వంటింట్లో వండర్స్ చేసే నవతరం కోడళ్లు!
టాలీవుడ్ స్టార్ ఇళ్లు అంటే కేవలం షూటింగ్‌లు, మేకప్, గ్లామర్ మాత్రమే కాదు. అక్కడ కూడా ఘుమఘుమలాడే వంటకాల సందడి ఉంటుంది.
By: Srikanth Kontham | 28 April 2026 10:00 PM ISTటాలీవుడ్ స్టార్ ఇళ్లు అంటే కేవలం షూటింగ్‌లు, మేకప్, గ్లామర్ మాత్రమే కాదు. అక్కడ కూడా ఘుమఘుమలాడే వంటకాల సందడి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మెగా, దగ్గుబాటి వంటి అగ్ర కుటుంబాల్లోకి అడుగుపెట్టిన నవతరం కోడళ్లు తమ వృత్తిపరమైన బాధ్యతలతో పాటు వంటింట్లోనూ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. వీరు కేవలం నటీమణులుగా లేదా వ్యాపారవేత్తలుగానే కాకుండా అత్తారింట్లో ఇష్టమైన వంటలు చేస్తూ అందరి మనసు గెలుచుకుంటున్నారు. ఈ జాబితాలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
వరుణ్ తేజ్ సతీమణి లావణ్యకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడైంది. ఆమెకు సాంబార్ చేయడంలో మంచి పట్టు ఉంది. ఆ రుచికి వరుణ్ కూడా ఫిదా అయిపోతాడని టాక్. ఉత్తరాది నుంచి వచ్చినా? దక్షిణాది వంటకాలను ముఖ్యంగా తెలుగు రుచులను ఆమె ఎంతో నేర్పుగా వండుతారు. ఖాళీ సమయాల్లో వంటగదిలో కొత్త ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. సూపర్ స్టార్ మహేష్ సతీమణి కూడా వంట చేస్తారు. రోజు కాకపోయినా? అప్పుడప్పుడు గరిట పడుతుంటారు. ఖాళీ సమయంలో మహేష్ కు వండి వడ్డించడం అంటే ఇష్టంగా భావిస్తారు.
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా రేర్ గా కిచెన్ సంగతేంటో చూస్తుంటారు. బేసిక్ గా వంటలు రాకపోయినా? అత్తమ్మ సురేష్ నుంచి చరణ్ కి ఇష్టమైన కొన్ని రకాల వంటకాలు నేర్చుకున్నారు. చరణ్ అడిగినప్పుడు వాటిని వండి పెడుతుంటారు. దగ్గుబాటి వారి కోడలు మిహీకా బజాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రానా దగ్గుబాటి భార్య మిహీకాకు ఫుడ్ అంటే అమితమైన ఇష్టం. కానీ వండటం మాత్రం పెద్దగా రాదు. ఇంటీరియర్ డిజైనింగ్ - ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో బిజీగా ఉంటారు. అయితే బేకింగ్ - డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ వంటి డెజర్ట్స్ తయారు చేయడంలో స్పెషలిస్ట్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతమీణి లక్ష్మి ప్రణతి కూడా వంట గదిలో అత్తమ్మకు సహాయంగా ఉంటారు. ఇంట్లో పనివాళ్లు ఉన్నా? అప్పుడప్పుడు తారక్ కోసం మామ్ రుచికరమైన నాన్ వెజ్ వంటకాలు చేస్తుంటారు. ఆ సమ యంలో ప్రణతి సహాయం చేస్తుంటారు. భర్త కోసం తాను కూడా కొన్ని వంటకాలు నేర్చుకునే ఉంటారు. యువ సామ్రాట్ నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ కూడా మంచి చెఫ్. అన్ని రకాల వంటకాలు చేయడంలో స్పెషలిస్ట్. తెలుగు అమ్మాయి కావడంతో? ఆంధ్రా-తెలంగాణ స్టైల్ వంటకాలు చేస్తారు. ఇంకా చాలా మంది హీరోల భార్యలు భర్తల కోసం గరిటి పట్టిన వాళ్లే. నేటి తరం సినీ కోడళ్లు కేవలం గ్లామర్ బొమ్మల్లా కాకుండా? ఇంటి బాధ్యతలను, వంటను ఒక కళగా భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం , ఇంటి రుచుల ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. కెరీర్ లో ఎంత ఎత్తుకు ఎదిగినా? కుటుంబ సభ్యుల కోసం స్వయంగా వంట చేసి వడ్డించడంలో ఉండే తృప్తి వేరని నిరూపిస్తున్నారు.
