హీరోల రెమ్యునరేషన్.. ఇక నిర్మాతలకు భారం తగ్గినట్లే!
ఏ సినిమాకు అయినా నిర్మాతలే బ్యాక్ బోన్. వాళ్లు లేకుంటే చిత్రాలే లేవ్. కొన్ని లక్షల మందికి ఉపాధి ఉండదు.
By: M Prashanth | 9 Aug 2025 11:28 AM ISTఏ సినిమాకు అయినా నిర్మాతలే బ్యాక్ బోన్. వాళ్లు లేకుంటే చిత్రాలే లేవ్. కొన్ని లక్షల మందికి ఉపాధి ఉండదు. ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఉండదు. అలాంటి నిర్మాతలు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు సినిమా ఎక్కితే పర్లేదు.. లేకుంటే అంతే సంగతి. భారీ నష్టాలను చవి చూశారు.. చూస్తున్నారు కూడా..
అదే సమయంలో హీరోలు కూడా రెమ్యునరేషన్స్ భారీగా డిమాండ్ చేస్తున్నారని ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో రిజల్ట్ తో సంబంధం లేకుండా నిర్మాతలు వారికి పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నిర్మాతలకు మద్దతుగా నిలిచేందుకు అనేక మంది యంగ్ హీరోలు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
అటు అవకాశాలు కాపాడుకుంటూ.. ఇటు నిర్మాతలకు సపోర్ట్ గా నిలవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకు గాను సినిమా రిలీజ్ అయ్యాక ప్రాఫిట్స్ అందుకునే పద్ధతిలో వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఇప్పుడు పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు.. అదే పనిలో ఉన్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇప్పుడు కొరియన్ కనగరాజ్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కామిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు గాను వరుణ్ మినిమమ్ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నారని సమాచారం. మూవీ రిలీజ్ అయ్యాక లాభాలు అందుకోనున్నారని వినికిడి.
యంగ్ హీరో నితిన్ కూడా లాభాలను పంచుకునే మోడల్ లో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ మూవీ ఎల్లమ్మతోపాటు అప్ కమింగ్ సినిమాలకు గాను అదే విధానం ఫాలో అవ్వనున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ తన రాబోయే సినిమాలకు ప్రాఫిట్ షేర్స్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఎనిర్జిటిక్ స్టార్ రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా కోసం లాభాలను పంచుకునే మోడల్ పై పని చేస్తున్నారట. తన భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా ఆ విధానంలో చేయనున్నారని టాక్. గోపీచంద్ తన రెమ్యునరేషన్ లో 50 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారని టాక్. సినిమా విడుదలైన తర్వాత లాభాలను పంచుకుంటారని వినికిడి.
నిఖిల్.. నిర్మాతలను తనకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి బదులుగా సినిమా కోసం ఖర్చు చేయాలని కోరారని సమాచారం. పారితోషికం విషయంలో నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి చాలా మంది యువ నటులు లాభాల షేర్ చేసుకునే పద్ధతిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే నిజమైతే.. నిర్మాతలకు ఇక భారం తగ్గినట్లే. మిగతా హీరోలు కూడా అదే ఫాలో అయితే ప్రొడ్యూసర్స్ కు భారీ ఊరట అనే చెప్పాలి.
