టాంక్రూజ్ సినిమా కోసం ఇండియన్ స్టార్స్!
ప్రముఖ హాలీవుడ్ స్టార్ టాం క్రూజ్ నటించే తదుపరి చిత్రం కోసం భారతీయ నటులను వెతికే క్రమంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By: Srikanth Kontham | 16 July 2026 1:41 PM ISTప్రముఖ హాలీవుడ్ స్టార్ టాం క్రూజ్ నటించే తదుపరి చిత్రం కోసం భారతీయ నటులను వెతికే క్రమంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. `డిగ్గర్` దర్శకుడు డాక్టర్ బిజుకు పంపిన ఓ ఈమెయిల్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ స్థాయి ప్రాజెక్టుల కోసం భారతీయ ప్రతిభను ఎలా గుర్తిస్తున్నారనే? అంశంపై ఇది స్పష్టతనిస్తోంది. టాం క్రూజ్ సినిమా కోసం కావలసిన నటుడికి ఉండాల్సిన ప్రత్యేకతలు? వారి నటనలోని పరిణతి , వ్యక్తిత్వ లక్షణాల గురించి ఈమెయిల్‌లో వివరించినట్లు తెలుస్తోంది.
కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా పాత్రకు సరిపోయే సహజత్వానికి, భావోద్వేగాలను పండించగల సామర్థ్యానికి హాలీవుడ్ చిత్రనిర్మాతలు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో? ఈ పరిణామం తెలియజేస్తోంది. డాక్టర్ బిజు వంటి గంభీరమైన చిత్రాలు తీసే దర్శకుడిని సంప్రదించడం ద్వారా ఆ చిత్ర బృందం ఎంతటి లోతైన శోధన చేస్తోందో అర్థమవుతోంది. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా నటనలో లోతు ఉన్న నటులను ఎంచుకోవడానికి వారు పడుతున్న కష్టం ఇందులో కనిపిస్తోంది. ఇది భారతీయ నటులకు అంతర్జాతీయ వేదికపై లభిస్తున్న గుర్తింపుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఈ రకమైన అంతర్జాతీయ అవకాశాలు భారతీయ నటుల కెరీర్‌ను మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రంలో టాం క్రూజ్ వంటి నటుడితో కలిసి నటించడం అనేది ఏ నటుడికైనా గొప్ప అవకాశం. ఈ నేపథ్యంలోనే దర్శకులు సరైన నటుడి కోసం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలోని నైపుణ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ వెల్లడితో భవిష్యత్తులో భారతీయ నటులు మరిన్ని హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతూనే? ఒక భారతీయ నటుడిలో వారు వెతుకుతున్న పర్ఫెక్ట్ లక్షణాలు ఏంటో? ఈమెయిల్ ద్వారా సంకేతాలు పంపడం సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ ప్రయత్నం హాలీవుడ్ - భారతీయ చిత్ర పరిశ్రమల మధ్య వారధిలా పనిచేస్తోంది. ప్రతిభ ఎక్కడ ఉన్నా? వెతుక్కుంటూ వస్తుందనే దానికి ఇది ఉదాహరణ. టాం క్రూజ్ తదుపరి చిత్రంలో భారతీయ నటుడు కనిపిస్తే అది ఖచ్చితంగా భారతీయ సినీ పరిశ్రమకు దక్కే అరుదైన గౌరవమే అవుతుంది. అంతటి ప్రతిష్టాత్మక నటుడి చిత్రంలో చిన్న పాత్ర అయినా పోషించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నటీనటులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాందిటిది ఇప్పుడా ఆ అవకాశం భారతీయులకు వరించడం విశేషం. మరి ఈ అరుదైన అవకాశాన్ని ఏ నటుడు అందుకుంటాడు? అన్నది చూడాలి.
