Begin typing your search above and press return to search.

సౌత్ ఇండస్ట్రీ దూకుడు.. టాప్ 10లో అన్నీ మనవే!

అయితే రీసెంట్ గా టాప్-10 హెయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లోకి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వచ్చి చేరింది. ఫస్ట్ డే ఆ సినిమా.. రూ. 154 కోట్లు సాధించింది.

By:  M Prashanth   |   27 Sept 2025 12:20 PM IST
సౌత్ ఇండస్ట్రీ దూకుడు.. టాప్ 10లో అన్నీ మనవే!
X

సౌత్ సినీ ఇండస్ట్రీ ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. పాన్ ఇండియా రేంజ్ లో అనేక దక్షిణాది సినిమాలు అదరగొడుతున్నాయి. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. తద్వారా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే నమోదై ఉన్న రికార్డులు కూడా బద్దలుకొడుతున్నాయి.

అదే సమయంలో ఓపెనింగ్స్ విషయంలో గట్టిగా పోటీపడుతున్నాయి. తొలి రోజు వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబడుతున్నాయి. అయితే రీసెంట్ గా టాప్-10 హెయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లోకి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వచ్చి చేరింది. ఫస్ట్ డే ఆ సినిమా.. రూ. 154 కోట్లు సాధించింది.

తద్వారా టాప్ ఓపెనింగ్ సాధించిన సినిమాల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. అంతేకాదు నార్త్ కు చెందిన బ్లాక్ బస్టర్ హిట్లు రణబీర్ కపూర్ యానిమల్ (రూ.116 కోట్లు), షారుఖ్ ఖాన్ జవాన్ (రూ.128 కోట్లు) చిత్రాలకు షాక్ ఇచ్చింది. అయితే గత ఏడాది రిలీజైన పుష్ప 2 సినిమా ఇంకా టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా తొలి రోజే రూ. 294 కోట్లు ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ డే 1 వరల్డ్ వైడ్ గా రూ. 223 కలెక్ట్ చేసి రెండో ప్లేస్ లో నిలిచింది. మరి ఆ లిస్ట్ లో టాప్ 10 లో ఉన్న సినిమాల వివరాలు ఇలా!

టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు

పుష్ప 2- రూ. 294 కోట్లు

ఆర్ఆర్ఆర్ - రూ. 223 కోట్లు

బాహుబలి ది కంక్లూజన్ - రూ. 217 కోట్లు

కల్కి 2898 ఏడీ - రూ. 191.50 కోట్లు

సలార్ - రూ. 178.50 కోట్లు

దేవర - రూ. 172 కోట్లు

కేజీఎఫ్ 2 - రూ.165 కోట్లు

ఓజీ- రూ. 154 కోట్లు

కూలీ - రూ.153 కోట్లు

లియో - రూ. 143 కోట్లు

అయితే పై లిస్ట్ చూసుకుంటే.. సౌత్ ఇండస్ట్రీ దూకుడు ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. టాప్ 10 లిస్ట్ లో మొత్తం దక్షిణాది సినిమాలే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా బాలీవుడ్ మూవీ లేదు. మరో ప్రత్యేక విషయమేమంటే.. అత్యధికంగా తెలుగు సినిమాలే ఏడు ఉన్నాయి. టాప్ 5 సినిమాలు మొత్తం టాలీవుడ్ వే కావడం విశేషం.