యంగ్ స్టార్స్ మేకోవర్ కాకపుట్టించేలా!
క్యారెక్టర్ డిమాండ్ మేరకు శరీర సౌష్ఠవాన్ని మార్చుకుంటూ సరికొత్త మేకోవర్‌తో సంచలనం క్రియేట్ చేస్తున్నారు.
By: Srikanth Kontham | 15 March 2026 8:21 PM ISTటాలీవుడ్ యువ హీరోలు కేవలం నటనతోనే కాదు. తమ లుక్స్‌తో కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. క్యారెక్టర్ డిమాండ్ మేరకు శరీర సౌష్ఠవాన్ని మార్చుకుంటూ సరికొత్త మేకోవర్‌తో సంచలనం క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పలు క్రేజీ ప్రాజెక్టుల కోసం శర్వానంద్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, సాయి దుర్గ తేజ్ చేస్తున్న ప్రయోగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ స్టార్స్ మేకోవర్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. యంగ్ స్టార్ శర్వానంద్ తన తదుపరి చిత్రం `బైకర్` కోసం కంప్లీట్ న్యూ మేకోవర్ లో అదరగొడుతున్నాడు.
ప్రొఫెషనల్ బైక్ రేసర్ పాత్ర పోషిస్తోన్న శర్వానంద్ అందుకోసం శరీర బరువును తగ్గించుకుని లీన్, స్టైలిష్ లుక్ లోకి మారారాడు. రేసింగ్ సూట్‌లో శర్వానంద్ లుక్ చూస్తుంటే? పక్కా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది. లుక్ మాత్రమే కాకుండా పాత్ర కోసం ప్రత్యేకంగా బైక్ రేసింగ్ మెళకువలు కూడా నేర్చుకోవడం విశేషం. అలాగే అక్కినేని వారసుడు నాగ చైతన్య కూడా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రాజెక్ట్ `వృషకర్మ`. ఈ సినిమా కోసం చై సరికొత్తగా ముస్తాబయ్యారు. పవర్‌ఫుల్ - అడ్వెంచరస్ రోల్‌లో కనిపించబోతున్నాడు.
తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశారు. సినిమా కోసం ఆయన పెంచిన గడ్డం - కొత్త హెయిర్ స్టైల్ మాస్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రగ్గడ్ లుక్‌లో చైతూ కనిపిస్తుం డటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. న్యూ మేకోరవర్ తో అదరగొడుతున్నాడు. మరో స్టార్ విజయ్ దేవరకొండ కూడా `రణబాలి` కోసం ఎలా మేకోవర్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా బీస్ట్ మోడ్‌లోకి మారిపోయాడు. కండలు తిరిగిన దేహంతో ఇంటెన్స్ లుక్‌లో కట్టిపడేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కనిపిస్తున్న విజువల్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.
ఓ పోరాట యోధుడి తరహాలో తన ఫిజిక్‌ను మలుచుకున్న తీరు ప్రశంసనీయం. ఈ సినిమా కోసం గంటల తరబడి జిమ్‌లో కష్టపడుతున్నారు. విజయ్ మేకోవర్ `రణబాలి` చిత్రానికి మెయిన్ హైలైట్ కానుంది. అలాగే మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తన తదుపరి చిత్రం `సంబరాల ఏటిగట్టు` కోసం అద్భుతమైన 'సిక్స్ ప్యాక్స లుక్ తో అదరగొడుతున్నాడు. గ్రామీణ నేపథ్యం ఉన్న కథ అయిన ప్పటికీ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం సాయి తన బాడీని పర్‌ఫెక్ట్ షేప్‌లోకి తెచ్చాడు. బల్కీ లుక్‌లో సాయితేజ్ చూపిస్తున్న ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలా ముగ్గురు హీరోలు న్యూ మేకోవర్ లో ఆకట్టుకుంటున్నారు.
