Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బ్యాచిలర్స్.. ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా?

టాలీవుడ్‌ లో పెళ్లి సందడి మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు యంగ్ హీరోలు వివాహ బంధంలోకి అడుగు పెడుతుండటంతో ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది.

By:  M Prashanth   |   4 March 2026 3:42 PM IST
టాలీవుడ్ బ్యాచిలర్స్.. ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా?
X

టాలీవుడ్‌ లో పెళ్లి సందడి మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు యంగ్ హీరోలు వివాహ బంధంలోకి అడుగు పెడుతుండటంతో ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల సెలబ్రిటీల పెళ్లిళ్లు వరుసగా జరుగుతుండటంతో సోషల్ మీడియాలో వెడ్డింగ్ వైబ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే సమయంలో హీరోల పెళ్లిళ్లకు సంబంధించిన ఈవెంట్స్ కోసం అంతా మాట్లాడుకుంటున్నారు.

యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబంలో పెళ్లి వేడుకల హడావిడి మొదలైంది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ఘనంగా నిర్వహించారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయంగా జరిగిన వేడుకలు ఎంతో ఆకట్టుకున్నాయి. డెకరేషన్ నుంచి ఆతిథ్యం వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోటోలు, వీడియోలు బయటకు రాగానే అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మరోవైపు, స్టార్ జంటగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు ఇటీవల జరగ్గా.. సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాజస్థాన్‌ లో జరిగిన వారి సంగీత్, పెళ్లి వేడుకలు రాయల్ టచ్‌ తో సాగాయి. రాజసంగా చేసిన అలంకరణ, ట్రెడిషనల్ డ్రెస్సింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిపి ఆ వేడుకలను మరింత ప్రత్యేకంగా నిలిపాయి. అనంతరం సత్యనారాయణ వ్రతం నిర్వహించారు.

త్వరలో గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్స్‌ కు సంబంధించిన పిక్స్, వీడియోలు కూడా నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి. ఇలా వరుసగా హీరోల పెళ్లిళ్లు జరగడం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ గా మారుతోంది. ఒక్కో హీరో తన పెళ్లిని ప్రత్యేకంగా, కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటుండడం విశేషం. అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరోల పెళ్లిళ్లను కుటుంబ వేడుకలా భావిస్తూ ఆసక్తిగా ఫాలో అవుతున్నారు.

ప్రస్తుతం అల్లు శిరీష్ పెళ్లి ఎక్కడ? ఎలా? ఎలాంటి థీమ్‌ తో? అనే విషయాలు ఇండస్ట్రీలో చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ చూసిన తర్వాత మెయిన్ వెడ్డింగ్ ఇంకా గ్రాండ్‌ గా ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి. సింపుల్‌ గా అయినా.. క్లాసీగా చేసే స్టైల్‌ లో శిరీష్ ప్లాన్ చేస్తున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యేలా ప్రైవేట్ వేడుకగా నిర్వహించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇంకా పెళ్లి కాని టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలు ఎవరెవరు? వారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎలా ప్లాన్ చేస్తారు? అన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా జరిగిన శిరీష్, విజయ్ వేడుకలను చూసి మిగతా హీరోలు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటారా అన్నది చూడాలి. మొత్తానికి టాలీవుడ్‌ లో ఇప్పుడు సినిమా హడావుడితో పాటు పెళ్లి సందడి కూడా ఈక్వల్ గా కొనసాగుతోంది. హీరోల జీవితాల్లో కొత్త చాప్టర్ ప్రారంభమవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.