Begin typing your search above and press return to search.

అంత‌రిక్షంలో స్టార్ క‌పుల్ పెళ్లితో సెన్సేష‌న్?

టామ్ క్రూజ్ - అనా డి ఆర్మాస్ జంట చాలా కాలంగా ఇంటర్నెట్ సంచ‌ల‌నంగా మారుతూనే ఉన్నారు.

By:  Sivaji Kontham   |   2 Oct 2025 8:00 PM IST
అంత‌రిక్షంలో స్టార్ క‌పుల్ పెళ్లితో సెన్సేష‌న్?
X

గుడిలో పెళ్లి, క‌ళ్యాణ మంట‌పంలో పెళ్లి ఇవ‌న్నీ రొటీన్. గాల్లో ఎగురుతూ పెళ్లాడ‌టం లేదా అంత‌రిక్షంలో గ్రావిటీలో పెళ్లాడ‌టం వీలుప‌డ‌క‌పోతే, పారాచూట్ నుంచి జారిప‌డుతూ పెళ్లాడ‌టం.. ఇలాంటివి అయితేనే ప్ర‌జ‌ల‌కు ఎక్కుతున్నాయి. రొటీన్ గా పెళ్లాడితే మ‌జా ఏం ఉంటుంది? అందుకే చాలా మంది క్రూయిజ్ షిప్ లో పార్టీ చేసుకుంటూ, న‌దీజ‌లాల్లో బోట్ షికార్ లో కూడా పెళ్లాడుతున్నారు.

అయితే తాను న‌టించే `మిష‌న్ ఇంపాజిబుల్` ఫ్రాంఛైజీ చిత్రాల్లో సాహ‌సంలా పెళ్లి కూడా ఉండాల‌ని అనుకుంటున్నాడ‌ట టామ్ క్రూజ్. అత‌డు కొంత‌కాలంగా త‌న వ‌య‌సులో స‌గం ఉండే అమ్మాయితో నిండా ప్రేమ‌లో ఉన్నాడు. ఇప్ప‌టికే మూడు నాలుగు సార్లు విడాకులిచ్చిన స్టార్ గా పాపుల‌రైన టామ్ 60 ప్ల‌స్ వ‌య‌సులో 30 ప్ల‌స్ అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వడంతో ఈ జంట గాల్లో విన్యాసాలు చేస్తూ పెళ్లాడుతుంద‌ని, లేదూ పారా చూట్ నుంచి దుముకుతూ మెడ‌లో తాళి క‌డ‌తాడ‌ని కూడా చాలా జోకులే పేల్తున్నాయి టామ్ పై. ఈ జంట నిజంగా అంత‌రిక్షంలో పెళ్లాడుతుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా వార్త అయితే రాలేదు కానీ అలా జ‌ర‌గ‌డానికి ఆస్కారం ఉంద‌న్న క‌థ‌నాలు మాత్రం మెంట‌లెక్కించేస్తున్నాయి.

గాల్లో ఎగ‌ర‌డంలో విమానాల‌పై నుంచి జంప్ చేయ‌డంలో మ‌జాను టామ్ క్రూజ్ ఆస్వాధించ‌గ‌ల‌డు కానీ, పాపం అన్నెం పుణ్ణెం తెలియ‌ని ఈ అమ్మాయి (పెళ్లికూతురు -అనా డి) ఏం చేసింది? త‌న‌కు అంత గుండె ధైర్యం ఉండాలి క‌దా? అని కూడా కొంద‌రు నిల‌దీస్తున్నారు. పాపం గుండెను అర‌చేతిలో పెట్టుకుని ఆమె కూడా సాహ‌సం చేయాలా? అయినా టామ్ కి ఇదేమి పిచ్చి ప్రేమ? అని కూడా కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

టామ్ క్రూజ్ - అనా డి ఆర్మాస్ జంట చాలా కాలంగా ఇంటర్నెట్ సంచ‌ల‌నంగా మారుతూనే ఉన్నారు. ఆ ఇద్దరూ స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోల‌ను లీక్ చేస్తూ హాలీవుడ్ మీడియా టీఆర్పీ ఆట‌లు ఆడుతూనే ఉంది. ఇటీవ‌ల ఈ జంట బాగా క్లోజ్ అయిపోయారు. వెర్మోంట్ లో క‌లిసి రొమాంటిక్ డేట్ ని ఆస్వాధించారు. ఇప్పుడు ఇక పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారు! అంటూ ఒక‌టే ప్ర‌చారం సాగిపోతోంది.

టామ్ క్రూజ్ ఇంతకు ముందెన్నడూ ఏ ప్రేమ‌జంటా సాహ‌సించ‌ని రీతిలో, క‌నీవినీ ఎరుగ‌ని వివాహంతో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నందున మీరంతా ఊపిరి పీల్చుకోండి. హాలీవుడ్ సూపర్‌స్టార్ చరిత్ర సృష్టించ‌డానికి సిద్ధంగా ఉన్నాడు! అంటూ ప్ర‌చారం సాగిపోతోంది. ``వాళ్ళిద్దరినీ నిజంగా క‌లిపి ఉంచే మ్యాట‌ర్ ఏమిటంటే వీళ్ల‌ను ఇలాంటి సాహసోపేతమైన విన్యాసాలు చేయడానికి ఇష్టపడట‌మే.. కాబట్టి గాలిలో అంత‌రిక్షంలో పెళ్లి వీళ్ల‌కు అవ‌స‌రం`` అని కొంద‌రు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవ‌ల టామ్ అంత‌రిక్షానికి అల‌వాటు ప‌డ్డాడు. అందుకే అంతరిక్షంలో వివాహం చేసుకున్న మొదటి జంట అనే ఆలోచన అతడిని ఎగ్జ‌యిట్ చేస్తుందంటూ కూడా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. స్కైడైవింగ్ చేస్తూ పెళ్లాడుతారా? బహుశా గాలిలో పెళ్లి ప్రమాణాలకు రెడీ అవుతారా? అంటూ అభిమానుల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది.