ట్యూన్స్ నుంచి స్క్రీన్ వరకు..మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లోకి ఎంట్రీ!
సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ‘బాయ్స్’ సినిమా తర్వాత దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం ముగించుకుని, మళ్లీ నటుడిగా ‘హృదయం మురళి’ (తమిళంలో ఇదయం మురళి) చిత్రంతో ఇవాళే థియేటర్లలోకి వచ్చారు.
By: Madhu Reddy | 10 July 2026 6:00 PM ISTసంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ‘బాయ్స్’ సినిమా తర్వాత దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం ముగించుకుని, మళ్లీ నటుడిగా ‘హృదయం మురళి’ (తమిళంలో ఇదయం మురళి) చిత్రంతో ఇవాళే థియేటర్లలోకి వచ్చారు. అయితే సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా నటులుగా, దర్శకులుగా మారి స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడం కొత్తేమీ కాదు. తమ ట్యూన్స్‌తో ప్రేక్షకులను ఊపేసిన కొందరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, నటులుగా మారి ఎలా సత్తా చాటారో ఓసారి చూద్దాం.
హీరోగా మెప్పించిన జి.వి. ప్రకాష్ కుమార్:
తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన జి.వి. ప్రకాష్ కుమార్, నటుడిగానూ భారీ విజయం అందుకున్నారు. ‘డార్లింగ్’, ‘త్రిష ఇల్లాన నయనతార’, ‘సర్వం తాళ మయం’ వంటి సినిమాల్లో హీరోగా నటించి, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు టాప్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉంటున్నారు.
'ఎల్లమ్మ'తో హీరోగా మారుతున్న రాక్ స్టార్ డీఎస్పీ:
ఆర్య, జల్సా, పుష్ప వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కేవలం పాటలు పాడటమే కాకుండా స్టేజ్ పై అద్భుతమైన డాన్సర్ గా దుమ్ములేపే డీఎస్పీ, ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా మారుతున్నారు. ఇక బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’ మూవీతో ఆయన హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
మల్టీ టాలెంటెడ్ వర్సటైల్ యాక్టర్ ఎస్.జె. సూర్య:
నిజానికి ఎస్.జె. సూర్య ఇండస్ట్రీకి వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే కోరికతోనే. కానీ కాలక్రమేణా పవన్ కళ్యాణ్ 'ఖుషి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా మారారు. ఆ తర్వాత నటుడిగా మారి స్పైడర్, మానాడు, గేమ్ ఛేంజర్,సరిపోదా శనివారం వంటి సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. ఇక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ విలన్‌గా ఆయన హవా నడుస్తోంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెరిసిన స్వరబ్రహ్మ కోటి:
టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడైన కోటి, రాజ్-కోటి ద్వయంగా అలాగే సింగిల్‌గా ఎన్నో వందల అద్భుతమైన పాటలను మనకు అందించారు. ఆయన కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’, రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ వంటి పెద్ద సినిమాలలో నటుడిగా కీలక పాత్రలు పోషించి మెప్పించారు.
సంగీత ప్రపంచంలో తమ మార్క్ చూపించిన ఈ టాలెంటెడ్ సెలబ్రిటీలు, వెండితెరపై నటులుగా కూడా రాణించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే కాకుండా, తమ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్‌తోనూ ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్నారు. మరి తాజాగా విడుదలైన ‘హృదయం మురళి’ సినిమాలో తమన్ నటన ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో, అలాగే రాబోయే ‘ఎల్లమ్మ’ సినిమాతో డీఎస్పీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి..
