Begin typing your search above and press return to search.

టాలీవుడ్ రైటర్స్ మారాల్సిందేనా?

టాలీవుడ్‌ లో కమర్షియల్ సినిమాల ప్రొడక్షన్ స్టైల్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరో, భారీ యాక్షన్, పాటలు, కామెడీ ఉంటే సినిమా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం ఉండేది.

By:  M Prashanth   |   14 July 2026 4:05 PM IST
టాలీవుడ్ రైటర్స్ మారాల్సిందేనా?
X

టాలీవుడ్‌ లో కమర్షియల్ సినిమాల ప్రొడక్షన్ స్టైల్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరో, భారీ యాక్షన్, పాటలు, కామెడీ ఉంటే సినిమా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన పూర్తిగా మారింది. హీరో మాత్రమే కాదు.. సినిమాలో కనిపించే ప్రతి రోల్ కథకు ఎంత ఉపయోగపడింది? ఆ పాత్రకు ఎంత స్ట్రాంగ్ రైటింగ్ ఉంది? అనే విషయాలను ప్రేక్షకులు పరిశీలిస్తున్నారు. దీంతో టాలీవుడ్ రైటర్స్ తమ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? అనే చర్చ వినిపిస్తోంది.

గతంలో కమర్షియల్ సినిమాల్లో కొన్ని పాత్రలు కేవలం ఫార్మాలిటీగా ఉండేవి. హీరో ఫ్రెండ్, హీరోయిన్, విలన్ టీమ్ మెంబెర్స్, కుటుంబ సభ్యులు వంటి పాత్రలు కథను ముందుకు తీసుకెళ్లకపోయినా పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు అలాంటి పాత్రలను వెంటనే గుర్తిస్తున్నారు. కథకు ఉపయోగం లేని సన్నివేశాలు, అవసరం లేని పాత్రలపై సోషల్ మీడియాలోనే చర్చ మొదలవుతోంది.

మరోవైపు, కథలో ప్రతి పాత్రకు స్పష్టమైన ఉద్దేశం ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను మరింతగా ఆదరిస్తున్నారు. చిన్న పాత్ర అయినా కథలో కీలక మలుపుకు కారణమైతే అది ప్రేక్షకుల మదిలో నిలిచిపోతోంది. ఇటీవల విడుదలైన అనేక సినిమాల్లో ప్రధాన పాత్రలతో పాటు సైడ్ క్యారెక్టర్స్ కూడా ప్రశంసలు అందుకోవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ లు చూస్తున్నారు. దీంతో వారి అంచనాలు కూడా పెరిగాయి. ప్రతి రోల్ కు ఒక బ్యాక్‌ స్టోరీ, ఒక టార్గెట్, ఒక ఎమోషన్ ఉండాలని కోరుకుంటున్నారు.

కేవలం హీరోను ఎలివేట్ చేయడం కోసం మిగతా పాత్రలను వీక్ గా చూపిస్తే ప్రేక్షకులు అంగీకరించడం లేదు. సోషల్ మీడియా ఎఫెక్ట్ తో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఏ పాత్ర బాగుంది, ఏ పాత్ర వీక్ గా ఉంది, ఎక్కడ రైటింగ్ తడబడింది అనే చర్చ మొదలవుతోంది. ఒక పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయితే అదే సినిమాకు పెద్ద ప్లస్‌ గా మారుతోంది. కనెక్ట్ కాకపోతే అది సినిమాపై నెగటివ్ ఎఫెక్ట్ చూపుతోంది. దీంతో రైటింగ్‌ పై మరింత బాధ్యత పెరుగుతోంది.

సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, కమర్షియల్ సినిమా అంటే కేవలం హీరో చుట్టూ తిరిగే కథ అనే భావన ఇప్పుడు మారుతోంది. హీరోతో పాటు విలన్, హీరోయిన్, స్నేహితుడు, కుటుంబ సభ్యులు, ఇతర కీలక పాత్రలన్నీ కథలో సహజంగా మిక్స్ అయితేనే సినిమా మరింత బలంగా నిలుస్తోంది. ప్రతి పాత్ర కథను ముందుకు నడిపేలా ఉంటే ప్రేక్షకులు కూడా ఆ సినిమాతో మరింతగా కనెక్ట్ అవుతున్నారు.

టాలీవుడ్‌ లో ఇప్పుడు స్టార్‌ డమ్ ఒక్కటే సరిపోవడం లేదు. స్ట్రాంగ్ స్టోరీతో పాటు ప్రతి పాత్రకు న్యాయం చేసే రైటింగ్ అవసరమవుతోంది. హీరో కోసం మాత్రమే కాకుండా, కథ కోసం ప్రతి పాత్రను రూపొందించే ధోరణి పెరిగితేనే కమర్షియల్ సినిమాలు మరింత ఎఫెక్టివ్ గా మారే అవకాశం ఉంది. మారుతున్న ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్లు రైటింగ్ లో కొత్త ఆలోచనలు తీసుకురావాల్సిన సమయం టాలీవుడ్ రైటర్స్‌ కు వచ్చిందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.