vs టాక్సిక్.. రెండింటికీ నష్టమేనా?
X

ధురంధర్ Vs టాక్సిక్.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడిచింది. రెండు భారీ సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయని అనౌన్స్మెంట్ రావడంతో ఓవైపు మూవీ లవర్స్ సంతోషపడినా.. మరోవైపు రెండు బడా చిత్రాలు ఒకేసారి వస్తే ఇబ్బందులు తప్పవని అనేక మంది అంచనా వేశారు. కానీ ఆయా సినిమాల మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ పై కట్టుబడి ఉండడంతో ఆ ప్రాజెక్టుల కోసం వెయిట్ చేశారు.

అయితే రీసెంట్ గా టాక్సిక్ మూవీని వాయిదా వేస్తున్నట్లు ఆ సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు. కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ధురంధర్ మూవీకి లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే టాక్సిక్, ధురంధర్.. రెండూ పాన్ ఇండియా సినిమాలే. అలా ధురంధర్: ది రెవెంజ్ మూవీ సోలోగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది.

రీజనల్ మార్కెట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు విడుదల అయినా.. పాన్ ఇండియా మూవీల్లో మాత్రం ధురంధర్: ది రివెంజ్ ఒకటే. గత ఏడాది వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధురంధర్ కు సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా.. ఇప్పుడు ఓ రేంజ్ లో అదరగొడుతోంది. అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.

దీంతో సినిమా చూసిన వారంతా సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తున్నారు. ధురంధర్ సీక్వెల్ అదిరిపోయిందని చెబుతున్నారు. అదే సమయంలో మిస్ అయిన ధురంధర్ వర్సెస్ టాక్సిక్ క్లాష్ ను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ధురంధర్ కంటెంట్ కోసం మాట్లాడుతూ.. టాక్సిక్ కూడా బాగుంటే పర్లేదని.. లేకుంటే పెద్ద ఎత్తున నష్టం ఎదుర్కొనేదని కామెంట్లు పెడుతున్నారు.

అయితే దాన్ని ఎవరూ గెస్ చేయలేం. ఎందుకంటే టాక్సిక్ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి టాక్సిక్ కు నష్టం చేకూరేదని చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం.. కంటెంట్ కాస్త తేడా కొట్టి ఉంటే.. ధురంధర్ తుఫానులో చిక్కుకుని ఇబ్బంది పడడం ఖాయం.

అదే సమయంలో టాక్సిక్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుని ఉంటే.. ధురంధర్ కు సౌత్ లో కచ్చితంగా నష్టం ఎదురయ్యేదని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే టాక్సిక్.. నార్త్ కన్నా సౌత్ లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. కాబట్టి థియేటర్స్ తక్కువగా దొరకడం వల్ల ధురంధర్ కు ఇబ్బంది వచ్చేది. అక్కడ మరో విషయం ఏమిటంటే.. ధురంధర్ సూపర్ హిట్ కనుక.. నార్త్ లో టాక్సిక్ వసూళ్లు తగ్గిపోయేవి. ఏదేమైనా ఇప్పుడు రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి ఉంటే రెండింటికీ నష్టం తప్పేది కాదని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి త్వరలో రానున్న టాక్సిక్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.