Begin typing your search above and press return to search.

2025లో పాన్ ఇండియా క్రేజ్.. 2026లో ఏం చేస్తారో?

2025కి మరో నాలుగు రోజుల్లో గుడ్ బై చెప్పి 2026కి వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   28 Dec 2025 10:15 AM IST
2025లో పాన్ ఇండియా క్రేజ్.. 2026లో ఏం చేస్తారో?
X

2025కి మరో నాలుగు రోజుల్లో గుడ్ బై చెప్పి 2026కి వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ చిత్రాల రిజల్ట్ పక్కన పెడితే.. ముగ్గురు హీరోయిన్స్ మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఎవరు.. ఏ ఏ సినిమాలతో గుర్తింపు దక్కించుకున్నారో తెలుసుకుందాం.

వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది యంగ్ బ్యూటీ రితికా నాయక్ గురించే.. టాలీవుడ్ యువ కథానాయకుడు తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీతో ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. సెప్టెంబర్ లో మిరాయ్ రిలీజ్ అవ్వగా.. తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ తో అందరినీ అలరించింది రితిక.

పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ ను మిరాయ్ లో తన నేచురల్ ఛార్మ్ తో మెప్పించిన ఆమె.. ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుందని చెప్పాలి. ఇప్పుడు డ్యూయెట్ మూవీలో నటిస్తున్న రితికా.. వరుణ్ తేజ్ ఇండో- కొరియన్ హారర్-కామెడీ ప్రాజెక్ట్ లో యాక్ట్ చేస్తున్నారు. మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక రితికా నాయక్ తర్వాత ఈ ఏడాదిలో అంతటి క్రేజ్ సంపాదించుకున్న మరో బ్యూటీ రుక్మిణీ వసంత్. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతార చాప్టర్ 1తో భారీ గుర్తింపు ఆమె సొంతమైంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో రూపొందిన ఆ చిత్రంలో రుక్మిణి తన యాక్టింగ్ తో అందరినీ కట్టిపడేశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

సినిమాలో రోల్ కు రుక్మిణి సరైన న్యాయం చేశారు. అటు అందం.. ఇటు అభినయంతో మెప్పించారు. మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కించుకున్న ఆమె.. సినిమాకు మెయిన్ పిల్లర్ గా మెప్పించారు. దీంతో నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె తారక్- నీల్ మూవీతోపాటు యష్ టాక్సిక్ లో యాక్ట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

రుక్మిణి, రితికతోపాటు యంగ్ బ్యూటీ సారా అర్జున్.. ఇప్పుడు ధురంధర్ మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాలో సారా.. తన యాక్టింగ్ తో అందరికీ షాక్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే.. చిన్న వయసులోనే తన టాలెంట్ తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా సినిమాలో తన రోల్ లో ఎమోషన్స్ పండించిన విధానం అద్భుతమనే చెప్పాలి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ధురంధర్ తో సారాకు దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో క్రేజ్ లభించింది. ప్రస్తుతం సారాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్. మొత్తానికి రితిక, రుక్మిణి, సారా.. 2025లో నేషనల్ వైడ్ గా స్టార్‌ డమ్‌ సంపాదించుకున్నారు. మరి 2026లో కొత్త సినిమాలతో ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాలి.