స్పైడర్-మ్యాన్ ఇమేజ్ దాటేసిన టామ్ హాలండ్!
‘స్పైడర్ మ్యాన్’ స్టార్ టామ్ హాలండ్‌కు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’ కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందట. ఈ సినిమాలో ఒడిస్సియస్ కుమారుడు టెలిమాకస్‌గా నటించిన ఆయన, సూపర్ హీరో ఇమేజ్‌కు మించి నటుడిగా ఎదిగేందుకు ఈ ప్రాజెక్ట్ తోడ్పడిందని తెలిపారు. నోలన్ నుంచి ప్రశంసలు అందుకోవడం మర్చిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. మరోవైపు ఫ్రెడ్ అస్టైర్ బయోపిక్‌లోనూ టామ్ టైటిల్ రోల్ పోషించనున్నారు.
By: Srikanth Kontham | 14 Nov 2026 12:49 PM ISTమార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో `స్పైడర్-మ్యాన్` గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ యంగ్ హీరో టామ్ హాలండ్. అప్పటి నుంచి టామ్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. తాజాగా ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన గ్రీక్ చిత్రం `ది ఒడిస్సీ` లో నటించడం టామ్ లో ఓ కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. లండన్‌లో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేసారు. `సూపర్ హీరో ఇమేజ్‌కు మించి నాలో అసలైన నటుడిని వెలికితీసేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో తోడ్పడింది.
`క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకుడితో కలిసి పనిచేయడం నా కల. ఆయన నుండి చిన్న అభినందన దక్కడం జీవితంలోనే మర్చిపోలేని అనుభూతినిచ్చింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి క్రిస్‌కు పెద్ద అభిమానిని. ఆయన సినిమాలో నటించడమే కాదు. ఆయన ఇంట్లో కూర్చుని సినిమా చూసి.. ఆయనతో శెభాష్ అనిపించుకోవడం నా తదుపరి ప్రయాణానికి ఓ అద్భుతమైన ఆరంభం. నటుడిగా నాకు ఇంతకుముందు ధైర్యాన్ని, నమ్మకాన్ని నాకు ఇచ్చారు. నోలన్ -నిర్మాత ఎమ్మా థామస్ నటీనటులను ప్రోత్సహించే తీరు అమోఘమని కొనియాడారు.
ఈ చిత్రంలో ఒడిస్సియస్ కుమారుడు `టెలిమాకస్` పాత్రలో నటించిన టామ్ హాలండ్ సహనటులు , భార్య జెండాయా నుంచి కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు. భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకునే ధైర్యం `ది ఒడిస్సీ` ద్వారా లభించిందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా అందించిన విజయం కొత్త ఆత్మవిశ్వాసంతో తదుపరి ప్రాజెక్టులలోకి అడుగు పెడతానన్నారు
అలాగే ఇదే ఏడాది టామ్ హాలండ్ మరో ఛాలెంజింగ్ రోల్‌కు సిద్ధమవుతున్నారు. ప్రముఖ డ్యాన్సర్, హాలీవుడ్ లెజెండ్ ఫ్రెడ్ అస్టైర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషించనున్నారు. ఈ చిత్రానికి పాల్ కింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఏడాదిలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో? టామ్ మార్కెట్ కూడా రెట్టింపు అయింది. ప్రస్తుతం హాలీవుడ్ మార్కెట్ లో పోటీ తీవ్రంగా ఉంది. సీనియర్ హీరోలు సహా కొత్త తారలు కూడా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ఆ చిత్రాల ప్రభావం భారతీయ మార్కెట్ పై కూడా బలంగా ఉంటోంది.
