Begin typing your search above and press return to search.

ఫాఫా ను చూసైనా జాగ్ర‌త్త ప‌డ‌తారా?

ఈ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా మేకోవ‌ర్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో ఇత‌ర భాష‌ల‌కు చెందిన న‌టులు కూడా న‌టిస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   29 July 2025 12:53 PM IST
ఫాఫా ను చూసైనా జాగ్ర‌త్త ప‌డ‌తారా?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వార్2 సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూనే మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ తో క‌లిసి డ్రాగ‌న్(వ‌ర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా మేకోవ‌ర్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో ఇత‌ర భాష‌ల‌కు చెందిన న‌టులు కూడా న‌టిస్తున్నారు.

డ్రాగ‌న్ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు

అందులో భాగంగానే ఈ సినిమాలోకి ఓ న‌టుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న‌ట్టు తెలుస్తోంది. అత‌ను మ‌రెవ‌రో కాదు, మ‌ల‌యాళ న‌టుడు టోవినో థామ‌స్. ఎన్టీఆర్‌నీల్ సినిమాతో టోవినో థామ‌స్ తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం కానున్నారు. అయితే ఇప్ప‌టికే మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి ఫ‌హాద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చిన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే.

పుష్ప తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న‌ ఫాఫా

దీంతో టోవినో థామ‌స్ అయినా టాలీవుడ్ లో స‌క్సెస్ అవుతారా లేదా ఫాఫా లానే క్రిటిసిజంను ఎదుర్కొంటారా అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఫ‌హాద్ ఫాజిల్ ముందు పుష్ప ఫ్రాంచైజ్ లోకి వ‌చ్చిన‌ప్పుడు, ఫాఫా క్యారెక్ట‌ర్ సినిమా మొత్తాన్ని మార్చేస్తుంద‌నుకున్నారు. అనుకున్న‌ట్టే పుష్ప‌1 ఫాఫా కు మంచి స‌క్సెస్ తో పాటూ క్రేజ్ ను కూడా తెచ్చిపెట్టింది కానీ పుష్ప‌2లో మాత్రం పాఫా క్యారెక్ట‌ర్ అత‌ని ఉనికిని కోల్పోవ‌డంతో పాటూ ఆ పాత్ర‌ను చాలా డౌన్ చేశారు.

ఇదే మొద‌టి సినిమా..

ఇప్పుడు ఎన్టీఆర్‌నీల్ సినిమా ఇండియాలోనే మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా తెర‌కెక్కుతోంది. చాలా కాలంగా డిస్క‌ష‌న్స్ లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు సెట్స్ పై ఉంది. గత కొంత‌కాలంగా టోవినో థామ‌స్ మార్కెట్ బాగా పెరిగిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు అత‌ను వేరే భాష‌ల్లో న‌టించింది లేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌నీల్ ప్రాజెక్ట్ కోసం టోవినో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌డం కూడా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

విల‌న్ గా న‌టిస్తాడా?

టోవినో కూడా ఈ సినిమాలో భాగ‌మ‌వుతున్నందున డ్రాగ‌న్ పై ఉన్న అంచ‌నాలు ఇంకా పెరుగుతున్నాయి. ఒక‌వేళ ఈ సినిమాలో టోవినో థామ‌స్ విల‌న్ గా న‌టిస్తే ఆ హైప్ ఇంకా పెర‌గ‌డం ఖాయం. అయితే మ‌ల‌యాళ ఫ్యాన్స్ మాత్రం పుష్ప‌2లో ఫాఫా లాంటి పాత్ర కాకుండా టోవినోకు అయినా మంచి పాత్ర ఇవ్వాల‌ని, లేక‌పోతే ఆయ‌న విమ‌ర్శ‌ల పాల‌వుతార‌ని అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.