అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఇండియన్ హీరోయిన్స్.. ఇన్‌స్టాగ్రామ్ క్వీన్ ఎవరంటే?
ఈ రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మన స్టార్ హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ ఆధారంగానే వారి పాపులారిటీని అంచనా వేస్తున్నారు.
By: Madhu Reddy | 24 May 2026 11:47 AM ISTఈ రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మన స్టార్ హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ ఆధారంగానే వారి పాపులారిటీని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 2026 నాటి తాజా లెక్కల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన టాప్ ఇండియన్ నటీమణుల అధికారిక లిస్ట్ బయటకు వచ్చింది. ఎప్పటికప్పుడు మారుతున్న ఈ నంబర్ల రేసులో ఒక స్టార్ బ్యూటీ అందరికంటే ముందు వరుసలో దూసుకుపోతూ 'ఇన్‌స్టాగ్రామ్ క్వీన్'గా నిలిచింది. ఆ టాప్ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
నెంబర్ వన్ స్థానంలో శ్రద్ధా కపూర్:
బాలీవుడ్ ముద్దుగుమ్మ, 'స్త్రీ 2' ఫేమ్ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. మిగతా స్టార్ హీరోయిన్లందరినీ వెనక్కి నెట్టేసి ఏకంగా 93 మిలియన్ల (9.3 కోట్లు) ఫాలోవర్లతో ఇండియన్ హీరోయిన్స్ లిస్ట్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక తన సింప్లిసిటీ, క్యూట్ పోస్టులతో ఈమె కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గట్టి పోటీ:
ఇక ఇంటర్నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్.. శ్రద్ధా కపూర్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఇక ప్రియాంక ప్రస్తుతం 92 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్, బాలీవుడ్ అప్‌డేట్లతో పాటు తన పర్సనల్ లైఫ్ విశేషాలను పంచుకుంటూ ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
మూడో స్థానంలో అలియా భట్:
వైవిధ్యమైన పాత్రలతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అలియా భట్ ఈ రేసులో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అలియా భట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 85 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సినిమాలు, ఫ్యాషన్ బ్రాండ్ల ప్రమోషన్లతో ఆమె సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
టై అయిన కత్రినా, దీపికా!:
ఈ లిస్ట్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇద్దరు టాప్ స్టార్స్ కత్రినా కైఫ్, దీపికా పదుకొణె సరిగ్గా ఒకే రకమైన ఫాలోయింగ్‌తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కత్రినా, దీపికా ఇద్దరికీ చెరో 78 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక వీరిద్దరి గ్లామరస్ ఫొటోలు, స్టైలిష్ లుక్స్ నెట్టింట ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
ఆ తర్వాతి స్థానాల్లో ఎవరెవరంటే?:
వీరి తర్వాత కూడా కొందరు ముద్దుగుమ్మలు మిలియన్ల ఫాలోవర్లతో సోషల్ మీడియాను రూల్ చేస్తున్నారు. గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 68 మిలియన్ల ఫాలోవర్లతో తర్వాతి స్థానంలో ఉండగా, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ 67 మిలియన్ల ఫాలోవర్లతో ఈ టాప్ లీడర్‌బోర్డ్‌లో నిలిచింది.
మే 2026 నాటి ఈ తాజా లెక్కలను బట్టి చూస్తే ఇండియన్ నటీమణులకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ ఫ్యాన్ ఆర్మీ ఉందో అర్థమవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ నంబర్లు ఇంకెంతలా మారుతాయో, శ్రద్ధా కపూర్ తన నెంబర్ వన్ స్థానాన్ని ఎంతకాలం కాపాడుకుంటుందో చూడాలి. ఈ టాప్ లిస్ట్‌లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఏ స్థానంలో ఉందొ చూసేయండి.
