జక్కన్నపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు!
ప్రముఖ నటుడు టామ్ హిడిల్‌స్టన్ రీసెంట్ గా ఇండియన్ సినిమాపై తనకున్న ప్రేమ ను వ్యక్తపరిచారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Jan 2026 1:07 AM ISTప్రముఖ నటుడు టామ్ హిడిల్‌స్టన్ రీసెంట్ గా ఇండియన్ సినిమాపై తనకున్న ప్రేమ ను వ్యక్తపరిచారు. తాను చూసిన మొదటి బాలీవుడ్ సినిమా గురించి పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకోవడంతో పాటూ ఇండియన్ సినిమాలోని కొంతమంది స్టార్లపై తనకున్న అభిమానాన్ని తెలియచేశారు టామ్. ప్రముఖ మ్యాగజైన్ హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో జరిగిన ఇంటర్వ్యూలో టామ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
ఎంతో కాలంగా ఇండియన్ సినిమాను ఇష్టపడుతున్నా
ఇండియన్ ఫిల్మ్స్ తో తన మొదటి ఎక్స్‌పీరియెన్స్ గురించి మాట్లాడుతూ, తాను చాలా కాలంగా ఇండియన్ సినిమాను ఇష్టపడుతున్నానని, తాను మొదటిగా చూసిన ఇండియన్ మూవీ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 2002 పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా దేవదాస్ అని, అది చూసి కూడా చాలా కాలమైందని, ఓ లోకల్ థియేటర్ లో తాను ఆ సినిమా చూడ్డానికి వెళ్లిన విషయం తనకు ఇప్పటికీ గుర్తుందని, అదొక స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్ అని, అలాంటి సినిమాను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని టామ్ హిడిల్‌స్టన్ చెప్పారు.
రాజమౌళి అద్భుతం
అదే ఇంటర్వ్యూలో ఎవరితో కలిసి వర్క్ చేయాలనేది మీ డ్రీమ్ అని అడగ్గా, ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయారు. కానీ ఎప్పుడైతే రాజమౌళి పేరు వచ్చిందో వెంటనే అతని ఫేస్ వెలిగిపోయింది. రాజమౌళిని అద్భుతమైన డైరెక్టర్ అని టామ్ ప్రశంసించారు. మరి ఈ డ్రీమ్ కాంబినేషన్ ను రాజమౌళి ఫ్యూచర్ లో సెట్ చేస్తారేమో చూడాలి.
ఇక షారుఖ్ పై హిడిల్‌స్టన్ తనకున్న అభిమానాన్ని గత కొన్నేళ్లుగా పదే పదే చెప్పుకుంటూనే వస్తున్నారు. బాలీవుడ్ లో ఎవరైనా మార్వెల్ క్యారెక్టర్ లోకి ని చేయగలరా అంటే అది షారుఖ్ ఖాన్ మాత్రమేనని ఆయన చెప్పారు. షారుఖ్ చాలా బావుంటారని, అతను ఏం చేసినా స్పెషల్ గా ఉంటుందని కూడా టామ్ అన్నారు. కాగా షారుఖ్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
