Begin typing your search above and press return to search.

టామ్ క్రూజ్ వేల కోట్ల సంపద వెనుక ఇంత రహస్యం ఉందా?

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను ఒక మామూలు నటుడిగానే నా సినీ కెరీర్ ని ప్రారంభించాను.

By:  Madhu Reddy   |   31 Aug 2025 3:00 AM IST
టామ్ క్రూజ్ వేల కోట్ల సంపద వెనుక ఇంత రహస్యం ఉందా?
X

టామ్ క్రూజ్ సినీ ఇండస్ట్రీపై పూర్తి అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. అయితే ఈయన హాలీవుడ్ నటుడు అయినప్పటికీ ఈయన అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు.ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి టామ్ క్రూజ్ ఫేవరెట్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అలాంటి టామ్ క్రూజ్ దాదాపు 40 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు. ఆయన నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు ఆయన జీవితాన్ని మార్చేశాయి.ఈ సినిమాల్లో ఆయన చేసే యాక్షన్ స్టంట్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. అయితే అలాంటి టామ్ క్రూజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితం సక్సెస్ఫుల్గా సాగిపోవడానికి కారణం ఇదే అంటూ తన సక్సెస్ సీక్రెట్ బయట పెట్టారు. మరి ఇంతకీ సాధారణ నటుడి నుండి అత్యున్నత స్థాయికి టామ్ క్రూజ్ ఎలా ఎదిగారు? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వేలకోట్ల ఆస్తి వెనుక అసలు రహస్యం అదే - టామ్ క్రూజ్

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను ఒక మామూలు నటుడిగానే నా సినీ కెరీర్ ని ప్రారంభించాను. కానీ ప్రస్తుతం ఎంతో మంచి స్థాయికి ఎదిగాను. నేను ఈ స్థాయికి రావడానికి కారణం భయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే లక్షణం, క్రమశిక్షణ..ఈ రెండే నన్ను జీవితంలో ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాయి. నేను ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళ అభిరుచులు తెలుసుకోవడానికి ముందుగా ఇష్టపడతాను. వాళ్ళు అదే రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారని అడుగుతాను. నేనే పని చేస్తున్నాననేది కాదు. నేను ఎవరిని అనేదే ఇంపార్టెంట్.. రూమ్ లో కూర్చొని పేపర్ల మీద అది చేయాలి ఇది చేయాలని రాసుకోవడం కాదు. బయట రియాలిటీ లోకి వచ్చి మనం అనుకున్న దాన్ని సాధించడమే గొప్ప.. అలాగే కొత్త ప్రదేశాలను సందర్శించడం, సృజనాత్మకతతో ఆలోచించడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, మానవత్వంతో మెదలడం ఇవన్నీ నేను ఎంచుకున్న అభిరుచులు.నేను నాలా ఉండడం వల్లే చాలామంది ఫ్రెండ్స్ తో కలిసి సృజనాత్మక లక్ష్యాలను సాధిస్తున్నాను."అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.అంతే కాదు తన సక్సెస్ సీక్రెట్ ఇదే అంటూ కూడా బయట పెట్టారు.

ప్రేక్షకులను అలరించడమే నా అంతిమ లక్ష్యం - టామ్ క్రూజ్

ఇక ఇదే ఇంటర్వ్యూలో మీరు యాక్షన్ స్టంట్లు చేస్తున్నప్పుడు భయపడరా..? కొండలపై నుండి దూకడం, రన్నింగ్ విమానాలను పట్టుకొని వేలాడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అని ప్రశ్నించగా.."నాకు సినిమాల్లో యాక్షన్ స్టంట్స్ చేయడం అస్సలు భయంగా అనిపించదు.. ఎందుకంటే భయం అంటే నాకు తెలియదు. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ ని నేను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తాను.అందుకే దేనికి భయపడను. మనం దేనికైనా భయపడి చేయలేం అని అనుకున్నప్పుడు కచ్చితంగా ఆ పని చేయాల్సిందే అని నిర్ణయించుకోవాలి. అలా అనుకున్నప్పుడే భయం లేకుండా ఆ పనిని పూర్తి చేస్తాం. నేను సినిమాల కోసం రియల్ స్టంట్స్ చేయడం వెనుక చాలా శ్రమ, పట్టుదల ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి రియల్ స్టంట్స్ కోసం శారీరకంగా శ్రమించి కొత్త టెక్నాలజీని నేర్చుకున్నాను.ఎంతో మందితో కలిసి వర్క్ చేశాను. ఇక అసలు విచిత్రం ఏమిటంటే.. మనం తెరవెనక చేసేది ఏమీ ప్రేక్షకులకు కనిపించదు.కేవలం స్క్రీన్ మీద మనం పండించే సన్నివేశం మాత్రమే కనిపిస్తుంది.ప్రేక్షకులను అలరించడమే నా అంతిమ కర్తవ్యం..

సలహాలు ఇవ్వడం కాదు సహాయపడాలి - టామ్ క్రూజ్

నేను చిన్నప్పటి నుండే ఏదైనా పని అనుకుంటే దాన్ని పూర్తి చేసేవాడిని.చేసే ప్రతి పనిని అత్యున్నత స్తాయిలో చేసేందుకు ట్రై చేయాలి.ఒకవేళ అది సాధ్యం కాకపోయినా దానికి దగ్గరగా వచ్చేలా అయినా చేసి చూపించాలి.ఇక మరో విషయం ఏమిటంటే.. కలలు కనండి.. అలాగే ఇతరులు కనే కలలను సాకారం చేయడంలో మీ వంతుగా వాళ్లకు సహాయం అందించండి... ఎందుకంటే నేను నా కోసం మాత్రమే కాదు ఇతరుల గురించి కూడా ఆలోచిస్తా. ఇతరులకు మనం సలహాలిస్తే తీసుకోరు.వాళ్ళు చేసే పనిని మరింత మెరుగ్గా చేయాలని చెబితే పట్టించుకుంటారు" అంటూ లైఫ్ సీక్రెట్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.అంతే కాదు సాధారణ నటుడి నుండి ప్రస్తుతం 600 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించానంటూ టామ్ క్రూజ్ చెప్పుకొచ్చారు.