Begin typing your search above and press return to search.

ఈ నలుగురు డైరెక్టర్ల స్ట్రాంగ్ జోన్ ఏంటో తెలుసా..? వీళ్ళ సక్సెస్ కి కారణం అదే...

ప్రతి సన్నివేశంలో ఒక డీటెయిల్ ఉండాలని మొదటి సీన్ లోనే ప్రేక్షకుడికి సినిమా కథంతా చెప్పాలని క్లైమాక్స్ ఏం జరుగుతుందో మొదటి సన్నివేశంలోనే చెబితే ప్రేక్షకుడు పట్టుకుంటాడా?

By:  Gopi Velupala   |   4 Oct 2026 6:00 AM IST
ఈ నలుగురు డైరెక్టర్ల స్ట్రాంగ్ జోన్ ఏంటో తెలుసా..? వీళ్ళ సక్సెస్ కి కారణం అదే...
X

ప్రేక్షకుడికి నచ్చేలా సినిమాని తెరకెక్కించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు... ఇక అందులోనూ కమర్షియల్ సినిమాని తీయాలి అంటే కత్తి మీద సాములాంటిదనే చెప్పాలి. ఎందుకంటే సంవత్సరానికి 200 సినిమాలు రిలీజైతే అందులో దాదాపు 170 సినిమాలు కమర్షియల్ కథలతోనే తెరకెక్కుతుంటాయి. కాబట్టి వీటన్నింటికి చెక్ పెడుతూ డిఫరెంట్ తరహాలో సినిమాని తీసినప్పుడు మాత్రమే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు గా వెలుగొందిన నలుగురు దర్శకులు కమర్షియాలిటీ ని పోగొట్టుకోకుండా వాళ్ల స్ట్రాంగ్ జోన్ లో సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించారు... వాళ్ళలో కొందరు ఇప్పటికి రాణిస్తుండటం విశేషం...ప్రస్తుతం చాలామంది దర్శకులు ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ లను సాధించి టాప్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్నారు. కానీ 2000 నుంచి 2020 మధ్య వరకు కూడా ఒక నలుగురు సీనియర్ డైరెక్టర్లు వాళ్ళ స్ట్రాంగ్ జోన్ ను నమ్ముకొని ముందుకు సాగారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు వాళ్ళ స్ట్రాంగ్ జోన్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం...

రాజమౌళి

'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టిన రాజమౌళి మొదటి సినిమాతోనే తన మార్కును చూపించాడు. ఇక 'సింహాద్రి' సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను రంగరించి మొత్తానికైతే ఆ సినిమాని బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలపాడు... రాజమౌళి తన స్ట్రాంగ్ జోన్ అయిన ఎమోషన్ ఎలివేషన్ ను పట్టుకొని సినిమాను ముందుకు తీసుకెళ్తాడు. ఎక్కడా కూడా సినిమాని డల్ చేయకుండా సినిమా మొత్తానికి ఒక ఎమోషన్ ట్రాక్ రాసుకొని అందులోనే ఎలివేషన్స్ ను యాడ్ చేస్తూ ప్రేక్షకులందరికి ఒక హై మూమెంట్ ఇచ్చే విధంగా తన సినిమాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉంటాడు. దానివల్ల సినిమాను చూసిన ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ రావడమే కాకుండా ఆ సినిమాలను రిపీటెడ్ గా చూడడానికి అవకాశం ఉంటుంది...

పూరి జగన్నాథ్

ఇప్పుడంటే పూరి జగన్నాథ్ సక్సెస్ ని సాధించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కానీ కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదొక వైవిధ్యమైన ఎలిమెంట్ ను పెట్టి సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చేవాడు. ముఖ్యంగా ఆయన తన మేకింగ్ తో పాటు డైలాగ్స్ అలాగే హీరోల క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువగా వర్క్ చేస్తుంటాడు అది అతని స్ట్రాంగ్ జోన్... అందుకే ఆయన పీక్ సక్సెస్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. కొన్ని సినిమాలు కమర్షియల్ గా అంత ప్రాఫిట్ రాబట్టకపోయినా కూడా సగటు ప్రేక్షకులందరు అతని సినిమాని మినిమం గ్యారంటీ మూవీ గా భావించేవారు. అందుకే ఒక్కసారైనా ఆయన సినిమాలను చూసి ఎంజాయ్ చేసేవారు.

త్రివిక్రమ్

రైటర్ గా తన కెరియర్ ను మొదలు పెట్టిన త్రివిక్రమ్ కెరియర్ స్టార్టింగ్ లోనే టాప్ రైటర్ గా దిగాడు. ఇక తర్వాత దర్శకుడిగా మారిన ఆయన తన మార్కు ను చూపిస్తూ దర్శకత్వ విభాగంలో కూడా రాణిస్తున్నాడు. త్రివిక్రమ్ ముఖ్యంగా డైలాగుల మీద సినిమాను నడిపిస్తాడు. నిజానికి ఒక సినిమా మొత్తాన్ని డైలాగుల మీద నడిపించడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే సినిమాలో ఎమోషన్ బ్యాలెన్స్ చేస్తూనే పర్టిక్యూలర్ సిచువేషన్ లో ఎలాంటి డైలాగ్ పడితే ఆ సీన్ ఎలివేట్ అవుతుంది అనేది కూడా త్రివిక్రమ్ ముందుగానే ఊహించి అందులో డైలాగును పెట్టే ప్రయత్నం చేసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్తాడు. ఇక ప్రస్తుతం ఇప్పటికి ఆయన డైలాగుల మీదనే డిపెండ్ అయి ముందుకు సాగుతున్నాడు. మేకింగ్ పరంగా కూడా ఆయన కొంతవరకు అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికి అవి కొన్నిసార్లు వర్కౌట్ అయితే మరికొన్ని సార్లు నిరాశపరుస్తున్నాయి...

సుకుమార్

ప్రతి సన్నివేశంలో ఒక డీటెయిల్ ఉండాలని మొదటి సీన్ లోనే ప్రేక్షకుడికి సినిమా కథంతా చెప్పాలని క్లైమాక్స్ ఏం జరుగుతుందో మొదటి సన్నివేశంలోనే చెబితే ప్రేక్షకుడు పట్టుకుంటాడా? లేదా అనే ధోరణిలో వాళ్లకు ఒక పెను సవాల్ ను విసురుతూ ప్రేక్షకుల ఐక్యు కి టెస్టుపెట్టే దర్శకుడు సుకుమార్... కమర్షియల్ సినిమా టెంప్లేట్ లోనే అతను సినిమాలు చేస్తున్నప్పటికి ఇతర దర్శకుల సినిమాలు చూసినట్టుగా సుకుమార్ మూవీ చూస్తే వర్కౌట్ కాదు. ఆయన సినిమాలో డిటైలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సీన్ తో మరొక సీన్ ఇంటర్ లింక్ చేసి రాసుకుంటాడు. ఆ సీన్ లో ఏముంది? అది ఎందుకోసం జరుగుతుంది అనేది కూడా చాలా హై లెవెల్లో ఎలివేట్ చేస్తూ ఉంటాడు... తన ఇంటిలిజెంట్ రైటింగ్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో ఆయన ఎక్కడా తగ్గడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే ను ప్రేక్షకుడికి అందించినప్పుడే వాళ్లు ఒక థ్రిల్ ఫీల్ అవుతారని అనుకుంటున్నాడు. అందుకోసమే అతను సినిమాల్లో స్క్రీన్ ప్లే అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది...

ఇలా పైన చెప్పిన నలుగురు దర్శకులు ఇప్పటికీ ఇండస్ట్రీ లో చాలా ఆక్టివ్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు...