ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద లీడింగ్ డైరెక్టర్లు..
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పేరు దక్కించుకున్న డైరెక్టర్లు.. వారు తమ సినిమాల ద్వారా ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ వసూలు చేశారు అనే విషయానికి వస్తే..
By: Madhu Reddy | 10 Nov 2025 5:26 PM ISTప్రస్తుతకాలంలో భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు సినిమాను చూడడానికి ప్రేక్షకుడు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తోడు ప్రతి సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతూ తెలుగు నుంచి హిందీ వరకు ప్రతి భాషలో డబ్ అవుతూ ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అటు థియేటర్లలో సినిమా చూడలేని వారు ఇటు ఓటీటీలో అన్ని భాషలలో తమకు నచ్చిన సినిమాను తమకు నచ్చిన జానర్లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇలా తమ అద్భుతమైన టాలెంట్ తో సినిమాలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద లీడింగ్ డైరెక్టర్లుగా కొంతమంది కొనసాగుతున్నారు. మరి టాలీవుడ్ మొదలుకొని కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా భాష ఇండస్ట్రీల నుండి కొంతమంది తమ టాలెంట్ ను నిరూపించుకొని.. లీడింగ్ డైరెక్టర్లుగా పేరు సొంతం చేసుకున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు తమ సినిమాలతో భారీ పాపులారిటీ అందుకొని.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పేరు దక్కించుకున్న డైరెక్టర్లు.. వారు తమ సినిమాల ద్వారా ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ వసూలు చేశారు అనే విషయానికి వస్తే..
రాజమౌళి - 12 సినిమాలు - రూ.4,198 కోట్ల గ్రాస్
సుకుమార్ - 9 సినిమాలు - రూ.2,557 కోట్లు
సందీప్ రెడ్డి వంగ - 3 సినిమాలు - రూ.1,346కోట్లు
నాగ్ అశ్విన్ - 3 సినిమాలు - రూ.1,093 కోట్లు
సుజీత్ - 3 సినిమాలు - రూ.877 కోట్లు
అనిల్ రావిపూడి - 8 సినిమాలు - రూ.1,077 కోట్లు
త్రివిక్రమ్ - 11 సినిమాలు - రూ.1,165 కోట్లు
కొరటాల శివ - 7 సినిమాలు - రూ. 1,163 కోట్లు
బోయపాటి శ్రీను - 12 సినిమాలు - రూ.664 కోట్లు
బాబీ కొల్లి - 6 సినిమాలు - రూ.647 కోట్లు
గోపీచంద్ మలినేని - 8 సినిమాలు - రూ.700 కోట్లు
ప్రశాంత్ వర్మ - 4 సినిమాలు - 330 కోట్లు
శైలేష్ కొలను - 4 సినిమాలు - రూ.199 కోట్లు
కోలీవుడ్..
టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా తమ సత్తా చాటుతూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసిన దర్శకులు ఉన్నారు. వారిలో మొదటిగా
లోకేష్ కనగరాజు - 7 సినిమాలు - రూ.1,980 కోట్లు
అట్లీ - 5 సినిమాలు - రూ.1,920 కోట్లు
నెల్సన్ దిలీప్ కుమార్ - 4 సినిమాలు - రూ.1,123 కోట్లు
కార్తీక్ సుబ్బరాజు - 7 సినిమాలు - రూ.700 కోట్లు
వెట్రిమారన్ - 8 సినిమాలు - రూ.400 కోట్లు
శాండిల్ వుడ్..
ప్రశాంత్ నీల్ - 4 సినిమాలు - రూ.2,150 కోట్లు
రిషబ్ శెట్టి - 5 సినిమాలు - రూ.1,670 కోట్లు
బాలీవుడ్..
రాజ్ కుమార్ హిరానీ - 6 సినిమాలు - రూ.1,593 కోట్లు
సంజయ్ లీలా భన్సాలీ - 9 సినిమాలు - రూ.1527 కోట్లు..
ఇలా వీరంతా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద లీడింగ్ డైరెక్టర్స్ గా పేరు సొంతం చేసుకున్నారు.
