Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో తండ్రికొడుకులే అన్న‌ద‌మ్ముల్లా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తాత‌లు, తండ్రుల వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని రాణిస్తోన్న వారెంతో మంది.

By:  Srikanth Kontham   |   6 Feb 2026 11:33 AM IST
ఇండ‌స్ట్రీలో తండ్రికొడుకులే అన్న‌ద‌మ్ముల్లా!
X

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తాత‌లు, తండ్రుల వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని రాణిస్తోన్న వారెంతో మంది. దిగ్విజ యంగా లెగ‌స్సీని కొన‌సాగిస్తూ ప‌రిశ్ర‌మ అనే చ‌రిత్ర‌లో త‌మకంటూ కొన్ని పేజీలు రాసి పెట్టుకుంటున్నారు. టాలీవుడ్ వార‌సుల్ని గ‌మ‌నిస్తే ఏఎన్నార్-నాగార్జున‌, సూప‌ర్ స్టార్ కృష్ణ‌-మ‌హేష్, సీనియ‌ర్ ఎన్టీఆర్- బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్‌, కృష్ణంరాజు-ప్ర‌భాస్, నాగార్జున‌-నాగ‌చైత‌న్య‌, అఖిల్ ఇలా తండ్రుల వార‌స‌త్వాన్ని త‌న‌యులు కొన‌సాగిస్తున్నారు. సీనియ‌ర్ స్టార్స్ జ‌మానాలో త‌ల్లి-దండ్రుల మ‌ధ్య వ‌త్యాసం స్ప‌ష్టంగా క‌నిపించేది.

కానీ నెటి జ‌న‌రేష‌న్ హీరోల్ని తండ్రుల‌తో పోల్చ‌డ‌మే ఇబ్బందిగా మారింది. వ‌య‌సు వ్య‌త్యాసం భారీగా ఉన్నా? ఫిట్నెస్ మెయింటెనెన్స్ అదే వ‌య‌సును తండ్రులు దాచేస్తున్నారు. దీంతో త‌ల్లిదండ్రులు అన్న‌దమ్ముల్లా హైలై ట్ అవుతున్నారు. రామ్ చ‌ర‌ణ్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాబాయ్ అవుతారు. కానీ చ‌ర‌ణ్ ని ప‌వ‌న్ త‌మ్ముడిగా భావిస్తారు. ప‌వ‌న్ స్వీట్ గా నా చిన్న‌త‌మ్ముడు అని సంబోధిస్తారు. బాబాయ్ అని పిల‌వ‌డంలో? రామ్ చ‌ర‌ణ్ కూడా కాస్త అసౌక‌ర్యంగా పీల‌వుతాడు. అభిమానులు కూడా అబ్బాయ్-బాబాయ్ కంటే? అన్న‌ద‌మ్ముల్లా బాగున్నారంటూ సంబ‌ర‌ప‌డ‌తారు.

తాజాగా మాస్ రాజా ర‌వితేజ‌- మాధ‌వ్ మ‌ధ్య బాండింగ్ కూడా అలాగే ఉంటుంద‌ని తేలింది. ర‌వితేజ సోద‌రుడు ర‌ఘు త‌న‌యుడు మాధ‌వ్ హీరోగా లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ మాధ‌వ్ కు పెద‌నాన్న అవుతాడు. కానీ మాధ‌వ్ పెద‌నాన్న‌ని అలా పిల‌వ‌డు. ఓ ప్రెండ్ లా ఫీల‌వుతాడుట‌. ఇంట్లో వారిద్ద‌రు అలాగే మూవ్ అవుతామ‌ని తెలిపాడు. పెద‌నాన్న అని పిలిపించుకోవ‌డం కూడా ర‌వితేజకు ఇష్టం ఉండ‌ద‌ట‌. కానీ ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్యత్యాసం చూస్తే స‌గానికి పైగా ఉంటుంది. ర‌వితేజ జోవియ‌ల్ ప‌ర్స‌న్.

వెండి తెర‌పై ఎలా క‌నిపిస్తాడో? ఆఫ్ ది స్క్రీన్ కూడా రాజా అలాగే ఉంటాడు. త‌న సొంత పిల్ల‌ల‌తో కూడా అలాగే మెలుగుతారు. ర‌వితేజ కి హీరో అయ్యే కొడుకున్నాడు. ఇద్ద‌రు ఇంట్లో ఎంతో స‌ర‌దాగా ఉంటారు. తాజాగా వీరి జాబితా లోకి ఆ ఇద్ద‌రు కూడా చేరుతారేమో. ఇంత‌కీ ఎవ‌రా ఆ ఇద్ద‌రు అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఘ‌ట్ట‌మ‌నేని కుటుబం నుంచి సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ హీరోగా లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అదే కుటుంబం నుంచి హీరోగా వ‌చ్చిన మ‌హేష్ తండ్రి లెగ‌స్సీని కొన‌సాగిస్తున్నారు.

తండ్రిని మించిన‌ త‌న‌యుడిగా ఎదుగుతున్నారు. అదే బాబాయ్ స్పూర్తితో జ‌య‌కృష్ణ లాంచ్ అవుతున్నాడు. బాబాయ్ నుంచి అన్ని ర‌కాల మ‌ద్ద‌తు జ‌య‌కృష్ణ‌కు ల‌భిస్తుంది. త‌న‌ని పెద్ద స్టార్ గా చూడాల‌న్న‌ది మ‌హేష్ కోరిక‌. అత‌డిని స్టార్ గా తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త మ‌హేష్ పై ఉంది. బ్యాకెండ్ లో మ‌హేష్ చేయాల్సిందంతా చేస్తున్నారు. అయితే బాబాయ్ తో జ‌య‌కృష్ణ బాండింగ్ ఎలా ఉంటుంది? అన్న‌ది తెలియాలి. చూడ‌టానికి ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల్లా ఉంటారు. బాబాయ్-కొడుకు అంటే న‌మ్మ‌డం క‌ష్టం. మ‌రి వ్య‌క్తిగ‌తంగా వారిద్ద‌రు ఎలా మూవ్ అవుతారు అన్న‌ది తెలియాలి.