Begin typing your search above and press return to search.

తెర‌పై ప్ర‌తి మిష‌న్‌ని జ‌యించే న‌టుడి జీవితమే ఒక ఓట‌మి!

వెండితెర‌పై గ‌గుర్పాటుకు గురి చేసే సాహ‌స‌విన్యాసాల‌తో క‌ట్టిప‌డేయ‌డంలోనే కాదు, ఆఫ్ ద స్క్రీన్ మ‌గువ‌ల‌తో రొమాన్స్ చేయ‌డంలోను టామ్ క్రూజ్ రికార్డు అసాధార‌ణ‌మైన‌ది.

By:  Sivaji Kontham   |   7 Nov 2025 5:00 AM IST
తెర‌పై ప్ర‌తి మిష‌న్‌ని జ‌యించే న‌టుడి జీవితమే ఒక ఓట‌మి!
X

వెండితెర‌పై గ‌గుర్పాటుకు గురి చేసే సాహ‌స‌విన్యాసాల‌తో క‌ట్టిప‌డేయ‌డంలోనే కాదు, ఆఫ్ ద స్క్రీన్ మ‌గువ‌ల‌తో రొమాన్స్ చేయ‌డంలోను టామ్ క్రూజ్ రికార్డు అసాధార‌ణ‌మైన‌ది. ఇప్ప‌టికే అత‌డు న‌లుగురు భార్య‌ల‌కు విడాకులిచ్చాడు. ఎంతో మందితో డేటింగులు చేసినా మ‌ధ్య‌లోనే బ్రేక‌ప్‌లు చెప్పాడు.

ఇటీవ‌లే రెండేళ్లుగా త‌న‌కంటే చాలా చిన్న వ‌య‌సు ఉన్న అమ్మాయితో టామ్ క్రూజ్ ప్రేమ‌లో ఉన్నాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. 63 ఏళ్ల వయసులో 37 ఏళ్ల నటితో ఏడాది కాలంగా ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు. టామ్ క్రూజ్ - అనా డి ఆర్మాస్ జంట రెగ్యుల‌ర్ గా మీడియా హెడ్ లైన్స్ లోకొస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరూ స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఎప్ప‌టిక‌ప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల ఈ జంట బాగా క్లోజ్ అయిపోయారు. వెర్మోంట్‌లో క‌లిసి రొమాంటిక్ డేట్‌ని ఆస్వాధించారు. ఇటీవ‌ల‌ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారని కూడా ప్ర‌చార‌మైంది.

ఆ ఇద్ద‌రి మ‌ధ్యా విడ‌దీయ‌రాని బంధం గురించి మాట్లాడుకున్నారు. ఈ మ్యాచ్‌కు టామ్ క్రూజ్ సైంటాలజీ సలహాదారుల నుండి అరుదైన ఆమోదం లభించిందని చర్చ జరిగింది. కానీ ఇప్పుడు వీట‌న్నిటికీ భిన్న‌మైన వార్త వినాల్సి వ‌స్తోంది. టామ్ కి అత్యంత‌ సన్నిహితులు ఈ ఇద్ద‌రి బంధం ముగింపు ద‌శ‌కు చేరుకుంద‌ని చెబుతున్నారు.

ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రిగిందో టామ్ క్రూజ్ అనాకు దూర‌మయ్యాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కానీ అనా స్వ‌యంగా వెన‌క్కి త‌గ్గింద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. టామ్ క్రూజ్ ప్ర‌స్తుత‌ స్థితి అశాంతితో ఉందని, అతడి ఆత్మవిశ్వాసం, గర్వం, విచారం మధ్య ఊగిస‌లాట క‌నిపిస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. టామ్ క్రూజ్ ఇది త‌న నిర్ణ‌యం అని చెబుతుంటే, లేదు ఆమె మొదట వెళ్ళిపోయిందనే విచారంతో ఉన్నాడ‌ని కూడా స్నేహితులు చెప్పారు.

టామ్ క్రూజ్ - అనా డి అర్మాస్ విడిపోవడానికి కారణం ఏమిటో ఇంకా స్ప‌ష్ఠ‌త లేదు. కొన్ని నెల‌ల డేటింగ్ లో టామ్ క్రూజ్ నిర్మాణాత్మక ఆలోచ‌న‌ల గురించి మాట్లాడుతుంటే, అనా త‌న స్వాతంత్య్రంతో ఘర్షణ పడటం ప్రారంభించింది. ఆమె కెరీర్, ఫిట్‌నెస్, ఇంటర్వ్యూలు స‌హా రోజువారీ అలవాట్ల గురించి టామ్ క్రూజ్ అతిగా ఇన్వాల్వ్ అవుతున్నాడ‌ట‌. మొద‌ట దేనినీ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా, నెమ్మ‌దిగా అది త‌న‌పై నియంత్ర‌ణ‌లా అనిపించింద‌ని అనా భావిస్తోంద‌ట‌. ఒక‌వైపు టామ్ క‌చ్చితత్వం వారి మ‌ధ్య‌ వేగంగా దూరానికి దారితీసింది. అనా డి అర్మాస్ అతడి కాల్‌లను విస్మరించడం ప్రారంభించ‌డంతో, చివరికి వారి మ‌ధ్య నిశ్శ‌బ్ధం రాజ్య‌మేలింది.

నిజానికి అనాతో కుటుంబాన్ని ప్రారంభించడం గురించి టామ్ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉన్నాడు. 2012లో కేటీ హోమ్స్ నుండి విడిపోయినప్పటి నుండి న్యాయ‌ప‌ర‌మైన విష‌యాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిగ‌ణిస్తున్నాడ‌ని కూడా చెబుతున్నారు. జీవితంలో స‌మ‌తుల్య‌త కోల్పోకుండా భార్య‌ల‌తో వ్య‌వ‌హారాల‌ను అత‌డు మెయింటెయిన్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. దీనికోసం నిరంత‌రం న్యాయ‌వాదుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడు.

ఆసక్తిక‌రంగా టామ్ క్రూజ్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని నియంత్రించే ఒక వ్య‌వ‌స్థ ఉంది. అది చ‌ర్చ్ ఆఫ్ సైంటాల‌జీ. అత‌డికి ఎవ‌రు సూట‌బుల్? అనే విష‌యాల‌ను ఇది పరిశీలిస్తుంది. అత‌డితో చాలా రిలేష‌న్ షిప్స్ ని ఈ చ‌ర్చి రూపొందించింద‌ని, ఇటీవ‌ల అత‌డికి కాబోయే భాగస్వాములను `ఆడిషన్` చేసే స్థాయికి కూడా చేరుకుందని అతడి చుట్టూ ఉన్నవారు అంటున్నారు. ప్ర‌స్తుతం టామ్ క్రూజ్ మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా చిత్రీక‌ర‌ణ‌కు రెడీ అవుతున్నాడు. అదే స‌మ‌యంలో టాప్ గ‌న్ సీక్వెల్ కోసం కూడా సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే అంత‌కుముందే త‌న సుదీర్ఘ బ్యాచిల‌ర్ షిప్ ని ముగించాల్సిన అనా దూర‌మ‌వ్వ‌డం అత‌డిని క‌ల‌చివేసింది. తెరపై ప్రతి మిషన్‌ను జయించే వ్యక్తి త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఓడిపోతూనే ఉన్నాడు.