యష్ టీజర్.. షాక్ ఇచ్చిన మహిళా కమిషన్..!
కె.జి.ఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా టీజర్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక రేంజ్ డిస్కషన్ జరుగుతుండగా ఈ సినిమాకు కర్ణాటక మహిళా కమిషన్ నుంచి షాక్ తగిలింది.
By: Ramesh Boddu | 13 Jan 2026 10:59 AM ISTకె.జి.ఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా టీజర్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక రేంజ్ డిస్కషన్ జరుగుతుండగా ఈ సినిమాకు కర్ణాటక మహిళా కమిషన్ నుంచి షాక్ తగిలింది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన టాక్సిక్ సినిమా టీజర్ లో బోల్డ్ ఇంటిమేట్ సీన్ పై వాళ్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ టీజర్ లో చూపిన అశ్లీలతపై కఠిన చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డ్ కు లెటర్ రాశారు.
టాక్సిక్ టీజర్ రిలీజైన టైంలోనే..
అంతేకాదు వెంటనే ఆ టీజర్ ని తొలగించాలని కర్ణాటక మహిళా కమిషన్ పేర్కొన్నది. గీతూ మోహన్ దాస్ ఒక లేడీ డైరెక్టర్ అయ్యుండి కూడా ఇలాంటి బోల్డ్ సీన్ ఎలా పెట్టిందంటూ టాక్సిక్ టీజర్ రిలీజైన టైంలోనే అనుకున్నారు. ఐతే యష్ ఫ్యాన్స్ మాత్రం టీజర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిజాన్ని రకరకాలుగా చూపిస్తారు. ఈ సినిమాలో బోల్డ్ ఇంటిమేట్ సీన్ తో ఇలా చూపించారు.
ఐతే యష్ సినిమా టీజర్ పై మహిళా కమిషన్ ఇచ్చిన కంప్లైంట్ కి సెన్సార్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది చూడాలి. ఐతే సినిమా గురించి టీజర్ రిలీజైనప్పుడే ఇంత వైల్డ్ రేంజ్ డిస్కషన్ జరుగుతుంది అంటే మరోసారి యష్ కె.జి.ఎఫ్ ని మించి క్రేజీ సక్సెస్ అందుకునేలా ఉన్నాడు.
యష్ టాక్సిక్ మార్చి 19న రిలీజ్..
యష్ టాక్సిక్ సినిమా మార్చి 19న రిలీజ్ ప్లాన్ చేశారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. ఐతే యష్ టాక్సిక్ సినిమా టీజర్ ఐతే సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది చూడాలి. కె.జి.ఎఫ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కాబట్టి మామూలుగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మరోపక్క సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ని ఈ టీజర్ తోనే పెంచడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్.
మార్చి బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్న యష్ టాక్సిక్ సినిమా ఆరంభం అదిరిపోయింది. మరి సినిమా ఎలాంటి హంగామా సృష్టిస్తుంది అన్నది చూడాలి. యష్ సినిమా విషయంలో ఈ హ్యూజ్ బజ్ మిగతా స్టార్స్ కి కూడా ఆసక్తికరంగా మారింది. కన్నడలోనే తెరకెక్కినా పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్ లో అంటే ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాపై ఉన్న బజ్ కి ఏమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయినా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.
