Begin typing your search above and press return to search.

బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ హీరోయిన్స్ వీరే!

భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కేవలం హీరోల వల్లే బాక్సాఫీస్ రికార్డులు మారుతుంటాయి అనుకునేవారు.

By:  Madhu Reddy   |   24 May 2026 12:00 AM IST
బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ హీరోయిన్స్ వీరే!
X

భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కేవలం హీరోల వల్లే బాక్సాఫీస్ రికార్డులు మారుతుంటాయి అనుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కథల్లో వైవిధ్యం, తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. వందల కోట్ల క్లబ్‌లో తమ సినిమాలను నిలబెడుతూ బాలీవుడ్ వ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న టాప్ 10 హీరోయిన్లు మరియు వారి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

సారా అర్జున్ (దురంధర్ 2):

లిస్ట్‌లో అందరి కంటే ముందు వరుసలో నిలిచింది యంగ్ బ్యూటీ సారా అర్జున్. రీసెంట్‌గా వచ్చిన బాక్సాఫీస్ సెన్సేషన్ ‘దురంధర్ 2’ సినిమాతో ఈమె ఏకంగా రూ.1,902 కోట్ల కలెక్షన్లను సాధించి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక భారీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

దీపికా పదుకొణె (పఠాన్):

బాలీవుడ్ టాప్ క్వీన్ దీపికా పదుకొణె రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.షారుక్ తో కలిసి ఆమె నటించిన ‘పఠాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,050 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది.

కరీనా కపూర్ (భజరంగి భాయీజాన్):

బాలీవుడ్ బేబో కరీనా కపూర్ ఖాన్ ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ఎమోషనల్ హిట్ ‘భజరంగి భాయీజాన్’ సినిమాలో కరీనా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 920 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

రష్మిక మందన్న (యానిమల్):

నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ జెండా పాతేసింది. రణబీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఏకంగా రూ. 915 కోట్లు వసూలు చేసింది.

శ్రద్ధా కపూర్ (స్త్రీ 2):

హారర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రద్ధా కపూర్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘స్త్రీ 2’ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపించి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 900 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.

అనుష్క శర్మ (పీకే):

స్టార్ నటి అనుష్క శర్మ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన హిట్లు ఉన్నాయి. అందులో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో, రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన ‘పీకే’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ .770 కోట్ల వసూళ్లను సాధించింది.

అనీత్ పడ్డా (సయ్యారా):

బాలీవుడ్‌లో సరికొత్తగా దూసుకొచ్చిన యంగ్ టాలెంట్ అనీత్ పడ్డా కూడా ఈ భారీ కలెక్షన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఆమె నటించిన ‘సయ్యారా’ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, థియేటర్ల వద్ద దాదాపు రూ. 580 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

కత్రినా కైఫ్ (టైగర్ జిందా హై):

బాలీవుడ్ యాక్షన్ క్వీన్ కత్రినా కైఫ్ ఎన్నో సూపర్ హిట్ ఫ్రాంచైజీల్లో భాగమైంది. సల్మాన్ ఖాన్‌తో కలిసి ఆమె నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ జిందా హై’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ చిత్రం దాదాపు రూ. 564 కోట్ల కలెక్షన్లతో రికార్డు సృష్టించింది.

అలియా భట్ (ఆర్ఆర్ఆర్):

ప్రస్తుత తరం స్టార్ హీరోయిన్లలో అలియా భట్ టాప్‌లో ఉంటుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అలియా సీత పాత్రలో మెరిసింది. ఈ ప్యాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, అలియా సోలో లీడ్ బాలీవుడ్ చిత్రాలు కూడా వందల కోట్ల క్లబ్‌లో ఉన్నాయి.

నయనతార (జవాన్) :

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తన బాలీవుడ్ అరంగేట్రంతోనే సరికొత్త రికార్డు సృష్టించింది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ‘జవాన్’ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ నర్మదా రాయ్‌గా ఆమె మెప్పించింది. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా షోలతో ఈ చిత్రం ఏకంగా రూ. 1,160 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి నయనతారను ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలబెట్టింది.

ఒకప్పుడు కేవలం గ్లామర్‌కే పరిమితం అనుకున్న హీరోయిన్లు.. ఇప్పుడు వందల, వేల కోట్ల బిజినెస్‌ను తమ భుజాల మీద నడిపిస్తున్నారు. ఇక మారుతున్న కాలంతో పాటు కథలు మరియు హీరోయిన్స్ స్టార్ పవర్ కూడా పెరగడం ఇండస్ట్రీకి ఎంతో ప్లస్ అవుతోంది. ఇక భవిష్యత్తులో ఈ రికార్డులు ఇంకెంతలా మారుతాయో చూడాలి.