Begin typing your search above and press return to search.

స్పైడర్ మ్యాన్ దెబ్బకు షాకైన ఇండియన్ స్టార్స్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా అనే పదం కొంత కాలంగా ట్రెండింగ్ లో ఉంది.దేశంలోని టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తూ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు.

By:  Srikanth Kontham   |   20 Aug 2026 12:20 PM IST
స్పైడర్ మ్యాన్ దెబ్బకు షాకైన ఇండియన్ స్టార్స్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా అనే పదం కొంత కాలంగా ట్రెండింగ్ లో ఉంది.దేశంలోని టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తూ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద లొక‌ల్ స్టార్ హీరోల రికార్డులను సైతం వెనక్కి నెట్టి అసలైన పాన్-ఇండియా స్టార్‌గా హాలీవుడ్ నటుడు టామ్ హాలండ్ నిలిచారని సోనీ పిక్చర్స్ ఇండియా సంస్థ ప్రకటించింది.తాజాగా విడుదలైన `స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే` చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనమే దీనికి ప్రధాన కారణం.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ సినిమాకు ఊహించని రీతిలో కలెక్షన్లు వస్తున్నాయి. కేవలం హాలీవుడ్ చిత్రాలకే పరిమితం కాకుండా భార‌త్ లో ప్రతి మూలకు ఈ సినిమా చేరువవుతుండటంతో సోనీ ఇండియా ప్రతినిధులు ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో షారుఖ్ ఖాన్, ప్రభాస్ వంటి పాన్-ఇండియా హీరోల సినిమాలకు ఏ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయో? అంతకంటే భారీ స్థాయిలో టామ్ హాలండ్ సినిమాకు ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా నూతన తరం యువతరం .. కుటుంబ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి క్యూ కడుతుండటం విశేషం.

ఎలాంటి ప్రాంతీయ భాషా భేదం లేకుండా దేశం మొత్తం మీద ఒకేసారి ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం కేవలం టామ్ హాలండ్ క్రేజ్ వలనే సాధ్యమైందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. హాలీవుడ్ సినిమాలు మన దేశంలో డబ్ అయ్యి విడుదల కావడం కొత్తేమీ కాకపోయినా? ఒక సూపర్ హీరో ఫ్రాంచైజీకి ఈ రేంజ్‌లో కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడటం అరుదైన పరిణామం. ప్రాంతీయ భాషల హద్దులను చెరిపేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్న టామ్ హాలండ్ నిజమైన పాన్-ఇండియా అప్పీల్ ఉన్న నటుడిగా నిరూపించుకుంటున్నారు.

భార‌త హీరోల సినిమాలతో పోటీ పడుతూ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామం భార‌త దేశంలోని ట్రేడ్ అనలిస్టులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్క‌డ హీరోల మార్కెట్ వ్యూహాలకు గట్టి పోటీ ఇస్తూ హాలీవుడ్ స్టార్లు బార‌త్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న తీరు భవిష్యత్తులో నిర్మాణ శైలిని మార్చే అవకాశం ఉంది. గ్లోబల్ కంటెంట్ భార‌తీయ‌ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో? చెప్పడానికి ఈ సినిమా కలెక్షన్లే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మొత్తంగా `స్పైడర్-మ్యాన్` చిత్రంతో టామ్ హాలండ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ ఇటు స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తోంది. విదేశీ నటుడై నప్పటికీ భారతీయ ప్రేక్షకుల నాడీని పట్టుకుంటూ ఆయన సాధిస్తున్న విజయాలు భవిష్యత్తులో హాలీవుడ్ చిత్రాల మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడం ఖాయం.