Begin typing your search above and press return to search.

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

టాలీవుడ్ యంగ్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సాయితేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, నిఖిల్ ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌస్’, తేజ సజ్జా ‘జాంబిరెడ్డి 2’ చిత్రాలతో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. పీరియాడిక్, ఫాంటసీ, చారిత్రక కథాంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలు 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి విజయవంతమైతే టాలీవుడ్ హీరోల మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

By:  Srikanth Kontham   |   7 Nov 2026 11:00 PM IST
యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్  ప్లాన్స్!
X

టాలీవుడ్ లో న‌యా ట్రెండ్ న‌డుస్తోంది. రొటీన్ క‌మ‌ర్శియ‌ల్ క‌థ‌లు..రొటీన్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ల‌కు స్వ‌స్తి ప‌లికి యంగ్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా వైవిథ్య‌మైన కాన్సెప్ట్ ల‌ను ఎంచుకుంటున్నారు. 2027 నాటికి మార్కెట్ ప‌రిధిని నెక్స్ట్ లెవ‌ల్ కు తీసుకెళ్లాల‌నే క‌చ్చిత‌మైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈపాన్ ఇండియా రేసులో సుప్రీమ్ హీరో సాయితేజ్ స‌రికొత్త పంథాని ఎంచుకున్నారు.పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న `సంబ‌రాల ఏటిగ‌ట్టు` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో సాయితేజ్ రా అండ్ ర‌గ్డ్ లుక్ లోకి మారిపోయారు. మునుపెన్న‌డు లేని విధంగా ప‌వ‌ర్ పుల్ ఇంటెన్స్ పాత్ర‌లో అల‌రించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. మ‌రో యువ హీరో నిఖిల్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. వెండి తెర‌పై అత‌డు చేయ‌ని ప్ర‌యోగం లేదు. స్టార్ హీరోలంతా రెగ్యుల‌ర్ చిత్రాలు చేస్తున్న రోజుల్లోనే వైవిథ్య‌మైన కాన్సెప్ట్ ల‌ను ఎంచుకుని తానేంటో పాన్ ఇండియాకి ముందే రుచి చూపించాడు. అప్ప‌టి నుంచి అదే పంథాలో ముందుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం చారిత్ర‌క నేప‌థ్యంతో తెర‌కెక్కుతోన్న `స్వ‌యంభు`లో న‌టిస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్ కు వెళ్లి చాలా కాల‌మ‌వుతున్నా? రిలీజ్ విష‌యంలోటీమ్ తొంద‌ర‌ప‌డ‌టం లేదు. ప‌క్కా ఔట్ పుట్ తోనే ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న భారీ ప్రాజెక్ట్ `ది ఇండియా హౌస్ ` లోనూ న‌టిస్తున్నారు. ఎంతో మంది యంగ్ హీరోలున్నా? చ‌ర‌ణ్ ఏరికోరి మ‌రీ నిఖిల్ త‌న బ్యాన‌ర్లో హీరోగా ఎంచుకోవ‌డంతో మ‌రోసారి అత‌డి స‌త్తా ఏంట‌న్న‌ది ప్రూవ్ అయింది. పీరియాడిక్ అంశాలు..జాతీయ ప్రాధాన్య ఉన్న పాయింట్ల‌తో పాన్ ఇండియాలో మార్కెట్ ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని నిఖిల్ భావిస్తున్నాడు.

మ‌రో యంగ్ హీరో తేజ స‌జ్జా కూడా నిఖిల్ వ్యూహాన్నే అనుస‌రిస్తున్నారు. హ‌నుమాన్ తో పాన్ ఇండియాలో సంచ‌ల‌నం సృష్టించిన తేజ తె లివిగా అడుగులు వేస్తున్నారు. సూప‌ర్ హీరో- ఫ్యాంటసీ జానర్లను నమ్ముకున్నారు. మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్, పురాణాల పై ప‌ట్టున్న ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం `జాంబిరెడ్డి` కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోన్న `జాంబిరెడ్డి 2` లో న‌టిస్తున్నారు. ఈసినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. తేజ పాన్ ఇండియా ఇమేజ్ నేప‌థ్యంలో యూనిట్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోంది. ఈ చిత్రాల‌న్ని వచ్చే ఏడాది ఒక్కొక్క‌టిగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇవ‌న్నీ విజ‌యం సాధిస్తే జాతీయ స్థాయిలో యంగ్ హీరోలు ఒకేసారి సంచ‌ల‌నం సృష్టించిన‌ట్లు అవుతుంది.