లోకా 2.. ఆ స్టార్ తో పెద్ద ప్లానింగే..?
కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో డామెరిక్ అరుణ్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా లోక చాప్టర్ 1 చంద్ర. లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
By: Ramesh Boddu | 2 Sept 2025 3:08 PM ISTకళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో డామెరిక్ అరుణ్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా లోక చాప్టర్ 1 చంద్ర. లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ సరికొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. అంతేకాదు సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ అదరగొట్టేసింది. లోకా చాప్టర్ 1 చంద్ర సినిమాను తెలుగులో కొత్త లోక టైటిల్ తో రిలీజ్ చేశారు.
లోకా సినిమాలో టోవినో థామస్..
ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఐతే సినిమాలో సర్ ప్రైజ్ క్యామియో రోల్స్ గా దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ లు ఆడియన్స్ ని థ్రిల్ అయ్యేలా చేశారు. సినిమాలో సరైన టైం లో వారి క్యామియో అదిరిపోయింది. ఐతే లోక సినిమా లో టోవినో థామస్ రోల్ థియేటర్ లో విజిల్స్ పడేలా చేస్తుంది. చాతన్ రోల్ లో టోవినో థామస్ కనిపించాడు. అంతేకాదు ఎండ్ టైటిల్స్ చూస్తుంటే లోకా చాప్టర్ 2 మెయిన్ హీరో టోవినో థామస్ అనిపించేలా ఉంది.
లోక సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లో ఈ క్యామియో రోల్స్ మరింత హైప్ పెంచాయి. దుల్కర్ సల్మాన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే ఈ సినిమా తెరకెక్కించారని తెలుస్తుంది. టోవినో థామస్ చాతన్ రోల్ లో మరోసారి అదరగొట్టనున్నారు. ఇలాంటి పాత్రల్లో నటించడం టోవినో థామస్ కి కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మిన్నల్ మురళి సినిమాతో ఆయన టాలెంట్ ఏంటో సౌత్ ఆడియన్స్ కి తెలిసింది.
బలమైన కథానాయకుడిగా..
ఇప్పుడు లోకా సినిమాకు టోవినో ఒక బలమైన కథానాయకుడిగా మారనున్నాడు. లోకా చాప్టర్ 2 లో టోవినో మెయిన్ లీడ్ అని చెప్పకనే చెప్పారు. ఐతే రెండో పార్ట్ మాత్రం మరింత సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని తెలుస్తుంది. టోవినో థామస్ ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని చెప్పొచ్చు.
కొత్త లోకా టైటిల్ తో తెలుగులోకి వచ్చిన లోక సినిమాకు ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఐతే ఈ సినిమాను తెలుగులో సితార నాగ వంశీ రిలీజ్ చేశారు. పెద్దగా ప్రమోషన్స్ ఏమి చేయకుండానే నాగ వంశీ కొత్త లోక వదిలారు. మరి లోక చాప్టర్ 1 తెలుగులో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుంది.. ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది అన్నది చూడాలి. సినిమాకు ఎలాగు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మౌత్ టాక్ తోనే సినిమా నడిచేలా ఉంది. లోక సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్ లో ఒక సర్ ప్రైజ్ హిట్ అందుకుంది. అంతేకాదు నిర్మాతగా దుల్కర్ సల్మాన్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకున్నారు.
