Begin typing your search above and press return to search.

కోర్టు వరకు వెళ్లిన టాలీవుడ్ వేతన వివాదం.. ఇప్పటికే రూ.1.5 కోట్లు నష్టపోయారట

ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి అమ్మిరాజు, సెక్రటరీ అలెక్స్‌లకు లీగల్ నోటీసులు జారీ చేశారు.

By:  M Prashanth   |   8 Aug 2025 8:02 PM IST
కోర్టు వరకు వెళ్లిన టాలీవుడ్ వేతన వివాదం.. ఇప్పటికే రూ.1.5  కోట్లు నష్టపోయారట
X

టాలీవుడ్ లో ప్రస్తుతం కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ విశయంలో సినీ నిర్మాతలు- ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. అయితే తాజాగా అగ్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి అమ్మిరాజు, సెక్రటరీ అలెక్స్‌లకు లీగల్ నోటీసులు జారీ చేశారు.

సమ్మె కొనసాగుతున్న కారణంగా రూ. 1.5 కోట్ల నష్టం జరిగిందని విశ్వప్రసాద్ పేర్కన్నారు. ఈ నష్టాన్ని ఫెడరేషన్ సభ్యులు పంచుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నిర్మాతలు ఇప్పటికే ప్రాథమిక వేతనం కంటే ఎక్కువగానే జీతం చెల్లిస్తున్నారని, అయినప్పటికీ అదనంగా 15% పెంచాలని కోరుతున్న యూనియన్ల డిమాండ్‌ను విశ్వప్రసాద్ తోసిపుచ్చారు

ఫెడరేషన్ కార్యదర్శి, కోశాధికారి తన లేఖకు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని.. తప్పుడు ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే పరిశ్రమ వేతన విధానాలను పునర్నిర్వచించగల చట్టపరమైన పరిష్కారం కోసం విశ్వ ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. అయితే నిర్మాతలు ప్రతిపాదించిన పని వేళలను ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు... ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు మార్చడాన్ని యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అయితే యూనియన్ డిమాండ్లకు భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు రాజీ పడటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. చిన్న చిన్న చిత్రాల నిర్మాతలు మాత్రం వేతన పెంపునకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే, యూనియన్ కాని వారిని అంటే బయటి కార్మికులను నియమించుకుంటామని నిర్మాతలు ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు విశ్వ ప్రసాద్ లీగల్ ఫైట్ ఒత్తిడి టాలీవుడ్‌ లో వివాదాలు ఎలా పరిష్కారమవుతాయో అని ఆందోళనగా ఉంది.

తాజాగా ఈ వివాదం ఇంకా పరిష్కారం కాకపోవడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై నిర్మాతలు షూటింగ్ లు చేయవద్దని ఆదేశించింది. ఫెడరేషన్ నాయకులు, సభ్యులతో చర్చలు జరపవద్దని, తదుపరి సూచనలు ఇచ్చే దాకా ఎలాంటి షూటింగ్ లు చేయవద్దని ఆదేశించింది.

అయితే కొన్ని రోజులుగా సినీ కార్మికులు షూటింగ్ లు ఆపేసి సమ్మే చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వేతనాలు సరిపోవడం లేదని, వాటిని ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. మరోవైపు, కార్మికులకు వేతనాలు బాగానే ఉన్నాయని.. బయటి ఉద్యోగాలతో పోలీస్తే, ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఇస్తున్నామని నిర్మాతలు చెబుతున్న మాట.