Begin typing your search above and press return to search.

టాప్ - 10 భారీ బడ్జెట్ చిత్రాలివే ..

ఈ మధ్యకాలంలో ఒక సినిమా తెరకెక్కించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఒకప్పుడు కోటి మించకుండానే సినిమాలు తీసి రెట్టింపు లాభాలను అందుకునేవారు నిర్మాతలు.

By:  Madhu Reddy   |   7 Nov 2025 1:00 AM IST
టాప్ - 10 భారీ బడ్జెట్ చిత్రాలివే ..
X

ఈ మధ్యకాలంలో ఒక సినిమా తెరకెక్కించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఒకప్పుడు కోటి మించకుండానే సినిమాలు తీసి రెట్టింపు లాభాలను అందుకునేవారు నిర్మాతలు. కానీ ఇప్పుడు హై బడ్జెట్ సినిమాలు తీసినా కూడా ఆ సినిమాలు హిట్ అవుతాయా లేదా అని నిర్మాతలకు భయం పట్టుకుంది. అలా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఒకరిని చూసి మరొకరు ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూ.. బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నారు.అయితే ఇప్పటివరకు మన ఇండియన్ సినిమాల్లో హైయ్యెస్ట్ బడ్జెట్ పెట్టిన సినిమాలు ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం..

కల్కి 2898AD:

ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ సినిమాల్లో హైయ్యెస్ట్ బడ్జెట్ పెట్టిన మొట్టమొదటి మూవీ కల్కి 2898 ఏడి.. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ఏకంగా 600 కోట్ల బడ్జెట్ పెట్టారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొనే లాంటి దిగ్గజ నటులు నటించారు. అలా వీరి రెమ్యూనరేషన్లకే సగం బడ్జెట్ పోయింది అంటారు.

ఆర్ఆర్ఆర్..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ ఆర్ఆర్ఆర్.. ఈ మూవీలో ఎన్టీఆర్,రాంచరణ్ లు నటించడంతో సినిమాకి భారీ హైప్ వచ్చింది. అలా ఈ సినిమాకి 550 కోట్ల బడ్జెట్ పెట్టారు.

ఆది పురుష్..

రామాయణ ఇతిహాస కథ ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ మూవీకి ఏకంగా 550 కోట్ల బడ్జెట్ పెట్టారు.ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడంతో సినిమాకి ఎంత బడ్జెట్ అయినా సరే అని పెట్టేశారు.కానీ చివరికి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అలా నిర్మాత చాలా కోట్లు నష్టపోయారు.

రోబో 2.0..

రజినీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్ గా రోబో 2.0 తెరకెక్కింది.అయితే రోబో మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో 2.0 కి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అలా ఈ మూవీకి ఏకంగా 550 కోట్లు పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

పుష్ప-2:

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప2 కి 500 కోట్ల బడ్జెట్ పెట్టారు.. పుష్ప మూవీకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప-2 ని భారీ అంచనాలతో తీసుకువచ్చి బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద హిట్ కొట్టారు. అలా ఈ సినిమా దాదాపు 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

ది గోట్ :

తమిళ హీరో విజయ్ దళపతి హీరోగా వచ్చిన ది గోట్ మూవీలో ఈయన ద్విపాత్రాభినయం చేశారు. ఈ మూవీ కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ నిర్మాతలకు నష్టం రాలేదని తెలుస్తోంది. ఇక నిర్మాతలు ఈ మూవీకి 380 కోట్ల బడ్జెట్ పెట్టారు.

బ్రహ్మాస్త్ర :

బాలీవుడ్ సెలెబ్రెటి కపుల్ రణ్బీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర మూవీకి ఏకంగా 350 కోట్ల బడ్జెట్ పెట్టారు.ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ని ఎక్కువగా వాడడం వల్ల ఇంత బడ్జెట్ ఖర్చయిందని అంటారు. త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది.

గేమ్ ఛేంజర్:

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది.ఈ సినిమాకి ఏకంగా 350 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం 200 కోట్లు కూడా దాట లేదని ఇన్సైడ్ వర్గాల టాక్. అలా గేమ్ ఛేంజర్ వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారు.

కూలీ:

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ మూవీకి కూడా దాదాపు 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ సినిమాలో నాగార్జున,ఉపేంద్ర లాంటి దిగ్గజ నటులు కూడా నటించడంతో సినిమాకి భారీ హైప్ ఏర్పడింది.కానీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. అయితే సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా 500 కోట్ల కలెక్షన్స్ దాటేసింది.

వార్-2

ఎన్టీఆర్ మొట్టమొదటి బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2.. హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 మూవీ 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ సినిమాకి చాలా వరకు నష్టం వచ్చింది.

అలా మన భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు హైయ్యెస్ట్ బడ్జెట్ పెట్టిన సినిమాలలో టాప్ 10 సినిమాలు ఇవే. అయితే ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ తో త్వరలోనే మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అవే బాలీవుడ్ లో వస్తున్న రామాయణ..పాన్ వరల్డ్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29.. ఈ సినిమాలో బాలీవుడ్ నుండి వస్తున్న రామాయణ మూవీకి ఏకంగా 2000 కోట్ల బడ్జెట్ పెట్టగా.. మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీకి 1200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట.