టాక్సిక్ డిబేట్స్.. ఇంకా ఆగకపోవడానికి రీజన్స్ ఏంటి?
నిజానికి కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న యష్.. తన నెక్స్ట్ మూవీగా టాక్సిక్ ను తీసుకొచ్చారు. దీంతో ఆ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
By: M Prashanth | 14 Oct 2026 1:00 PM ISTసినిమా విడుదలై రిజల్ట్ తేలిపోయినా.. దాని చుట్టూ డిబేట్స్ మాత్రం ఆగడం లేదు. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన రీసెంట్ మూవీ టాక్సిక్ విషయంలో అదే జరుగుతోంది. ఆ మూవీ రిజల్ట్ పై రీసెంట్ గా కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్, థియేటర్ల ఓనర్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్ మళ్లీ డిబేట్ ను పెంచేశాయి. దీంతో అసలు ఆ సినిమా గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నిజానికి కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న యష్.. తన నెక్స్ట్ మూవీగా టాక్సిక్ ను తీసుకొచ్చారు. దీంతో ఆ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ హీరో, పెద్ద బడ్జెట్, హై రేంజ్ ప్రొడక్షన్.. ఇలా ఎన్నో ఎలిమెంట్స్ సినిమాపై హైప్ పెంచాయి. కానీ సినిమా అనుకున్న రేంజ్ లో రిజల్ట్ అందుకోలేకపోవడంతో ఇప్పుడు ఆ అంచనాలు, రిజల్ట్ గురించి చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా భారీ సినిమాల విషయంలో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం ఎంత ముఖ్యమో ఆ మూవీ రిజల్ట్ గుర్తు చేస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తిరుపూర్ సుబ్రహ్మణ్యం కూడా రీసెంట్ గా సినిమాలో భారీ విజువల్స్ చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కథ స్ట్రాంగ్ గా లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కామెంట్స్ కు అర్థం.
దీంతో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ప్రొడక్షన్ పై కూడా చర్చ మొదలైంది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. భారీ సెట్లు, గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అయితే వీటితో పాటు స్టోరీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రేక్షకులు కేవలం భారీ సీన్స్ చూసి సాటిస్ఫై అవ్వడం లేదని, సినిమా తమకు నచ్చితేనే ఆదరిస్తున్నారని కొందరు అంటున్నారు.
అందుకే మెయిన్ గా టాక్సిక్ రిజల్ట్ పై జోరుగా చర్చలు సాగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాపైతే ఆ ఎఫెక్ట్ హీరోలు, నిర్మాతలకే పరిమితం కాదు. సినిమా హక్కులు కొనుగోలు చేసే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులపైనా పడుతుంది. పెట్టిన డబ్బులు తిరిగి రాకపోతే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే భారీ సినిమాల బిజినెస్ పై తిరుపూర్ సుబ్రహ్మణ్యం కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలపై భారీ మొత్తాలు పెట్టే ముందు వాటి స్టోరీ, ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా అంచనా వేయాలనే చర్చకు ఆ సినిమా కారణమైంది.
కేజీఎఫ్ విజయంతో యష్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి హీరో సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోకపోవడంతో ఆయన మార్కెట్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందనే చర్చ మొదలైంది. అయితే ఒక్క సినిమా ఫ్లాప్ తోనే యష్ స్టార్ డమ్ తగ్గిపోయిందని చెప్పలేం. ఆయన నెక్స్ట్ సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయన్నది మెయిన్. ఏదేమైనా సినిమా విడుదలై రిజల్ట్ తేలిపోయినా, టాక్సిక్ చుట్టూ చర్చలు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి.
