Begin typing your search above and press return to search.

సౌత్ టాప్ ఫుట్ ఫాల్స్.. ఏ మూవీని ఎన్ని కోట్ల మంది చూశారంటే?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో వేల చిత్రాలు రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

By:  M Prashanth   |   15 Nov 2025 6:48 PM IST
సౌత్ టాప్ ఫుట్ ఫాల్స్.. ఏ మూవీని ఎన్ని కోట్ల మంది చూశారంటే?
X

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో వేల చిత్రాలు రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో అనేక మూవీలు హిట్ అయ్యాయి. కొన్ని మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నాయి. మరికొన్ని ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇంకొన్ని ఆయా నటీనటుల అభిమానులకు మాత్రమే నచ్చాయి. అలా ఒక్కొక్క మూవీ రిజల్ట్ ఒక్కోలా ఉంది.

అయితే కంటెంట్ ఉంటే చాలు.. మిగతా రీజన్స్ తో సంబంధం లేకుండా థియేటర్స్ కు వెళ్లి ఆదరిస్తున్నారు సినీ ప్రియులు. ఎప్పుడు కొత్త సినిమాలు వస్తాయా.. చూద్దామా అని అనేక మంది రెడీగా ఉంటారు. అయితే ఇప్పటి వరకు హైయ్యెస్ట్ ఫుట్ పాల్స్ (థియేటర్స్ లో మూవీ చూసిన వారి సంఖ్య) అందుకున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం.

ఆ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది మన బాహబలి ది కన్ క్లూజన్. బాహుబలి ది బిగినింగ్ కు సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ గా ఉంది. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ సినిమా ఫుట్ ఫాల్ కౌంట్ అక్షరాలా 10.77 కోట్లు. అంత మంది బాహుబలి సీక్వెల్ ను థియేటర్స్ లో ఎంజాయ్ చేశారన్న మాట.

బాహుబలి ది కన్ క్లూజన్ తర్వాత స్థానంలో పుష్ప 2 ది రూల్ ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఆ చిత్రం కూడా భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద నెవ్వర్ బిఫోర్ అనేలా రికార్డులు క్రియేట్ చేయగా.. ఆ సినిమాను థియేటర్స్ లో 6.12 కోట్ల మంది చూశారట. అయితే ఓ సారి టాప్-10 సినిమాల జాబితా పరిశీలిస్తే..

బాహుబలి ది కన్ క్లూజన్ - 10.77 కోట్లు

పుష్ప 2 ది రూల్ - 6.12 కోట్లు

కేజీఎఫ్ చాప్టర్ 2 - 5.06 కోట్లు

బాహుబలి ది బిగినింగ్ - 4.08 కోట్లు

ఆర్ఆర్ఆర్ - 4.51 కోట్లు

కల్కి 2898 ఏడీ - 3.61 కోట్లు

భారతీయుడు - 3.40 కోట్లు

రోబో 2.0 - 3.38 కోట్లు

చంద్ర - 3.04 కోట్లు

ఎందిరన్ - 3.01 కోట్లు

అయితే సౌత్ లో ఇప్పుడు అనేక బడా సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. వాటిలో చాలా చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఆ సినిమాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లనున్నారు. మరి ఆయా చిత్రాల ఫుట్ ఫాల్ కౌంట్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.