వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి.. సక్సెస్ అయిన టాప్ 5 సెలబ్రిటీస్ వీరే!
ముఖ్యంగా దుస్తుల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్న టాప్ 5 స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 13 Dec 2025 2:00 AM ISTసెలబ్రిటీలు ఒకవైపు హీరోలుగా, హీరోయిన్లుగా సినిమాలలో కొనసాగుతూనే.. మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. రెండు చేతలా సంపాదిస్తున్నారు. అంతేకాదు ఇంకొంతమంది సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వ్యాపారంగంలో పెట్టుబడిగా పెట్టి భారీగా ఆదాయాన్ని పొందుతున్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెడుతున్నారు. అలా సినిమాల ద్వారా వచ్చిన డబ్బును రెట్టింపు చేసుకోవడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.
ఇంకొంతమంది ట్రెండ్ కు తగ్గట్టుగా వ్యాపారాలు మొదలుపెట్టి తమకంటూ క్రేజ్ తో పాటు ఆదాయాన్ని కూడా పెంపొందించుకుంటున్నారు. ఇకపోతే ఈ ఏడాది కూడా కొంతమంది హీరోయిన్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటూ తమ అభిరుచిని కూడా చాటుకుంటున్నారు. ముఖ్యంగా దుస్తుల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్న టాప్ 5 స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
సమంత..
ప్రముఖ హీరోయిన్ సమంత స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈమె.. ఎట్టకేలకు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. ఒకవైపు హీరోయిన్ గా.. మరొకవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించి సినిమాలు చేస్తోంది. ఇకపోతే ఇది వరకే సాకీ అనే దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించిన ఈమె.. ఈ ఏడాది ట్రూలీ SMA అనే మరో దుస్తుల బ్రాండ్ ను స్థాపించింది. ఈ బ్రాండ్ ద్వారా అన్ని వర్గాల వారికి ధరించడానికి అనుకూలంగా ఉండే దుస్తులను రూపొందించడమే లక్ష్యంగా ఈ బ్రాండ్ ను స్థాపించింది.
అలియా భట్..
ఒకవైపు వైవాహిక జీవితాన్ని.. మరొకవైపు మాతృత్వాన్ని అనుభవిస్తూ ఇంకొక వైపు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ బిజీగా మారిన ఆలియా భట్ వ్యాపారంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసింది. ఎడ్ - ఎ - మమ్మా అనే దుస్తుల బ్రాండ్ ను స్థాపించిన ఈమె.. ఈ బ్రాండ్ ద్వారా పిల్లల కోసం ప్రత్యేకంగా దుస్తులను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్క సంవత్సరంలోనే ఈ బిజినెస్ 150 కోట్లకు చేరుకుంది. ఇక ఇందులో రిలయన్స్ సగం పెట్టుబడులు పెట్టింది.
మానుషి చిల్లర్..
బాలీవుడ్ నటిగా పేరు సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ ద్వీప్ అనే స్విమ్ వేర్ బ్రాండ్ ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ కు సంబంధించిన దుస్తులను ఎప్పటికప్పుడు ఇన్స్టా అకౌంట్లో షేర్ చేస్తోంది. పైగా ఈ స్విమ్ వేర్ ను ఈమె ధరించి సొంతంగా ప్రమోషన్ కూడా చేస్తోందని చెప్పవచ్చు.
అమైరా దస్తూర్..
ప్రముఖ నటి అమైరా దస్తూరు లూనార్ డేడ్రీమ్జ్ అనే దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ ద్వారా లాంజ్ వేర్ అలాగే నైట్ వేర్ దుస్తులను ప్రారంభించింది. ముఖ్యంగా ఇంటిలో ధరించే సౌకర్యవంతమైన దుస్తులపైన ఈమె దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్టైలిష్ గా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను అందించడమే లక్ష్యంతోనే ఈ బ్రాండ్ ని స్థాపించింది ఈ ముద్దుగుమ్మ.
శ్వేతా బసు ప్రసాద్..
ప్రముఖ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె C షార్ప్ అనే దుస్తుల బ్రాండ్ ను స్థాపించింది . ఈ బ్రాండ్ ద్వారా సంగీతం అలాగే ఫ్యాషన్ ను మిళితం చేస్తూ ఐక్యతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ దుస్తులను తయారు చేస్తున్నారు. ఇందులో సంగీత ప్రేరణతో కూడిన టీ షర్ట్లు అలాగే యాక్ససరీస్ ఈ బ్రాండ్ ద్వారా మనకు లభ్యమవుతున్నాయి.
