యష్ భాయ్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట!
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `టాక్సిక్` ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్` అని ట్యాగ్ లైన్. ఈ మూవీకి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది.
By: Tupaki Entertainment Desk | 10 Jan 2026 3:11 PM ISTరాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `టాక్సిక్` ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్` అని ట్యాగ్ లైన్. ఈ మూవీకి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా హీరోయిన్‌లుగా కీలక పాత్రల్లో నటించారు. టొవినో థామస్‌తో పాటు కీలక పాత్రలలో హాలీవుడ్ నటీనటులు నథాలియా బర్న్, కైల్ పౌల్, డారెల్ డిసిల్వా నటిస్తున్నారు. `కేజీఎఫ్` వంటి సంచలన చిత్రాల తరువాత యష్ చేస్తున్న మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఫస్ట్ లుక్ నుంచే అంచనాల్ని పెంచేసిన ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ని యష్ పుట్టిన రోజు సందర్భంగా ఇంగ్లీష్ వెర్షన్ లో విడుదల చేయడం తెలిసిందే. ఇందులో యష్ పరిచయ సన్నివేశాలని చూపిస్తూ ఇంటిమేట్ సీన్ ఉండటం, దాన్ని వల్గర్‌గా షూట్ చేయడంతో అభిమానుల నుంచి సినీ లవర్స్, క్రిటిక్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యష్ ఇంట్రడక్షన్ సీన్‌కు ఓ ఎరోటిక్ సీన్‌ని జత చేసి స్మశానంలో బ్లాస్టింగ్‌లు చేయించడం, కారులో యష్, మరో నటి శృంగారంలో ఉండగా దాన్ని బయట రిఫ్టెక్ట్ అయ్యేలా చూపించడంతో `టాక్సిక్` గ్లింప్స్‌తో పాటు దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయిన గీతూ మోహన్ దాస్ `మహిళా దర్శకురాలి నుంచి ఇలాంటి సన్నివేశాలేంటని వస్తున్న విమర్శలని చూసి చిల్ అవుతున్నానని` తెలిపింది. దీంతో గీతూ మోహన్ దాస్ వర్మకు బాబులా ఉందే అనే కామెంట్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి. లేడీ డైరెక్టర్ అయి ఉండి ఇలాంటి ఎరోటిక్ సీన్‌ని చేయడం ఏమీ బాగాలేదని కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. వాటిని గీతూ మోహన్ దాస్ చాలా లైట్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే యష్‌కు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
గతంలో యష్ స్టార్‌గా ఎదగడానికి ముందు ఓ టీవీ షోలో అభ్యంతరకర సన్నివేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `నా తల్లిదండ్రులతో కలిసి చూడటానికి నాకు ఇబ్బందిగా అనిపించే ఏ సినిమా సన్నివేశంలో నేను నటించను` అని యష్ తెలిపాడు. అది స్టార్ కావడానికి ముందు యష్ చేసిన వ్యాఖ్యలవి. `టాక్సిక్`లోని ఎరోటిక్ సీన్ వైరల్‌గా మారి దానిపై విమర్శలు వెళ్లువెత్తుతున్న వేళ యష్ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఈ వీడియోని షేర్ చేస్తూ అభిమానులు, క్రిటిక్స్, సినీ లవర్స్ యష్‌పై విమర్శలు చేస్తున్నారు. స్టార్ డమ్ రాకముందు ఒకలా.. వచ్చాక మరోలా యష్ ప్రవర్తిస్తున్నాడని, ఎలాంటి డ్రాస్టికల్ సీన్స్ అయినా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదనే సంకేతాల్ని ఈ సినిమాతో అందిస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు. అప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు రోలా ప్రవర్తించడం యష్‌కే చెల్లిందని ఫైర్ అవుతున్నారు. మరి ఈ వీడియోపై యష్ ..డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తరహాలోనే స్పందిస్తాడా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.
