వయసు ఒక నంబర్ మాత్రమే..షాకిస్తున్న 63 ఏళ్ల స్టార్ డేటింగ్ చరిత్ర!
అతడికి 63.. ఆమెకు 37 .. 26 సంవత్సరాల వయసు వ్యత్యాసం.. అయినా ఆ ఇద్దరూ చిలుకా గోరింకల్లా కలిసిమెలిసి ఉన్నారు.
By: Sivaji Kontham | 2 Aug 2025 9:03 AM ISTఅతడికి 63.. ఆమెకు 37 .. 26 సంవత్సరాల వయసు వ్యత్యాసం.. అయినా ఆ ఇద్దరూ చిలుకా గోరింకల్లా కలిసిమెలిసి ఉన్నారు. పబ్లిక్ లో జంటగా షికార్లు చేస్తున్నారు. రోమాంటిక్ లైఫ్‌ని నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. నిరంతరం జంట షికార్లతో కెమెరా కంటికి చిక్కినా.. ఈ స్టార్ కపుల్ డేటింగ్ గురించి అంగీకరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అసలు డేటింగ్‌కి వయసుతో పనేంటి? అని అతడిని చూసినవారు ప్రశ్నిస్తారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతడు మరెవరో కాదు - లెజెండరీ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్. అతడు ప్రముఖ హాలీవుడ్ నటి అనా డి అర్మాస్ తో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట షికార్లు ఔటింగులు నిరంతరం హాలీవుడ్ మీడియాలో చర్చగా మారుతున్నాయి. ఇటీవల అమెరికాలోని వెర్మోంట్‌లో వారాంతంలో హాయిగా గడిపిన ఈ ఇద్దరూ చేయి చేయి కలిపి నడుస్తుండగా మీడియా కంటికి చిక్కారు. చాలా క్యాజువల్ దుస్తుల్లో సింపుల్ గా కనిపించిన ఈ జంట ఒకరికొకరు సహవాసంలో ప్రశాంతంగా అన్యోన్యంగా ఉన్నారు. ఇద్దరు ఏ-లిస్టర్ స్టార్లు కలిసి కనిపిస్తే హాలీవుడ్ మీడియా వదిలేస్తుందా? దీనిపై ప్రస్తుతం రకరకాల కథనాలు వండి వారుస్తోంది.
అది ప్రేమకు అడ్డంకి కాదు:
ముఖ్యంగా టామ్ క్రూజ్ -అనా డి అర్మాస్ మధ్య వయసు వ్యత్యాసం గురించి మీడియాలో వరుస కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇరువురి నడుమా 26 సంవత్సరాల వయసు వ్యత్యాసం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టామ్ క్రూజ్ వయస్సు 63 అయితే, అనా డి అర్మాస్ వయస్సు 37 సంవత్సరాలు. అయితే ఈ జంట అన్యోన్యత చూస్తుంటే వయసు ఒక నంబర్ మాత్రమే. అది ప్రేమకు అడ్డంకి కాదని కూడా నిరూపణ అవుతోంది.
హాలీవుడ్ లో లెజెండరీ నటుడు:
టామ్ క్రూజ్ దశాబ్ధాలుగా ఎంఐ సిరీస్ లో నటిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. యాక్షన్ ప్యాక్డ్ `మిషన్: ఇంపాజిబుల్` ఫ్రాంచైజీలో అతడు చిట్టచివరి చిత్రంలో నటించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుత వసూళ్లను సాధించింది. టాప్ గన్, రిస్కీ బిజినెస్, రెయిన్ మ్యాన్ వంటి చిత్రాలతోను గొప్ప ఖ్యాతిని ఘడించాడు. దశాబ్ధాలుగా అతడు హాలీవుడ్‌లో అగ్ర కథనాయకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. అతడి గాళ్ ఫ్రెండ్ అనా డి అర్మాస్ హాలీవుడ్‌కు షిఫ్టవడానికి ముందు స్పానిష్ టెలివిజన్‌లో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. బ్లేడ్ రన్నర్ 2049తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత నైవ్స్ అవుట్‌లో విమర్శకుల ప్రశంసలు పొందింది. బ్లోండ్‌లో మార్లిన్ మన్రోగా గోల్డెన్ గ్లోబ్ కి నామినేట్ అయినప్పుడు ప్రపంచం దృష్టిని మరింతగా ఆకర్షించింది. టామ్- అనా డి అత్యుత్తమ తారలుగా చరిత్రలో నిలిచిపోయారు.
బయటికి చెప్పని ప్రేమాయణాలు:
ఇక టామ్ క్రూజ్ ప్రేమాయణాల చరిత్ర అసాధారణమైనది. అతడు 1987 నుండి 1990 వరకు నటి మిమి రోజర్స్ తో వైవాహిక బంధంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయి నికోల్ కిడ్మాన్ ను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. నికోల్ ( 1990 నుండి 2001 వరకు)తో కలిసి టామ్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నాడు. తర్వాత కేటీ హోమ్స్ ని పెళ్లాడాడు. 2006 నుండి 2012 వరకు ఈ జంట పయనం సాగింది. వారికి సూరి అనే కుమార్తె ఉంది. అయితే టామ్ క్రూజ్ లైఫ్ లో ఎందరు ఉన్నారు? అంటే చెప్పడం చాలా కష్టం. అతడు తన జీవితంలో చాలా మంది కథానాయికలతో డేట్ చేసాడు. కానీ వారి గురించి బహిరంగంగా వెల్లడించలేదు.
సహనటులతో డేటింగ్ చరిత్ర పెద్దదే:
టామ్ ప్రస్తుత గాళ్ ఫ్రెండ్ అనా డి అర్మాస్ గతంలో స్పానిష్ నటుడు మార్క్ క్లోటెట్ ను వివాహం చేసుకుంది. అతడి నుంచి విడిపోయాక పలువురు సహ నటులతో డేటింగ్ చేసింది. కానీ 2020లో `డీప్ వాటర్` సహనటుడు బెన్ అఫ్లెక్ తో రిలేషన్ కారణంగా ప్రపంచం, మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. 2021 ప్రారంభంలో ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుండి అనా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచింది. ప్రస్తుతం టామ్ క్రూజ్ తో డేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
