Begin typing your search above and press return to search.

మ్యాటర్‌ లేనప్పుడు సోలో వచ్చినా ప్రయోజనం జీరో..!

మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలు అన్‌ సీజన్‌లో వచ్చినా, తీవ్రమైన పోటీలో విడుదలైనా, పండుగ సీజన్‌ కాన్నప్పుడు వచ్చినా కూడా వసూళ్లు భారీగా వస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.

By:  Ramesh Palla   |   2 Sept 2026 11:27 AM IST
మ్యాటర్‌ లేనప్పుడు సోలో వచ్చినా ప్రయోజనం జీరో..!
X

స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు తమ సినిమాలకు సోలో రిలీజ్ దక్కాలని, మంచి సీజన్‌లో రిలీజ్‌ డేట్‌ లభించాలని కోరుకోవడం మనం చూస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు సరైన రిలీజ్‌ డేట్‌ లేక, సోలో రిలీజ్‌కి అవకాశం లేక వారాల తరబడి, నెలల తరబడి వాయిదా పడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. గత ఏడాది ఒక స్టార్‌ హీరో సినిమాను సరైన సమయం కోసం వేచి చూసి చూసి విడుదల చేస్తే పెద్దగా ఆడలేదు. వెయిట్‌ చేసి సోలో రిలీజ్‌ చేసినా కూడా పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోయింది. అందుకు కారణం సినిమాలో మ్యాటర్‌ లేక పోవడం అనక తప్పదు. కంటెంట్‌ ఉన్న సినిమాలు ఎంత పోటీని అయినా తట్టుకుంటున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలు అన్‌ సీజన్‌లో వచ్చినా, తీవ్రమైన పోటీలో విడుదలైనా, పండుగ సీజన్‌ కాన్నప్పుడు వచ్చినా కూడా వసూళ్లు భారీగా వస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.

ధురంధర్‌ 2 సినిమా విడుదల సమయంలో...

సినిమాలో కంటెంట్‌ సరిగా లేనప్పుడు మాత్రమే విడుదల విషయంలో మేకర్స్‌ భయపడుతారు. ఎప్పుడైతే మేకర్స్‌కి తమ సినిమా కంటెంట్‌పై పూర్తి స్థాయి నమ్మకం ఉంటుందో అప్పుడు విడుదల తేదీ విషయంలో అస్సలు టెన్షన్ పడరు. సోలో రిలీజ్‌ చేసుకుంటే మినిమం ఓపెనింగ్స్ అయినా వస్తాయని నిర్మాతలు భావిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలకు నెగటివ్‌ టాక్ వస్తే మొదటి రోజు మ్యాట్నీ షో నుంచే వసూళ్లు డ్రాప్‌ అవుతున్నాయి. పెద్ద హీరో మూవీ అయినా కొన్నిసార్లు మొదటి రోజే తిరస్కరణకు గురి కావాల్సి వస్తుంది. అందుకే సోలో రిలీజ్‌ పై నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. ఇటీవల విడుదలైన టాక్సిక్‌ మూవీని ధురంధర్‌ 2 సినిమాతో పాటు విడుదల చేయాల్సి ఉంది. కానీ ధురంధర్‌ 2 కి ఉన్న బజ్ నేపథ్యంలో టాక్సిక్ సినిమాను వాయిదా వేయడం జరిగింది.

టాక్సిక్‌ సినిమాకు నెగిటివ్‌ టాక్‌..

పాన్ ఇండియా రేంజ్‌లో పెద్దగా పోటీ లేని సమయంలో టాక్సిక్ సినిమా విడుదలైంది. ముందస్తుగా వచ్చిన బజ్‌ కారణంగా ఓపెనింగ్స్ ఓ మోస్తరుగా నమోదు అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్‌ భారీగా జరగడం వల్ల వసూళ్లు గౌరవ ప్రధమైన నెంబర్స్‌ను నమోదు చేయడం జరిగింది. కానీ సినిమా విడుదల తర్వాత తెగిన టికెట్లు మాత్రం చాలా చాలా తక్కువ అని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. సోలో రిలీజ్‌ డేట్‌ దక్కినా కూడా టాక్సిక్ కి కంటెంట్‌ వీక్‌ కావడంతో కలెక్షన్స్ డ్రాప్‌ అయ్యాయి. టాక్సిక్‌ సినిమా ధురంధర్‌ 2 తో విడుదలైనా కూడా ఇదే తరహా ఫలితం దక్కేది. అయితే అడ్వాన్స్ బుకింగ్‌ కాస్త తగ్గేది. ఓవరాల్‌గా సినిమా ఆలస్యం వల్ల నిర్మాతకు ఆర్థిక భారం పడుతుంది. ఇన్ని నెలలు వెయిట్‌ చేసినా టాక్సిక్ విషయంలో పెద్దగా లాభం లేకపోగా, నష్టం పెరిగిందని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారీ బడ్జెట్‌ సినిమాల విషయంలో...

టాక్సిక్‌ మాత్రమే కాకుండా చాలా సినిమాలు సరైన డేట్‌ కోసం వెయిట్‌ చేయడం వల్ల నిర్మాతలపై ఆర్థిక భారం పెరుగుతూ వస్తుంది. ఆ పెరిగిన భారం అయినా ఆలస్యం వల్ల భర్తీ అయిందా అంటే అది ఉండదు. మ్యాటర్‌ లేకుండా రూపొందిన సినిమాలు సోలోగా విడుదలైన పెద్దగా ఫలితం ఉండదు అని పలు సినిమాలు నిరూపించాయి. అందుకే పోటీ గురించి ఆలోచించి నెలల తరబడి సినిమాలను వాయిదా వేసుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఇప్పటికి అయినా నిర్మాతలు గ్రహిస్తే బాగుంటుంది. భారీ బడ్జెట్‌ సినిమాలను సోలో రిలీజ్ కోసం వాయిదా వేయడం కంటే ముందుగా ఒక డేట్‌ అనుకుని, ఆ డేట్‌కి వేయడం ఉత్తమం. దాంతో బడ్జెట్‌ పెరగదు, మ్యాటర్‌ ఉంటే ఎంత పోటీ ఉన్నా తప్పకుండా వసూళ్లు వస్తాయి. చిన్న హీరోల సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు అన్ని సినిమాలకు ఇదే పద్ధతి ఇండస్ట్రీలో కనిపిస్తుంది. మరి దీనికి తగ్గట్లుగా మేకర్స్‌ తమ రిలీజ్‌లను ప్లాన్‌ చేసుకుంటారేమో చూడాలి.