Begin typing your search above and press return to search.

బుల్లితెర‌పై అత్య‌ధికంగా ఆర్జించే హోస్ట్?

స రే గ మ ప సీజన్ కు రూ. 78 లక్షలు అందుకున్నట్లు హోస్ట్ ఆదిత్య నారాయణ్ తెలిపారు.

By:  Sivaji Kontham   |   4 Oct 2025 1:00 AM IST
బుల్లితెర‌పై అత్య‌ధికంగా ఆర్జించే హోస్ట్?
X

బిగ్ బాస్, కౌన్ బనేగా కరోడ్‌పతి, రైజ్ అండ్ ఫాల్, స రే గ మ ప‌ స‌హా చాలా రియాలిటీ షోలు ఇటీవల ప్ర‌జ‌ల్ని రంజింప‌జేస్తున్నాయి. టెలివిజన్ హోస్ట్‌ల వైభ‌వం చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ వారి పారితోషికాల రేంజ్ ఎంత‌? అని ప్ర‌శ్నించ‌డం స‌హ‌జం.

సల్మాన్ ఖాన్ భారతదేశంలో అత్యధికంగా పారితోషికం పొందే బుల్లితెర హోస్ట్ లలో ఒకరు. బిగ్ బాస్ కోసం ఒక్కో ఎపిసోడ్ కు 15 కోట్లు అందుకుంటున్నారు స‌ల్మాన్. ద‌శాబ్ధం పైగానే స‌ల్మాన్ ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా హోస్ట్ చేస్తున్నాడు. అత‌డి కామిక్ టైమింగ్, హాస్య చ‌తుర‌త‌, బోల్డ్ ప‌ర్స‌నాలిటీ అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి.

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంవత్సరాలుగా కౌన్ బనేగా కరోడ్‌పతి హోస్ట్ గా రంజింప‌జేస్తున్నారు. ఆయ‌న మాట తీరు, కామిక్ టైమింగ్, క్యూరియాసిటీ పెంచే చాణ‌క్యం ప్ర‌తిదీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తుంటాయి. అమితాబ్ ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. సంవ‌త్స‌రాలుగా వంద‌ల‌ ఎపిసోడ్ల‌ను నిర్వ‌హిస్తూ అమితాబ్ భారీ మొత్తాల‌ను ఆర్జించారు. ఆయ‌న త‌న సంపాద‌న‌ను తెలివిగా రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులుగా పెడుతున్నారు.

స రే గ మ ప సీజన్ కు రూ. 78 లక్షలు అందుకున్నట్లు హోస్ట్ ఆదిత్య నారాయణ్ తెలిపారు. భారతి సింగ్ , హర్ష్ లింబాచియాతో కలిసి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఆదిత్య నారాయణ్ స రే గ మ ప సీజన్ కు హోస్ట్ చేసినందుకు తనకు రూ. 78 లక్షలు పారితోషికం లభించిందని వెల్లడించారు. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ లో తన వ్యక్తిత్వంతో ఆయన హృదయాలను గెలుచుకుంటున్నారు.

కృష్ణ అభిషేక్ క‌మెడియ‌న్ గా, హోస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. లాఫర్ చెఫ్స్ 2 లో ఆయన హాస్యం, మిమిక్రీ ఎంతో ఎన‌ర్జిటిక్ గా ఆక‌ర్షించాయి. షోలో ప్రేక్షకులను నిమగ్నం చేయడంలో అత‌డి ప్ర‌త్యేక‌త వేరు. ఆయన ఎపిసోడ్‌కు దాదాపు రూ. 7‑10 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కృష్ణ‌ చివరిసారిగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కనిపించారు. అభిమానులు ఈ షోలో అత‌డిని అమితంగా ఇష్టపడ్డారు.

షార్క్ ట్యాంక్ ఇండియాలో తన స్పష్టమైన వినోదాత్మక వ్యక్తిత్వంతో పాపుల‌రైన‌ అష్నీర్ గ్రోవర్ ప్రస్తుతం OTT-ఆధారిత రియాలిటీ షో `రైజ్ అండ్ ఫాల్‌`ను హోస్ట్ చేస్తున్నారు. స్పష్టమైన అభిప్రాయాలతో షోని ర‌క్తి క‌ట్టించ‌గ‌ల మేధావి అష్నీర్. ఎపిసోడ్‌కు దాదాపు రూ. 7‑10 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

కామెడీ క్వీన్ భారతి సింగ్ తన తెలివితేటలు, కామెడీ టైమింగ్ తో బుల్లితెర‌పై ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆమె చివరిగా లాఫర్ చెఫ్స్ 2 లో కృష్ణ అభిషేక్‌తో కలిసి హోస్ట్‌గా కనిపించింది. ఇటీవల లాఫర్ చెఫ్స్ 2 లోను భార‌తి పెర్ఫామెన్స్ మ‌న‌సులు గెలుచుకుంది. ఎపిసోడ్‌కు సుమారు రూ. 7 లక్షలు పారితోషికం ఆమె అందుకుంటున్నారు.

యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న ర‌ణ్ విజయ్ సింఘా, స్ప్లిట్స్‌విల్లా, రోడీస్ స‌హా ప‌లు షోలను హోస్ట్ చేశారు. అతను రోడీస్ నుండి తాజా ప్రాజెక్ట్ చోరియా చలి గావ్‌కు షిఫ్ట‌యాడు. ఎపిసోడ్‌కు దాదాపు రూ. 4‑5 లక్షలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.