Begin typing your search above and press return to search.

టోవినో కొత్త మూవీ టీజర్.. ఏదో స్పెషల్ కాన్సెప్ట్ లా ఉందే..

మాలీవుడ్ ఇండస్ట్రీలో రియలిస్టిక్‌, క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో టోవినో థామస్ మరో పాన్‌ ఇండియా ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

By:  M Prashanth   |   23 March 2026 1:26 PM IST
టోవినో కొత్త మూవీ టీజర్.. ఏదో స్పెషల్ కాన్సెప్ట్ లా ఉందే..
X

మాలీవుడ్ ఇండస్ట్రీలో రియలిస్టిక్‌, క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో టోవినో థామస్ మరో పాన్‌ ఇండియా ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే మిన్నల్ మురళి, 2018, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఆర్మ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టొవినో, ఇప్పుడు పళ్లి చట్టంబి అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో అలరించనున్నారు.

ఆ చిత్రానికి డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తుండగా, కయాదు లోహర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ ఆ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2026 ఏప్రిల్ 9న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ లభించింది. అందులో టొవినో థామస్ మాస్ లుక్‌ లో ఫెరోషియస్‌ గా కనిపించి అభిమానుల్లో ఆసక్తి రేపారు. 1950-60 బ్యాక్ డ్రాప్ తో సాగే కథలో టొవినోను ఇప్పటివరకు చూడని విధంగా చూపించనున్నట్లు సమాచారం. తాజాగా విడుదలైన టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది.

"పిశాచాలు ఉండే ప్రదేశమది. నీతో ఎన్ని సార్లు చెప్పాలి.. ఆ ప్రదేశం వైపు కన్నెత్తి కూడా చూడొద్దని" అనే బ్యాక్‌ గ్రౌండ్ డైలాగ్‌ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత టొవినో పాత్ర రివీల్ చేస్తూ, "దేవుని అనుగ్రహం ఉంటే దేవాలయంపై ఏ పిశాచి నీడ పడదు" అనే డైలాగ్ ఆసక్తి మరింత పెంచుతుంది. దీంతో టీజర్‌ ద్వారా సినిమాలో మిస్టరీ, భయం, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

"మనుషులు, సైతాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుని పని ఏమిటి?" అనే ప్రశ్న కథలో మెయిన్ ఎలిమెంట్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. చివర్లో అగ్నితో కూడిన ఆయుధంతో టీజర్ ముగియడం హైలైట్‌ గా నిలిచింది. స్టోరీని పూర్తిగా రివీల్ చేయకుండా కట్ చేసిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో టొవినో పవర్‌ ఫుల్‌ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

సినిమా ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది. చిత్రంలో విజయ రాఘవన్, సుధీర్ కరమన, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టిజో టోమీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జోక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే మూవీ టైటిల్ పళ్లి చట్టంబి అనే పదానికి రౌడీ లేదా లోకల్ గూండా అనే అర్థం ఉంది.

దీంతో 1950-60 కాలంలో జరిగిన ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మిస్టరీ, యాక్షన్, పీరియాడికల్ బ్యాక్‌ డ్రాప్.. అన్నీ కలిసిన ఆ సినిమా టొవినో కెరీర్‌ లో మరో ప్రత్యేక చిత్రంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. టీజర్‌ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఆ మూవీ విడుదల తర్వాత ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.