మరో టాలీవుడ్ హీరో పెళ్లి.. ఎప్పుడంటే?
టాలీవుడ్ లో వరుసగా వివాహ వేడుకల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో మరో స్టార్ ఫ్యామిలీకి చెందిన హీరో పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
By: M Prashanth | 31 March 2026 4:53 PM ISTటాలీవుడ్ లో వరుసగా వివాహ వేడుకల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో మరో స్టార్ ఫ్యామిలీకి చెందిన హీరో పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల యంగ్ హీరో అల్లు శిరీష్- నయనిక, విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
అదే సమయంలో మరో ప్రముఖ కుటుంబానికి చెందిన యంగ్ హీరో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆ హీరో.. లేటెస్ట్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా పెళ్లి ఏర్పాట్లపై దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఆ విషయంపై ఇప్పటివరకు సదరు హీరో గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వార్తలు బయటకు రావడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ఎవరు ఆ హీరో? ఏ కుటుంబానికి చెందినవారు? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. కొందరు ఇప్పటికే పేర్లు ఊహిస్తూ పోస్టులు పెడుతుండగా, మరికొందరు ఇది కేవలం రూమర్ మాత్రమే కావచ్చని భావిస్తున్నారు.
ఇక టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో పలువురు యంగ్ హీరోలు వరుసగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. తమ వ్యక్తిగత జీవితాన్ని సెట్ చేసుకునే దిశగా వారు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ హీరో పెళ్లి వార్తలు రావడం సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అయితే ఆ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, విడుదలకు సిద్ధమవుతోంది.
అందుకే సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడని సమాచారం. వర్క్ ను పూర్తిగా ముగించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, స్టార్ ఫ్యామిలీల్లో జరిగే వివాహాలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భారీ స్థాయిలో వేడుకలు, సెలబ్రిటీల హాజరు, గ్రాండ్ ఏర్పాట్లు ఆ పెళ్లిళ్లకు ప్రత్యేకతను తెస్తాయి.
అందుకే ఆ రూమర్ నిజమైతే, సదరు హీరో పెళ్లి కూడా టాలీవుడ్ లో పెద్ద ఈవెంట్ గా మారే అవకాశం ఉందని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ అనధికారిక సమాచారం మాత్రమే. అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే వరకు వీటిని రూమర్స్ గానే తీసుకోవాలి. త్వరలోనే ఆ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి మరో స్టార్ హీరో పెళ్లి వార్తలు టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుండగా, సినీ ప్రియులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
