Begin typing your search above and press return to search.

యంగ్ హీరోల పాన్ ఇండియా కలలు!

టాలీవుడ్ యువ తరం హీరోలు తమ మార్కెట్ పరిధులను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు.

By:  Srikanth Kontham   |   30 April 2026 12:00 AM IST
యంగ్ హీరోల పాన్ ఇండియా కలలు!
X

టాలీవుడ్ యువ తరం హీరోలు తమ మార్కెట్ పరిధులను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు. గతంలో అగ్ర హీరోలకే పరిమితమైన పాన్ ఇండియా ట్రెండ్‌ను నేటి యంగ్ జనరేషన్ హీరోలు అద్భుతమైన కథలతో అందిపుచ్చుకుంటున్నారు. భారీ బడ్జెట్, జాతీయ స్థాయి అప్పీల్ ఉన్న కథలతో బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వారు తీసుకుంటున్న రిస్క్ , పెడుతున్న బడ్జెట్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతోంది. నేచురల్ స్టార్ నాని తన మార్కెట్ రేంజ్‌ను ఊహించని స్థాయికి తీసుకెళ్తున్నారు. `దసరా` చిత్రంతో 100 కోట్ల క్లబ్‌లో చేరి స‌త్తా చాటిన నాని `ది పారడైజ్` చిత్రం కోసం ఏకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో రిస్క్ చేస్తున్నారు.

నాని కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్ చిత్రం కావడం విశేషం. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా? పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించేలా భారీ విజువల్స్‌తో తీర్చిదిద్దుతున్నారు. అక్కినేని నాగచైతన్య కూడా కెరీర్ పంథాను మార్చుకున్నారు. `తండేల్`

విజ‌యంతో చై కూడా 100 కోట్ల క్ల‌బ్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం `వృషకర్మ` అనే అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాలో న‌టిస్తున్నాడు. 120 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెర‌కెక్క‌తోన్న‌ సినిమా తో నేషనల్ లెవల్‌లో మార్కెట్‌ను సుస్థిరం చేసుకోవాలని చైతన్య భావిస్తున్నాడు.

యాక్షన్ - అడ్వెంచర్ కలగలిసిన కథ అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

మరోవైపు విజయ్ దేవరకొండ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేసులో వెనక్కి తగ్గడం లేదు. `లైగర్` వంటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా? తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నమ్ముతున్నాడు. గౌతమ్ తిన్ననూరి తో క‌లిసి `కింగ‌డ‌మ్` చేసినా? ఆ ఫ‌లితం పాన్ ఇండియాలో నిరాశ‌ప‌రిచినా? ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. జాతీయ స్థాయిలో తనకున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌ను మళ్లీ గాడిలో పెట్టేలా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు.

పాన్ ఇండియా విజయాలను అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఇదే బాటలో సాగుతున్నాడు. `కార్తికేయ 2` సాధించిన ఘన విజయంతో ఆయనకు ఉత్తరాదిన మంచి గుర్తింపు ద‌క్కింది. ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోవడానికి `స్వయంభు` వంటి చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలను భారీ బడ్జెట్‌తో చేస్తున్నాడు. ఇంకా యంగ్ హీరోలు లవ్ స్టోరీలకే పరిమితం కాకుండా విభిన్నమైన జోనర్లను ఎంచుకుంటూ మార్కెట్ పరిధిని పెంచుకోవడం టాలీవుడ్ ఎదుగుదలకు నిదర్శనంగా చెప్పొచ్చు.

టాలీవుడ్ యంగ్ హీరోల పాన్ ఇండియా కలలు నిజమైతే? భారతీయ సినీ రంగంలో తెలుగు సినిమా ఆధిపత్యం మరింత పెరుగుతుంది. భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఒకప్పుడు భయపడే వారు. ఇప్పుడు తమ కథలపై ఉన్న నమ్మకంతో వందల కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఈ రిస్క్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాలను అందిస్తుందో చూడాలి. ఏదేమైనా? యువ హీరోల సాహసోపేతమైన అడుగులు టాలీవుడ్ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్తున్నాయన్న‌ది కాద‌న‌లేని నిజం.