Begin typing your search above and press return to search.

వాళ్ల‌కంటే మ‌న‌వాళ్లే బెట‌ర్! ఇదేం షాక్ భాయ్?

ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్ అభ‌ద్ర‌తా భావం గురించి మాట్లాడి వాళ్ల గుట్టును విప్పేసాడు. హిందీ హీరోల్లో కూడా ఎంత మాత్రం ఐక్య‌త ఉండ‌ద‌న్నారు.

By:  Srikanth Kontham   |   15 Dec 2025 6:00 PM IST
వాళ్ల‌కంటే మ‌న‌వాళ్లే బెట‌ర్! ఇదేం షాక్ భాయ్?
X

టాలీవుడ్-బాలీవుడ్ మ‌ధ్య వ్య‌త్యాసం చెప్పాల్సి వ‌స్తే? హిందీ న‌టుల మ‌ధ్య ఐక్య‌త హైలైట్ అవుతుంది. ఒకరి సినిమాల్లో మ‌రో స్టార్ న‌టించ‌డం... మ‌ల్టీస్టారర్స్ లో భాగ‌మ‌వ్వ‌డం...క‌లిసి టాక్ షోల్లో పాల్గొన‌డం..మాట మంతి వ్య‌వ‌హార‌మంతా చూసి వాళ్లలా టాలీవుడ్ హీరోలు ఎందుకు? ఉండ‌రు అనిపించేది.

బాలీవుడ్ కి భిన్నంగా టాలీవుడ్:

ఎందుకంటే కొంత కాలం క్రితం టాలీవుడ్ హీరోలెవ‌రు? మ‌రో హీరో సినిమా గురించి మాట్లాడ‌టం గానీ, క‌లిసి న‌టిం చ‌డం గానీ, ఒకే వేదిక‌ను షేర్ చేసుకోవ‌డం గానీ క‌నిపించేవి కావు. వాళ్ల‌లో వాళ్ల‌కే తీవ్ర‌మైన పోటీ ఉంటుంద ని..క‌లిసిన‌ప్ప‌డు మాట్లాడితే? బ‌హ్మాండం బద్ద‌లైపోతుంద‌నే తీరులో క‌నిపించేవారు. తెర వెనుక ఎలా ఉంటారు? అన్న‌ది తెలియ‌దు గానీ, తెర ముందు మాత్రం తెలుగు స్టార్లు అంతా అలాగే క‌నిపించేవారు. ఇప్పుడా స‌న్నివేశానికి భిన్నంగా టాలీవుడ్ హీరోలంతా క‌నిపిస్తున్నారు.

క‌లిసి మ‌ల్టీస్టారర్స్ చేయ‌డం, పాన్ ఇండియా చిత్రాలు చేయ‌డం, ప్రీ రీలీజ్ ఈవెంట్ల‌కు అతిధులుగా రావ‌డం...స్టార్ హీరో చిత్రంలో మ‌రో స్టార్ గెస్ట్ రోల్ లో క‌నిపించ‌డం వంటివి ఇప్పుడు చూస్తోన్న స‌న్నివేశాలు. దీంతో టాలీవుడ్ హీరోల్లో చాలా మార్పులొచ్చాయి..ఎంతో ఐక్య‌త‌గా ఉంటున్నారు? అన్న‌ది తెర ముందు క‌నిపిస్తుంది. కానీ బాలీవుడ్ హీరోల్లో మాత్రం తెర ముందు కనిపించినంత ఐక్య‌త‌ తెర వెనుక ఉండ‌ద‌ని తాజాగా హిందీ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్ మాట‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అదంతా తెర వెన‌కే:

ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్ అభ‌ద్ర‌తా భావం గురించి మాట్లాడి వాళ్ల గుట్టును విప్పేసాడు. హిందీ హీరోల్లో కూడా ఎంత మాత్రం ఐక్య‌త ఉండ‌ద‌న్నారు. ఒక‌రు సినిమా మ‌రొక‌రు చూడ‌టం గానీ, న‌ట‌న ప‌రంగా న‌చ్చితే ప్ర‌శంసించ‌డం గానీ ఉండ‌వ‌న్నాడు. ఎంతో పాజిటివ్ గా ఉండే న‌టులు త‌ప్ప చాలా మంది మ‌రో స్టార్ న‌టుడి చిత్రం గురించి ఓపెన్ గా మాట్లాడ‌టానికి ముందుకు రార‌న్నారు. తెర‌పై ఎన్నో గొప్ప పాత్ర‌లు..స‌మాజాన్ని చైత‌న్య ప‌రిచే పాత్ర‌ల్లోనూ అల‌రిస్తుంటారు. కానీ అది తెర వ‌ర‌కే ప‌రిమితం. వాస్త‌వం జీవితంలో అవేమి ఉండ‌వ‌న్నారు.

హృతిక్ తాజా కామెంట్ ఆసక్తిక‌ర‌మే:

ప‌రిశ్ర‌మ‌లో పోటీకి త‌గ్గ‌ట్టు ఒక‌రికొక‌రు ఎత్తుగ‌డ‌లు వేస్తూ ముందుకు వెళ్ల‌డం త‌ప్ప మ‌రో ఆలోచ‌న లేకుండా న‌టులు ఉంటార‌న్నాడు. మొత్తానికి మ‌నోజ్ మాట‌ల్ని బ‌ట్టి బాలీవుడ్ లో కూడా ఇన్ సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువ‌న్న‌ది క్లియ‌ర్. ఇటీవ‌లే ర‌ణ‌వీర్ సింగ్ న‌టించిన `ధురంధ‌ర్` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. సినిమా 500 కోట్ల వ‌సూళ్ల దిశ‌గా అడుగులు వేస్తుంది. ఈ సినిమా గురించి హృతిక్ రోష‌న్ పాజిటివ్ గా మాట్లాడుతూనే? అందులో నెగిటివ్ అంశాన్ని ట‌చ్ చేసాడు. దీంతో ర‌ణ‌వీర్ సింగ్ అభిమానులు హృతిక్ పై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.