Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి తాజా రిలీజ్‌లు.. స్ట్రీమింగ్‌లో కొత్త మూవీస్

ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు బోలెడన్ని సినిమాలు డిజిటల్ బాట పట్టాయి. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలతో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   25 Sept 2026 11:03 AM IST
ఓటీటీలోకి తాజా రిలీజ్‌లు.. స్ట్రీమింగ్‌లో కొత్త మూవీస్
X

ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు బోలెడన్ని సినిమాలు డిజిటల్ బాట పట్టాయి. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలతో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీకెండ్‌లో బోరింగ్ లేకుండా ఏ సినిమా చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం ఈ వారం తప్పకుండా చూడాల్సిన టాప్ 3 సినిమాల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి, అవేంటో చూసేయండి..

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ :

కడుపుబ్బా నవ్విస్తూనే సామాన్యుడి జీవితంలో వచ్చే చిక్కులను వినూత్నంగా చూపించే సోషియో ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. అల్లరి నరేష్ తనదైన మార్కు కామెడీ టైమింగ్‌తో అలరించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన రంభ, ఊర్వశి, మేనకల వల్ల ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఎలాంటి గందరగోళాలు తలెత్తాయో ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వుకునేలా తెరకెక్కించారు.

ఎం.ఎస్. రాజు ‘అగధ’ సూపర్ నేచురల్ థ్రిల్లర్:

ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జీ5 ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అనుమానాస్పదంగా జరిగిన ఒక మరణం వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి మహాదేవి అడవిలోని రహస్య గుహ వైపు సాగించే ప్రయాణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇక భయంతో పాటు సరికొత్త అనుభూతిని పంచే ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్.

నయనతార ‘హాయ్!’ (Hi) - జీ5 ఓటీటీ లేడీ సూపర్‌స్టార్ నయనతార, టాలెంటెడ్ హీరో కవిన్ కాంబినేషన్‌లో విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘హాయ్!’ఇక మనసును హత్తుకునే ఈ ప్రేమకథ ప్రస్తుతం 'జీ5' (ZEE5) ఓటీటీలో తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది

యష్ ‘టాక్సిక్’ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా:

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ స్వాతంత్ర్యం తర్వాతి గోవా నేపథ్యంతో నేర ప్రపంచం, అధికారం, కుటుంబ బంధాలు మరియు ప్రతీకారం వంటి శక్తివంతమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, యష్ స్టైలిష్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రం నేడు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ విజువల్ వండర్‌ను ఇప్పుడు ఇంటిపట్టునే ఆస్వాదించవచ్చు.

ఇక ఈ వీకెండ్‌లో మీ అభిరుచికి తగ్గట్టుగా నవ్వులు పంచే కామెడీ సినిమా కావాలన్నా, భయపెట్టే థ్రిల్లర్ చూడాలన్నా లేదా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎంజాయ్ చేయాలన్నా ఓటీటీలో అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం? అమెజాన్ ప్రైమ్ మరియు జీ5 యాప్స్‌ ఓపెన్ చేసి ఈ అగ్రశ్రేణి సినిమాలతో మీ వారాంతాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేయండి..