Begin typing your search above and press return to search.

ఓటీటీ బాట ప‌ట్టిన యంగ్ హీరోలు!

మారుతోన్న కాలానికి అనుగుణంగా యంగ్ హీరోలు తమ రూటు మార్చుకుంటున్నారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా? గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టి పెడుతున్నారు.

By:  Srikanth Kontham   |   22 March 2026 8:45 AM IST
ఓటీటీ బాట ప‌ట్టిన యంగ్ హీరోలు!
X

మారుతోన్న కాలానికి అనుగుణంగా యంగ్ హీరోలు తమ రూటు మార్చుకుంటున్నారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా? గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి `రానా నాయుడు`తో, నాగచైతన్య `దూత` వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాలను అందుకున్నారు. వీరి బాటలోనే మరికొందరు టాలెంటెడ్ యంగ్ హీరోలు డిజిటల్ దునియాలోకి అడుగుపె డుతుండటం ఆసక్తికరం. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌ సందీప్ కిషన్. ఇప్పుడత‌డు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నాడు.

సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న `సూపర్ సుబ్బు` అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఒక పూర్తి స్థాయి బోల్డ్ అండ్ రా సిరీస్ అని సమాచారం. వెండితెరపై చేయలేని ప్రయోగాలు, చెప్పలేని కథలను ఓటీటీ వేదికగా చెప్పవచ్చని సందీప్ బ‌లంగా న‌మ్ముతున్నాడు. ఈనేప‌థ్యంలోనే ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ సిరీస్‌తో డిజిటల్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు ఈ క్యారెక్టర్ పక్కాగా సెట్ అవుతుందని యూనిట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అలాగే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద దేవరకొండ.

అత‌డు నటించిన చిత్రం `తక్షకుడు` థియేట్రిక‌ల్ గా కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే చిత్రం. ఆనంద దేవరకొండ కెరీర్‌లో ఓ విభిన్నమైన ప్రయత్నమిది. థియేటర్ల కంటే ఓటీటీలో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో? ఆనంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా మ‌రో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం `గువ్వల చెరువు షూట్` అనే ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో ఓటీటీలోకి రాబోతున్నాడు. బుల్లి తెర‌పైనా గ్రాండ్ గా సక్స‌స్ అవుతాన‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు. అలాగే సుధీర్ బాబు `గల్లి` అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

వెండి తెరపై భారీ విజ‌యాలు లేక‌పోయినా? ఆ ర‌క‌మైన స‌క్సెస్ ని ఓటీటీలోనైనా చూడాల‌ని ఆశీస్తున్నాడు. ఇలా యువ హీరోలు వరుసగా ఓటీటీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఓటీటీలో సెన్సార్ నిబంధనలు తక్కువగా ఉంటాయి. నటుడిగా తమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల యంగ్ స్టార్స్ డిజిటల్ కంటెంట్‌పై మొగ్గు చూపుతున్నారు. ఇది వారి మార్కెట్ పరిధిని కూడా పెంచుతుంది. ఇంకా స‌రైన కంటెంట్ దొరికితే సీన‌యిర్ హీరోలు చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ లాంటి లెజెండ్స్ కూడా ఓటీటీలోకి రావ‌డానికి సిద్దంగానే ఉన్నారు. ఇప్ప‌టికే కంటెంట్ వెతికే ప‌నిలోనూ వారంతా బిజీ అయ్యారు. వాళ్లలో ఒక‌రైనా మ‌రో సీనియ‌ర్ వెంక‌టేష్ ఇప్ప‌టికే లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే.