లేట్ అయినా లేటెస్ట్‌గా..!
ఈ లిస్ట్‌లో పర్‌ఫెక్షనిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్న అడివి శేష్, నిఖిల్ సిద్ధార్ధ్‌లతో పాటు సాయి ధరమ్ తేజ్, నవీన్ పొలిశెట్టి లాంటి హీరోలు కూడా ఉన్నారు.
By: Tupaki Entertainment Desk | 18 Dec 2025 3:00 PM IST`ఎప్పుడొచ్చామన్నది కాదన్నాయ్యా బుల్లెట్ దిగిందా లేదా?`.. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన `పోకిరి` సినిమాలో మహేష్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని యంగ్ హీరోలు తమ సినిమాల విషయంలో పాటిస్తున్నారు. లేట్ అయినా సరే లేటెస్ట్‌గా వస్తాం అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా స్టార్ హీరోలు రెండేళ్లకు, మూడేళ్లకు ఓ సినిమా చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే ఫార్ములాని యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోలు ఫాలో అవుతున్నారు. స్టార్ హీరోలు బడ్జెట్, భారీ సినిమాల కారణంగా ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ల గ్యాప్ తీసుకుంటుంటే మీడియం రేంజ్ హీరోలు క్వాలిటీ, కంటెంట్ బలంగా ఉండే మూవీస్ కోసం టైమ్ తీసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో పర్‌ఫెక్షనిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్న అడివి శేష్, నిఖిల్ సిద్ధార్ధ్‌లతో పాటు సాయి ధరమ్ తేజ్, నవీన్ పొలిశెట్టి లాంటి హీరోలు కూడా ఉన్నారు.
వీరంతా రెండు మూడేళ్ల గ్యాప్‌తో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. గ్యాప్ ఎక్కువైనా పర్లేదు కంటెంట్ బలంగా ఉంటే టైమింగ్ పెద్ద మ్యాటరే కాదని, ఆ పంథాలోనే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో కంటెంట్ బలంగా ఉంటే గ్యాప్... ఎప్పుడొచ్చామనే టైమింగ్ పెద్ద మ్యాటరే కాదన్నది ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌గా మారింది.
మేజర్, హిట్ 2 వంటి సక్సెస్‌ల తరువాత అడివి శేష్ నుంచి సినిమా వచ్చి మూడేళ్లవుతోంది. ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం బలమైన కంటెంట్ ఉన్న సినిమాతో రావాలనే. ప్రస్తుతం అడివి శేష్ అదే తరహా కంటెంట్‌తో చేస్తున్న సినిమా `డకాయిట్`. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు అడివి శేష్ రైటర్‌గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
శేష్ తరహాలోనే సాయి ధరమ్ తేజ్ కూడా ఆలోచిస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం రెండేళ్లకు పైగానే గ్యాప్ తీసుకున్న తేజ్ `సంబరాల ఏటిగట్టు` సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న తేజ్ దీంతో మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో పని చేస్తున్నాడు. ఇక `హ్యాపీడేస్` బ్యాచ్‌లో హీరోగా నిలబడిన ఒకే ఒక్కడు నిఖిల్ కూడా కరెక్ట్ ప్లానింగ్‌తో సినిమాలు చేస్తున్నాడు.
లేట్ అయినా సరే లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హిట్‌లు కొడుతున్నాడు. `కార్తికేయ 2` తరువాత కాస్త తడబడిన నిఖిల్ ఈ సారి ఖచ్చితంగా కొట్టాల్సిందే అనే ప్లాన్‌తో రెండు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. అందులో ఒకటి `స్వయంభు`. పీరియాడిక్ మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. తన నుంచి సినిమా వచ్చి రెండేళ్లకు పైనే అవుతోంది. ప్రస్తుతం `అనగనగ ఒక రాజు` చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా యంగ్, మీడియం రేంజ్ హీరోలు కంటెంట్ బలంగా ఉంటే టైమింగ్ పెద్ద మ్యాటరే కాదని ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌గా మారింది.
