'రాయ' గా యష్.. అంతా బాగుంది కానీ!
క్రిటికల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తొలి కమర్షియల్ ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్న చిత్రం టాక్సిక్.
By: Madhu Reddy | 8 Jan 2026 12:02 PM ISTక్రిటికల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తొలి కమర్షియల్ ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్న చిత్రం టాక్సిక్. భారీ అంచనాల మధ్య మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ నేపథ్యంలోనే ఈరోజు యష్ పుట్టినరోజు కావడంతో ఈయన పాత్రను రివీల్ చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ద్వారా కథ ఏంటో చెప్పలేదు కానీ హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం చేశారు.
పాన్ ఇండియా భాషలైన కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం , హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే వినూత్నంగా ఇంగ్లీష్ భాషలో గ్లింప్స్ రిలీజ్ చేయడం అభిమానులను కాస్త ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఈ సినిమాలో యష్ 'రాయ' అనే పాత్రలో నటిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. ఇక ఇదంతా బాగానే ఉన్నా తాజాగా చెప్పలేని రీతిలో గ్లింప్స్ లోని కొన్ని సన్నివేశాలు అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా ఆగ్రహానికి కూడా గురిచేస్తున్నాయనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. చెప్పడానికి సభ్యతగా లేని సన్నివేశాలను గీతూ మోహన్ దాస్స్ సినిమాలో చూపించబోతున్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కనిపించే అడల్ట్ టైప్ కంటెంట్ ఇందులో చేర్చడమే ఆశ్చర్యం అంటే అసలు ఇలాంటి సన్నివేశాలను చూపించే ప్రయత్నం చేసి అభిమానులకు మరింత షాక్ కలిగించారు.
ఇకపోతే ఆశించినట్టే మాస్ అవతారంలో అభిమానులు కోరుకున్నట్టే ఉన్నారు. కానీ ఇలాంటి అడల్ట్ టైపు కంటెంట్ మాత్రం ఎవరు ఊహించలేదు. మొత్తానికైతే పీరియాడిక్ సెటప్ లో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా నుండి విడుదలైన ఈ గ్లింప్స్ ఇప్పుడు విమర్శకుల చేత ట్రోల్స్ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ఇంకెలాంటి రచ్చ జరుగుతుందో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. యష్ 19వ సినిమాగా వస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కాబోతోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట కే నారాయణ , యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, అక్షయ్ ఒబెరాయ్ లాంటి భారీ తారాగణం భాగమైంది. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
