Begin typing your search above and press return to search.

2025లో నం.1 చైనా మూవీ, టాప్- 5లో 'అవ‌తార్ -3'

2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ వ‌సూళ్ల‌ను సాధించిన టాప్ 10 సినిమాలేవీ? అంటే.. వీటిలో అవ‌తార్ -3 టాప్ 5లో నిల‌వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

By:  Sivaji Kontham   |   11 Jan 2026 4:05 PM IST
2025లో నం.1 చైనా మూవీ, టాప్- 5లో అవ‌తార్ -3
X

2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ వ‌సూళ్ల‌ను సాధించిన టాప్ 10 సినిమాలేవీ? అంటే.. వీటిలో అవ‌తార్ -3 టాప్ 5లో నిల‌వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. చాలా విమ‌ర్శ‌లు ఎదురైనా కామెరూన్ చిత్రం 1బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో చేరింది. చైనీస్ మూవీ `నె ఝా 2`, భారీ వసూళ్లతో 2025 చివరినాటికి వ‌ర‌ల్డ్ లో అగ్రస్థానంలో నిలిచింది. జూటోపియా 2, అవతార్: ఫైర్ అండ్ యాష్, లిలో & స్టిచ్ టాప్ 5 బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ జాబితాలో చోటు సంపాదించాయి. 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల వివ‌రాల్లోకి వెళితే......

`అవతార్: ఫైర్ అండ్ యాష్` ఇప్ప‌టికే టాప్ 3లోకి ప్రవేశించింది. కామెరూన్ ఫైర్ అండ్ యాష్ ఒక బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో చేరిన 10 వేగ‌వంత‌మైన చిత్రాల‌లో ఒక‌టిగా రికార్డుల‌కెక్కింది. 1.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో 2025లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యధిక వ‌సూళ్లు సాధించిన టాప్ 3 చిత్రాల‌లో చోటు ద‌క్కించుకుంది.

చైనీస్ యానిమేషన్ మూవీ నె ఝా 2 ప్రపంచ సినిమా చరిత్రలో 2 బిలియన్ డాల‌ర్ల‌ మైలురాయిని దాటిన మొదటి యానిమేషన్ చిత్రంగా రికార్డుల‌కెక్కింది. 12 రోజుల కంటే తక్కువ సమయంలో ఒకే మార్కెట్‌లో 1 బిలియన్ డాల‌ర్ దాటిన ఏకైక చిత్రం కూడా ఇదే. నె ఝా 2 ఓవ‌రాల్ గా 2.2 బిలియన్ డాల‌ర్ల‌ ప్రపంచవ్యాప్త వసూళ్లతో 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా, అత్యంత విజయవంతమైన యానిమేటెడ్ చిత్రాలలో ఒకటిగా రికార్డుల‌కెక్కింది.

నె ఝా 2 ... మ‌రో యానిమేటెడ్ చిత్రం సంచ‌ల‌నాల `జూటోపియా 2` కంటే వ‌సూళ్ల‌లో హై లో ఉంది. జూటోపియా 2 చిత్రం 1.59బిలియ‌న్ డాల‌ర్ల ప్రపంచవ్యాప్త వసూళ్లతో 2వ స్థానంలో నిలిచింది. ప్ర‌స్తుతం జూటోపియా ఇంకా థియేట‌ర్ల‌లో ఆడుతోంది. ఇది 2 బిలియన్ డాల‌ర్ల‌ను ఆర్జించే దిశ‌గా సాగుతోంది. అయితే చైనీస్ యానిమేష‌న్ చిత్రం నె ఝా 2 ని కొట్టేయ‌డం సులువు కాదు.

ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల‌ను ప‌రిశీలిస్తే, నె ఝా 2 - 2.25 బిలియన్ డాల‌ర్లు, జూటోపియా 2 - 1.59 బిలియన్ డాలర్లు, అవతార్: ఫైర్ అండ్ యాష్ -1.10 బిలియన్ డాల‌ర్లు వ‌సూలు చేసాయి. లిలో & స్టిచ్ -1.03 బిలియన్ డాల‌ర్లు, ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ - 958.28 మిలియన్ డాల‌ర్లు, జురాసిక్ వరల్డ్: రీబర్త్ - 870 మిలిలియన్ డాల‌ర్లు, డెమోన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాజిల్ - 791 మిలియ‌న్ డాల‌ర్లు, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ - 637 మిలియన్ డాల‌ర్లు, ఎఫ్1: ది మూవీ - 632 మిలియన్ డాల‌ర్లు, సూపర్‌మ్యాన్ - 612మిలియన్ డాల‌ర్లు వ‌సూలు చేసాయి.